(పైన లింక్లో ఈ గజల్ తాలూకూ మూడు వర్షన్స్ వినచ్చు.)
ఇది ‘Ghalib (1961)’ అనే పాకిస్తానీ చిత్రంలోని ఒక గాలిబ్ గజల్. ఈ చిత్రంలో నాయికగా నటించటమే కాక, ఈ గజల్ కు గాత్రాన్ని అందించారు అప్పటి ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయని ‘నూర్జహాన్’. ఈ గజల్ లోని ఒక షేర్..
“जी ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन
बैठे रहें तसव्वुर-ए-जानाँ किये हुए”
ఇవే వాక్యాల్ని “మౌసమ్(1975)” చిత్రంలో “दिल ढूँढता है” పాటకు పల్లవిగా
వాడుకున్నారు ప్రముఖ కవి గుల్జార్. ఆయన ఈ చిత్ర దర్శకుడు కూడానూ. ఈ కాలమ్ కోసం నేను ఎంచుకుంటున్న పాటలు చాలావరకు గుల్జార్ రాసినవే కావడం యాదృచ్ఛికం ! పాటను ఎంచుకున్నాకా, అరే.. ఇదీ గుల్జార్ రచనే అని నేనే ఆశ్చర్యపోతున్నా చాలాసార్లు అప్రయత్నంగా నేను హమ్ చేస్తూ ఉండే ఆప్తగీతం ఇది.

http://vaakili.com/patrika/?p=2992