"ఏదన్నా వెహికిల్ మోడల్ చేసి పంపమని" పిల్లకి స్కూల్లో ప్రాజక్ట్ వర్క్ ఇచ్చారు. అసలు శలవుల్లో ఇచ్చిన ప్రాజక్ట్ వర్కులన్నీ పూర్తిచెయ్యమని తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పి పంపితే సగమే పూర్తి చేసుకు వచ్చింది పిల్ల. అవన్నీ ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున్న కూచుని అతికష్టం మీద పూర్తిచేసా. ఈ ఒక్కటీ నావల్ల కాదని ఈ వెహికిల్ ప్రాజెక్ట్ ని వదిలేసా. క్లాస్ లో కొందరు మోటార్ బైక్, సైకిల్ అలా చేసుకువచ్చారుట. "రేపే లాస్ట్ డే..ఎలాగన్నా చేసి తెమ్మన్నారు EVSసార్.. కార్డ్ బోర్డ్ తో చెయ్యాలి" అని నిన్న స్కూల్ నుండి వస్తూనే పిల్ల గొడవ. అంతకు ముందు రోజే అన్ని ప్రాజక్ట్స్ చేసిన మీదట "నావల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లీ, మీ నాన్న వచ్చాకా చూసుకోండి" అనేసా నేను.
అయ్యగారు ఆఫీసు నుండి వచ్చాకా బేరం పెట్టింది పిల్ల. అలానే చేసేద్దాం అని అభయమిచ్చేసారు ఈయన. "ఇదిగో..పువ్వులు, ఆకులు అంటే చేస్తాను కానీ ఈ వెహికిల్స్ అవీ నాకు రావు నావల్ల కాదు. మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పేసా. నిన్న రాత్రి పిల్ల బజ్జున్నాకా ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లారు. కాసేపయ్యాకా పెద్ద పెద్ద థర్మొకోల్ షీట్లు, కార్డ్ బోర్డ్ తెచ్చారు. నెట్లో ఏవో వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే "ఫార్ములా వన్" మోడల్స్ డెస్క్ టాప్ మీద పెట్టి చేసేద్దాం..రా.. అన్నారు. నాకు బోలెడు కోపం వచ్చింది. అసలు నేను చెయ్యనన్నా కదా,ఇప్పుడీ ఫార్ములా కార్లెవరు చేస్తారు? నావల్ల కాదు. ఏ సైకిలో చేసేయచ్చు కదా" అన్నాను. అందరిలా మనమూ చెయ్యటమేంటి వెరైటీ గా ఉంటుంది. హెల్ప్ చెయ్యి.." అన్నారు. నిజం చెప్పద్దూ.. ఆ మోడల్ కార్లు చూస్తే నాకూ సరదా వేసింది. ఈజీగా ఉన్న ఓ మోడల్ కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి, ఆ ప్రకారం ఇద్దరం చిన్నపిల్లల్లా కూచుని ఆ మోడల్ చెయ్యటం మొదలెట్టాం. నాకు తృప్తి కలగలేదు కానీ ఏదో ఓ మాదిరిగా చేసాం. టైమ్ ఉంటే ఇంకా బాగా చేద్దుము అనుకున్నాం.
