సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, December 31, 2009
సింహావలోకనం...
"Doctor Zhivago" సినిమాలో ఒక సీన్లో Zhivago(Omar Sharif) రాత్రి పూట కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. అతను కాగితం మీద పెన్ తో రాస్తున్న చప్పుడు తప్ప మనకు ఇంకేమీ వినిపించనంత నిశ్శబ్దం..!! అలాంటి నిశ్శబ్దం లో ఏదన్నా రాయాలనే తపన ఇంకా ఇంకా ఎక్కువౌతూ ఉంటుంది. ఈ పౌర్ణమి పూటా ప్రస్తుతం నేను చేస్తున్నదీ అదే...కాకపోతే పెన్ చప్పుడు బదులు కీప్యాడ్ టకటకలు...!!
రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" (Bird's eye view) అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. నేను కూడా అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. బ్లాగుల గురించి విశ్లేషించే సాహసం నేను చేయదలుచుకోలేదు. ఈ సంవత్సరంలో నాకు నచ్చిన కొన్ని టపాల గురించి మాత్రం రాయాలని...నేను బ్లాగు తెరిచి ఏడు నెలలు...నాకు దొరికిన సమయంలో, నాకు తెలిసిన బ్లాగుల్లో, నేను చదివినవాటిల్లో కొన్నింటిని ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. ఇంతకన్న బాగున్న టపాలు నేను "మిస్" అయి ఉండవచ్చు...కానీ ముందు చెప్పినట్లు ఇవి "బెస్ట్" అని నేననను కానీ నేను చదివినవాటిల్లో నాకు నచ్చినవి అంతే.
నెలలవారీగా ఒకోటీ చెప్పుకు వస్తాను...
ముందుగా పాతవైనా 2008 డిసెంబర్ లో ప్రచురితమైన 3 టపాలను ప్రస్తావించలేకుండా ఉండలేకపోతున్నాను.
"నేను-లక్ష్మి" బ్లాగ్ లో 2008 decలో ప్రచురితమైన "పిట్టకధ - కొత్త సంవత్సరం"
మనసుకు హత్తుకునే మాటలు, ఉన్నతమైన భావలు, ఆచరింపదగిన మంచి సూత్రాలూ, జీవిత సత్యాలూ ఈ బ్లాగర్ టపాల్లోని ప్రత్యేకతలు.
ఇక "పలకాబలపం" లో 2008 dec టపా "బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?"
ఈ టపాలో బ్లాగర్లు ఎందుకు బ్లాగుతారో తనదైన శైలిలో చక్కగా వివరిస్తారు అరిపిరాల సత్యప్రసాద్ గారు.
కోతి కొమ్మచ్చి తెచ్చి చదివించి...అంటూ "పుస్తకం.net" లో రాసినా, "నవతరంగం"లో సినిమా కబుర్లు రాసినా చివరి వాక్యం దాకా మనతో చదివించేలా ఉంటాయి ఈ బ్లాగర్ టపాలు. ఈ బ్లాగ్ కు నేను రెగులర్ రీడర్ను కాకపోయినా "అన్నం ఒక్క మెతుకు చూస్తే చాలు.." అన్నట్లుంటాయి ఈయన టపాలు.
"నా తెలుగు సినీ దర్శకులు"అంటూ dec 2008 లో ఉమా శంకర్ గారు రాసిన టపా నాకు భలే నచ్చేసింది. మురళిగారి బ్లాగ్ల పరిచయం తో నాకు పరిచయమైన ఈయన బ్లాగు నేను తరచూ చూసే బ్లాగుల్లో ఒకటి. ఈయన కొత్తగా మొదలుపెట్టిన బ్లాగ్లో అయినా తరచూ టపాలు రాసి మరిన్ని మంచి టపాలు అందిస్తే బాగుంటుందని ఆశ.
