సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 20, 2013

అలరించిన 'Epic'




ఈ వేసవిలో పిల్లలను ఆకట్టుకోవటానికి మన దేశం వచ్చిన అమెరికన్ కంప్యూటర్ ఏనిమేటెడ్ ఫాంటసీ 3D చిత్రం "Epic". 'విలియమ్ జాయిస్' రాసిన ఒక పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా ఏనిమేషన్ మాత్రమే కాక 3D  కూడా అవడం వల్ల ఇంకా ఆకర్షణీయంగా రూపుదిద్దికుంది. ఇవాళ మా పాపను తీసుకువెళ్ళి చూపెట్టాను. మా ఇద్దరికీ బాగా నచ్చింది.


 ఈ సినిమా కథ క్లుప్తంగా చెప్పాలంటే మంచి, చెడుల మధ్యన యుధ్ధం. చివరికి విజయం మంచివారినే వరిస్తుంది అన్నది పాత కథాంశమే అయినా అడవి నేపథ్యం, అందులో ఉండే రహస్యప్రపంచం.. ఆ ప్రపంచంలోని మనుషులు, వాళ్ల జీవితాలు.. చెడుతో వాళ్ల పోరాటం... ఇదంతా ఆసక్తికరంగా మలిచారు. మేరీ కేథరీన్ అనే టీనేజ్ అమ్మాయి అడవిలో పరిశోధన జరుపుతున్న తండ్రి వద్దకు వస్తుంది. అతడికి పరిశోధనే ప్రపంచం. అనుకోని పరిస్థితుల్లో మేరీ చిన్నగా మారిపోయి, తండ్రి ఇంతకాలంగా పరిశోధిస్తున్న "leafmen" అనే లిల్లీపుట్ల లాంటి బుల్లి బుల్లి మనుషుల విచిత్రప్రపంచంలోకి వెళ్ళి పడుతుంది. వాళ్లతో కలిసి వాళ్ళ యుధ్ధంలో పాల్గొని, చివరికి మేరీ మళ్ళీ ఎలా మామూలు మనిషౌతుంది? అన్నది కథ. నాకు వాళ్ళ రాణి భలే నచ్చేసింది. ఆమె నడుస్తూంటే విచ్చుకునే పువ్వులు, కలువలూ ఎంత అందంగా ఉన్నాయో. ఆమె ఉన్నది కాసేపే అయినా ఆ కాసేపూ చాలు 'what a visual feast !' అనుకోవడానికి.


మామూలు 2D సినిమా కన్నా ఏనిమేషన్ తీయడం,అందునా 3D తీయడం  ఎంతో శ్రమతో కూడుకున్న పని. అది కాస్తయినా బాలేకపోతే ఆ శ్రమంతా వృధా పోతుంది. అలా కాక చూసేవాళ్లకి చక్కని అనుభూతిని మిగిలిస్తే, కష్టపడి తీసినవాళ్లకు కూడా తృప్తి. మీ ఇంటి దగ్గరలో ఆడుతూ ఉంటే, ఏనిమేషన్ ఇష్టముంటే మిస్సవకుండా తప్పక చూడండి. టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అని ఖచ్చితంగా అనుకుంటారు.

'Epic' trailer:

3 comments:

వేణూశ్రీకాంత్ said...

ఇటీవలికాలంలో ఇబ్బడిముబ్బడిగా త్రీడి సినిమాలు యానిమేషన్ సినిమాలు వచ్చేస్తున్నాయి కానీ అన్నీ అంతగా ఆకట్టుకోవడంలేదండీ. కానీ ఈ సినిమా మాత్రం నాక్కూడా చాలా నచ్చింది. మీ షార్ట్ రివ్యూ బాగుంది :)

Padmarpita said...

మీ రివ్యూ బాగుంది. Thanks for sharing.

తృష్ణ said...

@వేణూశ్రీకాంత్: last year 'Tintin' తరువాత నేను ఇదేనండి నేను 3D చూడటం. చాలా కష్టపడి తీసారని మాత్రం అర్థమైంది. ఎండలో తిరిగితిరరిగి ఉన్నమీదట ఎక్కువ రాసే ఓపికలేకపోయింది.. :)
ధన్యవాదాలు.

@పద్మార్పిత: ఏనిమేషన్స్ ఇష్టమైతే చూడండి. మీకు నచ్చుతుంది.
ధన్యవాదాలు.