'ప్రతి కథ గురించీ సమీక్షిస్తే పరిచయం అసలు కథ కన్నా పెద్దదవుతుంది.'
'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది.'
అంటారు 'పాలగుమ్మి పద్మరాజు'గారు.. "త్రిపుర కథలు" పుస్తకంలోని తన పరిచయవాక్యాల్లో.
పద్మరాజుగారి ప్రశంసను అందుకున్నది విలక్షణమైన కవీ, కథకుడు శ్రీ రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు. "త్రిపుర" పేరుతో అతి తక్కువ రచనలు చేసి ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న నైరూప్య చిత్రకారుడు. ఒక తాత్విక రచయిత. ఇంతకు మించి వారి గొప్పతనం గురించి చెప్పేంత సాహసం చెయ్యను. ఎందుకంటే సాహిత్యం గురించి ఏమీ తెలియని చిన్నతనంలో మా ఇంట్లో ఉన్న త్రిపుర కథల పుస్తకం చదవడానికి ప్రయత్నించిన అజ్ఞానిని. ఇప్పుడు సాహిత్యసాగరం లోతులు తెలిసిన సంపూర్ణ అజ్ఞానిని.
త్రిపుర గారి మరణవార్త తెలిసాకా, నా దగ్గర ఉన్న రెండు ఆడియో లింక్స్ బ్లాగ్ లో పెట్టాలని... రకరకాల సాంకేతిక ఇబ్బందుల తర్వాత ఇప్పటికి కుదిరింది. అవి.. త్రిపుర గారి రేడియో ఇంటర్వ్యూ ఒకటి, రెండవది ఆయన కథానిక + కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం.
1) "త్రిపుర" గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ ఇక్కడ వినటానికి పెడుతున్నాను. ఇది 1999 march 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైంది.
2) 'గొలుసులు-చాపం-విడుదల భావం' కథానిక + త్రిపుర కథా రచనల మీద 'డా.వి.చంద్రశేఖరరావు' గారి అభిప్రాయం:
*** ***
"త్రిపుర" గారి గురించి అంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చిన వాడ్రేవు చినవీరభద్రుడుగారి వ్యాసం:
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/05/27/ArticleHtmls/27052013004003.shtml?Mode=1
Vadrevu Ch Veerabhadrudu గారి మాటల్లో:
"త్రిపురగారి మీద నా వ్యాసం ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అయితే ఆ శీర్షిక 'విబంధుడు ' నేను పెట్టింది కాదు. ఆ పదానికి అర్థం నాకు తెలియదు. అలాగే ఆ వ్యాసంలో రెండు పేరాలు ఎడిట్ చేసారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను."
పూర్తి పాఠంతో ఇక్కడ:
http://www.scribd.com/doc/143874732/The-legacy-of-Tripura-in-Telugu-Literature
9 comments:
""ఎందుకంటే సాహిత్యం గురించి ఏమీ తెలియని చిన్నతనం లో మా ఇంట్లో ఉన్న త్రిపుర కథల పుస్తకం చదవడానికి ప్రయత్నించిన అజ్ఞానిని.ఇప్పుడు సాహిత్య సాగరం లోతులు తెలిసిన సంపూర్ణ అజ్ఞానిని.""..:-)
Wow..Thanks for the nice post..:-)
త్రిపుర మీద త్రీడైమెన్షనల్ సినిమా చూపించారు !ఆకాశవాణి ముఖాముఖిలో కథానేపధ్యం కొంతవరకు అర్థమయింది!త్రిపుర కథ వినిపించారు.డాక్టర్ గారి త్రిపుర కథావిశ్లేషణ లోలోతుల పొరలు చూపింది!కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యులకు జ్ఞానపీట్ సభ్యులకు త్రిపుర కొరుకుడు పడడు!పాపం I pity them!
పేపర్లో ఈ వార్త చూడగానే మీ పోస్టు కోసంచూశాను.నాకు వీరి గురించి పెద్దగాతెలీదు,అందుకని!
thank you madam.
@nagini: Its a true confession nagini ! చదివేకొద్దీ అర్థమౌతోంది ఈ మహా సాగరంలో నాకు తెలిసింది ఒక నీటి బొట్టంత మాత్రమేనని... అసలు నాకేమీ తెలీదని :((
@A.Surya Prakhash: Thanks for visit surya prakash gaaru.
@Indira:కేసెట్ లోంచి సిస్టంలోకి ఎక్కించటం కుదరలేదండి. నా దగ్గర ఉన్న సాఫ్ట్ వేర్ పాడయిపోయింది. నానా తంటాలు పడి ఎలాగో నిన్న పూర్తి చేసాను.. ఆయన గొంతు వినాలనుకునే అభిమానులు కొందరన్నా విని ఆనందిస్తారని..
@M.S.Naidu: Thanks for the visit naidu gaaru.
Vadrevu Ch Veerabhadrudu గారి మాటల్లో:
"త్రిపురగారి మీద నా వ్యాసం ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అయితే ఆ శీర్షిక 'విబంధుడు ' నేను పెట్టింది కాదు. ఆ పదానికి అర్థం నాకు తెలియదు. అలాగే ఆ వ్యాసంలో రెండు పేరాలు ఎడిట్ చేసారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను."
పూర్తి పాఠంతో ఇక్కడ:
http://www.scribd.com/doc/143874732/The-legacy-of-Tripura-in-Telugu-Literature
@Anil Atluri:Thanks for the link anil gaaru. i'll add this to the post.
తృష్ణ గారూ, త్రిపుర గారి గురించి మీరు రాసిన టపాలో పెట్టిన ఆడియో లింకులు ఓపెనవటం లేదండీ. ఫైర్ ఫాక్స్, క్రోమ్ లలో ప్రయత్నించాను. ఓసారి చెక్ చేయండి.
చినవీరభద్రుడు గారి వ్యాసానికి పత్రికవారు పెట్టిన శీర్షిక విషయం- ఇలాంటి వ్యాసాలకు రచయితలే శీర్షికలు పెట్టటం మంచిది. లేకపోతే ఇలాంటి అస్పష్ట ప్రయోగాలు వచ్చేస్తాయి!
@వేణూ గారూ, ఇప్పుడే చెక్ చేసానండి. నాది క్రోమ్.ఓపెన్ అవుతోంది. మీకు లింక్స్ పంపిస్తానుండండి.
Post a Comment