ఇక 2009 టపాల్లోకి వచ్చేస్తే భైరవభట్ల కామేశ్వరరావు గారి "తెలుగు పద్యం" బ్లాగ్లో may '09లో ప్రచురించబడిన "జుగల్బందీ" గజల్స్ పట్ల, తెలుగు కవిత్వం పట్ల ఆయనకున్న మక్కువను తెలుపుతుంది. కృష్ణశాస్త్రి కవిత చదువుతూ జగ్జీత్ సింగ్ గజల్ వింటూ ఆయన పొందిన భావుకత్వానికి అక్షరరూపం ఈ టపా. ఇందులో ఆయన రాసిన జగ్జీత్ సింగ్ గజల్ లోని సాహిత్యం చిన్నప్పుడు ఒక పుస్తకంలో "కవిత" రూపంలో చదివి బాగుందని నేను రాసుకుని దాచుకున్నా. తరువాత టి.విలో ఒక లైవ్ కాన్సర్ట్ లో జగ్జీత్ సింగ్ పాడుతూండగా రికార్డ్ చెసుకోవటం జరిగింది. ఆ కవిత నాకు చాలా ఇష్టం.
నాకు ఇటివలే పరిచయమైన నిషిగంధ గారి "మానసవీణ"లో may '09లోని "మనోనేత్రం" కవిత నన్నెంతో ఆకట్టుకుంది. చాలా లేటుగానైనా ఇంత మంచి కవిత్వాన్ని ఆస్వాదించే అవకాశం దొరికినందుకు సంబరపడుతూ ఉంటాను.
కూడలిలో అడుగుపెట్టిన మొదటి రోజు నాకు పరిచయమైన వ్యాఖ్యాతల్లో ఒకరు "సిరిసిరిమువ్వ"గారు. నా ప్రతి టపాకూ వ్యాఖ్య రాయకపోయినా ఈవిడ నా బ్లాగ్ రెగులర్ రీడర్ అని నాకు నమ్మకం. june '09లో తన బ్లాగ్లో రాసిన "నా ఉపవాస దీక్ష" టపా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.
july '09 లో ప్రచురితమైన "నా స్పందన" బ్లాగర్ లలిత గారి "కెవ్వ్...వ్వ్...వ్...కేక(గుండెని గుల్ల చేసే సెంటిమెంట్)" టపా గురించి నే చెప్పేకన్నా మీరు చదివి కెవ్వ్...కేక...అనాలంతే..!!
క్వాంటిటీ కన్నా క్వాలిటి ముఖ్యమని ఆవిడ 82 టపాలకు వచ్చిన 2670 వ్యాఖ్యలే తెలుపుతాయి. ఏ విషయన్నైనా సూటిగా, నిర్భయంగా రాయగల ధైర్యం ఉన్న బ్లాగర్ సుజాతగారు. ఇంకా పాడాలా? అని ప్రశ్నించినా, ఆటోగ్రాఫ్ల గురించి ప్రస్తావించి మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళినా, ఓటర్ల తీరుపై విచారం వ్యక్తం చేసినా....ఈవిడే రాయాల్సిందే అని మనకు అనిపిస్తుంది. july '09 లోని "చందమామల్లాంటి బ్లాగులు" నాకు బాగా నచ్చిన టపా.
జ్యోతిగారు నడుపుతున్న బ్లాగులు, చేస్తున్న కార్యక్రమాలూ చూసి ఈవిడకు ఎన్ని చేతులున్నాయో, 24 గంటలు ఎలా సరిపోతాయి లాంటి ప్రశ్నలు రాక మానవు . ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన "జ్యోతి" బ్లాగ్లోని ఈ Sep ’09 వ్యాసం "ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు... " నన్నెంతగానో ఆకట్టుకుంది.
ఇక "కొత్తపాళీ" గారి బ్లాగ్ గురించి నేను చెప్పేదేముంది...ఆ బ్లాగ్లో వ్యాఖ్య రాయాలంటే మాటలు వెతుక్కోవాలి, బోలెడు విషయ పరిజ్ఞానం కావాలి. "బ్లాగుల పరిధి ఇప్పుడున్న దానికంటే ఒక వందరెట్లయినా విస్తరించాలి. దైనిక ప్రాతిపదికన జాల విహరణ (browsing the net on a daily basis) చేసే తెలుగు వారి సంఖ్యలో కనీసం 10 శాతం బ్లాగు పాఠకులు కావాలని నా కోరిక " అంటూ ఆయన రాసిన Sep ’09 లోని"బ్లాగులూ-బ్లాగర్లూ" టపా బ్లాగుల అభివృధ్ధిని గురించిన ఆయన తపనను తెలుపుతుంది.
"స్వర్ణముఖి" బ్లాగర్ చైతన్య వయసులో చిన్నవాడైనా అతనికున్న విషయ పరిజ్ఞానం నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది. "శరద్చంద్రికోత్సవం"అంటూ oct 2009 లో ఈ ఉత్సవాన్ని గురించి వివరిస్తూ, అతను చూసిన సంగీతసామ్రాట్టుల కచేరిల గురించి రాసిన టపా సంగీతప్రేమికురాలైన నాకు బాగా నచ్చేసింది. చిన్న తేడా వచ్చినప్పుడు నేను అలిగితే, సహనం వహించి నన్ను అర్ధం చేసుకున్న మనిషి..బ్లాగ్లోకం నాకు అందించగా నాకు పరిచయమై నన్ను అప్యాయంగా "అక్కా" అని పిలిచే ఓ మంచి "తమ్ముడు" ఇతను.
వంద టపాల తరువాత నేను విరామం ప్రకటించినప్పుడు నా కోసం "కవిత" రాసి నా మనసు దోచుకున్న "మనస్వి" జయగారు. Oct '09లో "బుర్రలేని పిల్ల" అని .అనాధ బాలిక గురించి ఆవిడ రాసిన ఒక నిజ జీవిత సంఘటన ఆవిడలోని ఉత్తమ సంస్కారానికీ, మూర్తీభవించిన మానవత్వానికీ ప్రతీక.
ఇక "నాన్న" భాస్కర్ గారి గురించి నే చెప్పేదేముంది...రకరకాల బ్లాగులు నడపడంలో , వంటలలో, సాంకేతిక నైపుణ్యంలో, తెలివితేటల్లో ఆయనకాయనే సాటి. బ్లాగ్లోకానికి నాన్నగారైనా....అలవాట్లు, కొన్ని పోలికలను బట్టి నాకు మా అన్నయ్యను తలపించే అన్నగారు నాకు.
Oct '09లో "గడిచిపోయిన నిన్నటికీ రాబొయే రేపటికీ మధ్యనున్న నిశ్శబ్దం" అంటూ "బిగ్ బీ" గారి ప్రసంగానికి అనువాదాన్ని రాసిన ఈ టపా నాకిష్టం.
" నాతో నేను నా గురించి" అంటూ వేణూ శ్రీకాంత్ గారు రాసే చిన్ననాటికబుర్లు చదివి బాల్యంలోకి వెళ్ళని బ్లాగర్ ఉండరు. "ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా?" అంటూ నాన్నగారితో షికార్లు, "అంతా మన మంచికే" అంటూ చిన్నతనంలో నేను చదివిన "ట్వింకిల్" కధ...మెలోడియస్ పాటల్ని, ఎన్నో స్మృతులు రాసి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూంటారీయన.
Oct '09లో "ఐస్ ఐస్ పుల్లైస్.. " అంటు బ్లాగర్లందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళారు. మొదట్లో అక్కడక్కడ ఈయన వ్యాఖ్యలను చదివి నా బ్లాగ్లోకి తొంగి చూడరెందుకో అనుకునేదాన్ని. హఠాత్తుగా ఒకరోజు ఆయన తరచూ చూసే బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగ్ పేరుని చూసి ఆశ్చర్యపోయాను.
"బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" సారధి "గీతాచార్య" ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ తమ్ముడికి కూడా వంద చెతులేమన్నా ఉన్నాయేమో అని నా అనుమానం. Oct '09లో "మరువం" లో ప్రచురితమైన "అయిబు పాడిన అమ్మ పాట" కధ ఎందరో బ్లాగ్మిత్రుల మన్ననలు పొందింది.
ఇహ బ్లాగర్ల అభిమాన ఆడపడుచు "పరిమళం" గారి బ్లాగ్లో Nov '09లో ప్రచురితమైన "దివ్యగుణములు" టపా మానవునికి కావాల్సిన పదహారు దివ్యగుణముల గురించి తెలుపుతుంది.
నా "బంగారు పాపాయి" టపా ద్వారా నాకు పరిచయమైన మాలా కుమార్ గారి బ్లాగులన్నీ మధురస్మృతుల సమాహారాలు. Nov '09లో "సాహితి" లో ప్రచురితమైన "ఊర్వశి" టపా "ముదితల్ నేర్వగలేని విద్య గలదే ముద్దార నేర్పించినన్..." అన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.
చాలామందిలాగే నేను ఈ బ్లాగ్ అభిమానిని. రోజూ దినపత్రికను చూడకపోతే తోచనట్లే, రోజూ బ్లాగ్లోక విహారం మొదలెట్టగానే కొత్త టపా ఉన్నా లేకున్నా, ఓ సారీ "నెమలికన్ను"లోకి తొంగి చూడనిదే బ్లాగులు చూసినట్లే అనిపించదు. జ్ఞాపకాలను నెమరువేసుకోవటంలో ఈయన తరువాతే ఎవరైనా అనిపించి మురిపిస్తాయీయన టపాలు. Nov '09లో ప్రచురించిన "పోలి స్వర్గం" నాకెంతో నచ్చిన టపా.
చెప్పాపెట్టకుండా అప్పుడప్పుడు మాయమైపోతూ, ఏమయ్యారో అనుకునేలోపూ మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్ష్యమైపోయే ఈయన "సార్ధకనామధేయులే" అనిపిస్తూ ఉంటుంది నాకు.
మన కవితారాణి ఉషగారి కవితాగానాల "మరువపువనం" నుంచి ఎంత వెతికినా ఒక్కదాన్నీ విడదీయలేకపోయాను. అందుకే Dec '09 లో ప్రచురితమైన, నాకు బాగా నచ్చిన "విశ్వామిత్ర" సీరియల్లోని "చివరి భాగాన్ని" నచ్చిన టపాగా అందిస్తున్నాను.
నా "ఉత్తరాలు" టపా ద్వారా నాకు పరిచయమైన భావనగారి "కృష్ణపక్షం" సున్నితమైన భావోద్వేగాల లేఖాసమూహం.
Dec '09 లో ప్రచురితమైన "ఒంటరి గూడు" టపా నన్నెంతగానో ఆకట్టుకుంది. రెండు విభిన్న దృక్పధాల మధ్యనున్న సంఘర్షణను, రెండు మనసుల వాదనలనూ వారి వారి దృష్టికోణాల నుంచి చూపించి, మనస్తత్వ విశ్లేషకురాలా? అనిపించేలా రచనలు చేసే భావనగారి "కృష్ణపక్షం" రెగులర్ రీడర్ని నేను .
"లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్" అన్నట్లు ఇటీవలకాలంలో మొదలై ప్రతి టపాతో మనతో "ఆహా" అనిపిస్తున్న బ్లాగ్ "నా గోల".
ఈ బ్లాగ్లో Dec '09 లో ప్రచురితమైన "నీకు నువ్వు తెలుసా?"
కవిత అద్భుతం. చదివితే మీకే తెలుస్తుంది.
ఇవండీ నాకు నచ్చిన , నాకు తెలిసిన కొన్ని మంచి టపాలు. మీక్కూడా నా "సింహావలోకనం" నచ్చిందనే భావిస్తాను.
ఈ 2009 సంవత్సరానికిక శెలవు మరి....
ఇన్నాళ్ళూ వ్యాఖ్యల రూపంలో నాకు ప్రోత్సాహానిచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ నా వ్యాఖ్యలతో కానీ, టపాలతో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని మనవి...
"బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.."
Subscribe to:
Post Comments (Atom)
46 comments:
హ హ మీ సింహావలోకనం బాగుందండీ... నాటపాలు మిమ్మల్ని అలరిస్తున్నందుకు సంతోషం. నా బ్లాగ్ లిస్ట్ నేను తరచుగా అప్డేట్ చేయనండీ అందుకే మీ బ్లాగ్ చేర్చడానికి అంత టైం పట్టింది :-) ఈ ఆలశ్యం వలన కొన్ని మంచి బ్లాగులు మిస్ అవుతుంటాను కానీ ఏం చేయను సమయాభావం, ఈ మధ్యే కాస్త తీరిక చిక్కి మళ్ళీ కూడలి లో గడుపుతున్నాను.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆహా నా పేరు,కవితారాణి నాకు తెగ నచ్చేసింది. ;) థాంక్స్ తృష్ణ అన్నిటికీను.మన మైత్రి మరొక యేడాదిలోకి పయనిస్తుందిక. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ఇన్ని లింకులిచ్చారంటే ఎంత రెగ్యులర్ గా మీరు బ్లాగులు చదువుతారో తెలిసిపోతోంది. అమ్మో! బావుందండీ తృష్ణా, ఈ ఒక్క పొస్టు చదివితే 2009 లో బ్లాగులన్నీ చదివిన ఫలితం దక్కుతుందన్నమాట.
బాగున్నదండి మీ "సింహావలోకనం". నేను చూడని, చదవని టపాలు,బ్లాగులూ కొన్ని పరిచయం చేసారు.
"ఆ..ఆఅ...ఆఅ.."
కమల్‌హాసన్ స్టైల్లో.
ఏంటో ఈ మధ్య ఎక్కడ చూసినా బ్లాగర్ల గురించి టపాల గురించిన సింహావలోకన టపాలే!..బాగుందండి మీ టపా!
నిజమే మీరన్నట్లు నేను వ్యాఖ్యలు వ్రాయటం తక్కువే కాని కొన్ని బ్లాగులు క్రమం తప్పకుండా చదువుతాను..అందులో మీది కూడా ఒకటి..వ్యాఖ్యలు వ్రాయకపోవటానికి సమయాభావంతో పాటు..బద్దకస్వభావం కూడా.. నా బ్లాగులో కూడా వచ్చిన అన్ని వ్యాఖ్యలకి సమాధానాలు ఇవ్వటానికి బద్దకిస్తుంటాను.. రాబోయే సంవత్సరంలో అన్నా ఈ బద్దకం వదల్తుందేమో చూద్దాం. నా టపాని తిరిగి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆ అందమైన బ్లాగుల్ని ఈ అందమైన బ్లాగ్లో చూడటం ఎంతో ఆనందంగా వుందండి..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
చాలా కృషి చేశారండీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మా 'బుర్రలేని పిల్ల ' అంత నచ్చిందా మీకు. అయితే ఆ పిల్లకు చెప్తాన్లే...నువ్వు తృష్ణకి బాగా నచ్చావట...అని. మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పాపకి నా స్పెషల్ విషెస్.
కలెక్షన్ బాగుంది.
హయ్య బాబోయ్ తృష్ణ గారూ ! ముందుగా మీ" సింహావలోకనం" కు నా జోహార్లు !ఆ తర్వాతే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .మాకందరకూ మీరిచ్చిన ఈ కానుక చాలా చాలా బావుందండీ ....
Very very nice collection. Some of the missing posts can be seen like this. Gr8 effort on ur part. Thanks a lot
బావుందండీ మీ సింహావలోకనం..
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ క్రొత్త సంవత్సరం మీకు మరిన్ని శుభాలని చేకూర్చాలని కోరుకుంటూ..
నా బ్లాగు కూడా మీకు నచ్చేసిందా, హాయ్ హాయ్ అరె హోయ్ హోయ్ :)
నేను కూడా బ్లాగులు చాలామటుకు చదువుతాను కానీ తెలుగులో కామెంటే తీరిక (ఇది నిజమని నమ్మితే ఎక్కిలాయిలే దాన్ని బద్ధకం అని చదువుకోగలరు) ఆఫీస్ లో ఉండదు, ఇంట్లో బ్లాగులు చూసే సమయమే ఉండదు, కానీ మా అందరినీ ఇలా గుర్తు పెట్టుకుని కొత్త సంవత్సరానికి బహుమతిగా మీరు రాసిన సిం హావలోకనం మాత్రం అదుర్స్.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
నా 'నా...గోల" ను అభిమానిస్తూ అభినందించిన మీకు కృతజ్ఞతలండి.
ధన్యవాదములు
రాజన్
బావుంది మీ విహంగవీక్షణం.కొన్ని మిస్సయినవి దొరికాయి.మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున "ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు"
తృష్ణ,
చక్కగా రాశారు సింహావలోకనం. నాలాంటి బద్దకపు బ్లాగర్ లకు ఇలాంటివి చాలా ఉపయోగం.
మీకు కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Gr8 to have some missing posts.
As said b4, ur style is having a home meal after a long MESSing. :-)
Very many happy new year wishes to you all. Have an entertaining and fruitful days ahead for u
Sujatha garu,
అమ్మో! బావుందండీ తృష్ణా, ఈ ఒక్క పొస్టు చదివితే 2009 లో బ్లాగులన్నీ చదివిన ఫలితం దక్కుతుందన్నమాట.
*** *** ***
:-D మొన్నే ఏకాదాశి పూజ చేశారట తృష్ణ గారు. ఆరోజు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితంట. అలాగే మనకీ బ్లాగేకాదశి పౌర్ణమి నాడిచ్చినట్టున్నారు. One post a year long... imagine.
మీ సింహావలోకనం బాగుందండీ.
నా సింహావలోకనం కూడా ఉంది ఈ కింద లింకులో
నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
తృష్ణ గారూ !
మీ సింహావలోకనం బాగుంది.
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
నా బల్లాగు పేరు కూడా సేర్సేసారా, ఆయ్!! బాగున్దన్డా!!!
నూతన సమచ్చర శుబాకాన్చలన్డా మీకు, మిగతా అన్దరికీ....
బాగుందండి .
మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .
ఈ పోస్ట్ ని బుక్ మార్క్ చేసి పెట్టుకుని తీరిగ్గా ఒక్కొక్కటి చదవాలి. బాగుంది మీ సింహావలోకనం...
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
తృష్ణ గారూ ధన్యవాదాలు . నా ' కేక 'ని పొలికేక చేసేసారు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంచి టపాలను ఒక చోట కూర్చారు.
ధన్యవాదములు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆరంభం నుంచి చివరిదాకా ‘సింహావలోకనా’న్ని
మంచి పోస్టుల సమాహారంగా బాగా రాశారు. నచ్చిన బ్లాగు పోస్టులను నెలల వారీగా ప్రస్తావించి, శ్రద్ధగా వాటి లింకులు కూడా ఇచ్చినందుకు మీకు అభినందనలు!
సుజాత గారి బ్లాగు గురించి రాస్తూ-‘క్వాలిటి కన్నా క్వాంటిటీ ముఖ్యమని..’అంటూ రాశారు. క్వాలిటీ- క్వాంటిటీ మాటలు అటుదిటు అవలేదు కదా?:)
వేణూగారు, ఉష గారు ధన్యవాదాలు.
సుజాతగారూ, నేను రెగులర్ రీడర్ను కాదండి..ఖాళీ దొరికినప్పుడు పాతవన్ని తిరగేస్తూంటాను..మధ్యలో కొన్ని నెలలవి లేవు చూడండి..అవి నేను మిస్ అయిన నెలలన్న మాట.ధన్యవాదాలు.
@సునీత,
@చైతన్య,
@సంతోష్,
ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: నూతన సంవత్సరంలో మరిన్ని వ్యాఖ్యలు మీ నుంఛి కోరుతున్నాము..:)
@మురళి: "కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు....:) "
నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు.
@జయ: పాపకు మీ విషెస్ చెప్పానండీ..ధన్యవాదాలు.
@కత్తి మహేష్ కుమార్,
@పరిమళం,
@సృజన,
ధన్యవాదాలు.
@మేధ: ధన్యవాదాలు.
@లక్ష్మి: వ్యాఖ్యలు రాయకపోయినా మీ బ్లాగ్ తెరిచినప్పుడల్లా పతవన్ని చదువుతానండీ. నాకు ఇష్టమైన బ్లాగుల్లో మీది ఒకటి...ధన్యవాదాలు.
@నా గోల,
@శ్రీనివాస్ పప్పు,
@కల్పన రెంటాల,
@హరే కృష్ణ,
ధన్యవాదాలు.
@గీతాచార్య: మార్పుని గమనించినందుకు ధన్యవాదాలు. ఈ మార్పు ఇలాగే కొనసాగాలను ఆకాంక్ష.
@మంకీ టు మంకీ: మీ పోస్ట్ చూసానండీ. ఎంపిక బాగుంది...ధన్యవాదాలు.
@ఎస్.ఆర్.రావు: ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: ఆయ్...మీ బ్లాగ్ అసుంటిది మరి...అయినా సేర్సక పొతే మీ అభిమానులంతా లగెత్తుకొచ్చేయరూ...ధన్యవాదాలు.
మాల గారూ, ధన్యవాదాలు.
శేఖర్ గారూ, అన్ని చదివారా ఇంకా లేదండీ...ధన్యవాదాలు.
@భద్రసింహ,
@లలిత,
@శ్రీనిక,
ధన్యవాదాలు.
వేణూ గారూ, సుమారు 350 మంది దాకా ఈ టపా చూసినా ఎవ్వరూ ఈ పొరపాటుని ప్రస్తావించనే లేదండీ....సరిచేసుకున్నాను...చాలా చాలా థాంక్స్..!
ఈ టపా "లెంత్" పెరిగిపోతుందని ఇంకొన్ని టపాల ప్రస్తావన చెయ్యాలన్నా చెయ్యలేకపోయాను... బ్లాగ్మిత్రులెవరికన్నా అసంతృప్తిని కలిగించి ఉంటే క్షమించమని మనవి...!
మార్పు గురించి కాదండి నేనన్నది. మీ టపా లు చదువుతుంటే మెస్ భోజనం తిన్నవాడికి ఇంటి భోజనం లాగా ఉంటుందని... :-)
@G: oh..got the point...anyways..thankyou verymuch!
SO SORRY తృష్ణ గారు.. సెలవల్లో ఉండటం వల్ల ఈ టపా మిస్ అయిపోయాను :(
మీ సింహావలోకనంలో మనోనేత్రం భాగమైనందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.. నాకు బాగా ఇష్టమైనే కవితే మీకూ నచ్చడం హేపీగా ఉంది :-)
నేను మాత్రం మీ పాటల గదిలోనే ఎక్కువ సమయం గడుపుతాను.. ఈ మధ్య మంచి పాట వినాలనిపించినప్పుడల్లా నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోయి వినేస్తున్నాను.. సో, తరుచూ చూస్తూ కామెంట్ చేయని బద్దకస్తురాలినన్నమాట :-)
@నిషిగంధ: అవునా? థాంక్యూ..! ఇంకా బోలెడు పాటలు పెట్టాలండీ...లిస్టయితే ఉంది లైన్లో...:)
మీ కవితలు చాలా బావుంటాయి...తేలికైన భాషలో ఎంతో అర్ధవంతంగా...! మీరు కామెంట్ రాస్తే గొప్పగా ఫీలైపోయి సంబర పడిపోతూ ఉంటాను నేను..!!
తృష్ణా, నేను మీ పోస్ట్ ఎప్పుడూ మిస్ అవ్వను చూసేరా ఎంత ముఖ్యమైనది మిస్ అయ్యానో. ఇది ఒక్కటే చదివినట్లు లేను. :-(
నా పోస్ట్ మీ పట్టిక లో స్తానం పొంది ధన్యమయ్యింది. నాకు మిమ్ములను చూస్తే అసూయ గా వుంటుంది ఇన్ని విషయాలు ఎలా తెలుసు ఈమె కు అని. నేను మీ పంకా ను. థాంక్ యూ తృష్ణా. థాంక్ యూ.
bhavana gaaru, thankyou very much...i feel vry honoured...but there are many things which i still have to learn...
Post a Comment