మొత్తం అయ్యాకా రంగు వేద్దాం అని వెతికితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ టైర్లకి కావాల్సిన బ్లాక్ కలర్ మాత్రం లేదు. ఫ్యాబ్రిక్ కలర్స్,పోస్టర్ కలర్స్ అన్ని వెతికాం, ఆఖరుకి పిల్ల వేసుకునే వాటర్ కలర్స్ లో కూడా బ్లాగ్ కలర్ అయిపోయింది. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది ! ఇక పొద్దున్న ఆరున్నరకే ఏ షాపన్నా తెరుస్తారేమో అని బయల్దేరారు తను. మా ఏరియా నుంచి మార్కెట్ రోడ్డు చాలా దూరం. ఎనిమిదింటికే పాప ఆటో వచ్చేస్తుంది. పది నిమిషాల తక్కువ ఎనిమిదికి కలర్స్ బాక్స్ తీసుకొచ్చారు. అప్పుడు టైర్లకి గబగబా బ్లేక్ కలర్ వేసాను. కానీ ఎంత ఫ్యాన్ క్రింద పెట్టినా పది నిమిషాల్లో ఎక్కడ ఆర్తాయి? ఇంతలో ఆటో వచ్చేసింది. పిల్ల వెళ్పోయింది. "ఆటో స్కూల్ గేట్ దాకా వెళ్ళటానికి టైం పడుతుంది.. ఈలోపు ఆరబెట్టేస్తాను.. పట్టుకెళ్ళండి" అన్నా. ఆఫీసుకి లేటయిపోతుంది ఇప్పుడిక కుదరదు.రేపు పంపు..అంతే" అన్నారు. నాకు బోలెడు కోపం,బాధ,ఉక్రోషం అన్నీ వచ్చేసాయి. "రేపు పంపేదానికి నిన్న రాత్రంతా అంత కష్టపడటం ఎందుకు?పొద్దున్నే మీరు రంగుల కోసం ఊరంతా తిరగటం ఎందుకు? పైగా ఇవాళే లాస్ట్ డే అని వాళ్ల సార్ చెప్పరుట.. రేపటికి ఇస్తేఒప్పుకోరేమో... మనదంతా వృధా ప్రయాస అయిపోతుంది.." అని నేను గొడవ పెట్టాను. ఏమయినా ఆఫీసుకి వెళ్పోవాలి అని తను తయారైపోయారు. ఈ మోడల్ చెయ్యటం కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డామో తలుచుకుంటే నాకు చాలా బాధ కలిగింది. మూడ్ అంతా దిగులుగా అయిపోయింది.
అంతలో నాకు తటాలున ఒక ఐడియా వచ్చింది. పట్టుకెళ్ళి క్లాసులో ఇమ్మని స్కూల్ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తే..? అని. వెంఠనే చేసాం. ముందు కుదరదన్నాడు. తర్వాత డబ్బులిస్తాం రమ్మంటే సరేనన్నాడు. ఓ అరగంటలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఈ హడావుడిలో పిల్లకి ఇవాళ హాఫ్డే అని మర్చిపోయి కేరేజ్ కూడా ఇచ్చేసాను నేను. (నెలలో లాస్ట్ వర్కింగ్ డే హాఫ్ డే వాళ్ళకి.) మధ్యాహ్నం బెల్లు కొడితే ఎవరో అనుకుని తలుపు తెరిస్తే పిల్ల ! అప్పుడు గుర్తుకొచ్చింది హాఫ్ డే సంగతి. ఇంతకీ సార్ ఏమన్నారు అనడిగితే "బావుందన్నారు. అందరి వెహ్కిల్ మోడల్స్ క్లాస్ లోనే గూట్లో పెట్టారు. నాది ఏక్టివిటీ రూమ్ లో పెట్టించమని పంపారు" అని చెప్పింది. ఇంకేముంది.. నా మొహంలో వంద చిచ్చుబుడ్లు, వెయ్యి మతాబలూ ఒక్కసారిగా వెలిగిపోయాయి. వెంఠనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా. "వెరీ గుడ్ వెరీ గుడ్!" అన్నారు. లోపల్లోపల మాత్రం "బ్రతికానురా దేవుడా!" అనుకుని ఉంటారు..:-)
22 comments:
Very nice!
How sweet! :-)
చాలా బాగుందండి.
పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అంటే మనకిచ్చినట్టు ఉంటుంది.మా చెల్లి మీకు లానే కష్టపడి చేస్తుంది.వాళ్ళ పిల్లల టీచర్ బాగుందంటే మా అందరికీ చెపుతుంది..మా బాబుకి గ్లోబ్ చేయమని ఇచ్చారు.బాల్ తో చేద్దమనుకుంటున్నాము.స్టాండ్ కి ఏమైనా సలహా ఇవ్వండి:))
హిహిహ్హి...... మా అమ్మనాన్న కూడ మీకులాగే నా ప్రొజెక్ట్ వర్క్ గురుంచి చాలా పాట్లు పడ్డారు. ఇప్పుడు గుర్తొస్తుంటే ఎంత నవ్వుకున్నానో..... అయ్యో పాపం అని కూడ అనిపిస్తోంది ఇప్పుడు..... ఎంతైనా పిల్లల ప్రొజెక్ట్ వర్క్లూ హోం వర్క్లూ చేసే ప్రతి తల్లిదండ్రులకు ఇదే నా సల్యూట్......... :) :D
బాగుందండి, మీ రేస్ కార్. నేను కూడ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను మా పాప కోసం.
చాలా బాగుందండి. ప్రాజెక్ట్ వర్క్ మనకే:) మావాడి స్కూల్ వాళ్ళైతే నా వర్క్స్ ఒక్కటి కూడా రిటర్న్ ఇవ్వలేదు:(
avunandi pillala kosam peddalu kotthaga nerchlovali naku kooda ilanti anubhava edirindi
నేనూ మా ఆవిడా యిది చదువుకొని తెగ నవ్వుకున్నామండీ. మాదీ యిదే పరిస్థితి! ఒకోసారి యివి మరీ విపరీతంగా ఉన్నాయనిపిస్తుంది. వీటివల్ల నిజంగా పిల్లలకు ఏమైనా ప్రయోజనం ఉందా అని అనుమానం. కొన్నిసార్లయితే అసలు విషయం కన్నా అలంకరణకూ ఆర్భాటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాగా చిరాకు తెప్పిస్తుంది.
మీ టపా చదువుతున్నంత సేపూ నాకు ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ కంపడుతోంది...మొన్న ఒక week end కలర్స్ వెయ్యమని home work ఇస్తే ఎంత వెంటపడ్డా ఆదివారం సాయంత్రానికి ఇంకా బోల్డు మిగిల్చేసింది..అప్పుడు అదీ నేనూ తలో పెన్సిలూ పట్టుకుని చెరో వైపు చక చకా వేసి పారేసాం...
మీరు చేసిన కారు బావుంది కానీ తల్లిదండ్రులకి ప్రోజెక్టులు ఇచ్చి ఏమి సాధిస్తున్నారో మాత్రం అర్ధం కావట్లేదు...మన రొటీన్ బోరింగు పనులనుంచి ఆటవిడుపా...:)
వెరీగుడ్ వెరీగుడ్ :)
లాస్ట్ జనవరిలో పిక్నిక్ జరిగితే అక్కడ ఫామిలీలకి క్విజ్ పెట్టారు. క్విజ్ మాస్టర్ మొదలుపెట్టేదానికి ముందు ఎవరెవరి పిల్లలు ఏఏక్లాసో అడిగింది. అంతావిన్నాక, ఎవరి పిల్లలైతే 7-10 మద్యలో ఉంటారో వాళ్లమద్యనే పోటీ ఎక్కువ ఉంటుందన్నది. నిజంగానే అలానే జరిగింది. పిల్లలు చదివేటప్పుడే అందరికీ మర్చిపోయినవి రివిజన్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకా చెయ్యాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడే అలిసిపోవద్దు
పిల్లల ప్రాజెక్టులు,పెద్దల పాట్లు,..హ,హ...మన బాల్యాన్ని మళ్లీ తేవడానికేమో..
చాలా బాగుందండీ.. శ్రమకు తగిన ఫలితం దక్కిందనమాట.. గుడ్..
Haha bhale undi. Ferrari ani pakjana rayalsindi ;) super mom aithe meeru :)
Cute Model...:)
@కృష్ణ: థాంక్సండి.
@మధుర: థాంక్యూ :)
@రాధిక గారు, ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమాపణాలు.. రౌండ్ ధర్మోకోల్ ప్లేట్ దొరికితే అందులో గ్లోబ్(బాల్) పెట్టండి. దాన్ని 'వి' ఆకారంలో ఉండే రెండు బలమైన పుల్లలకు అటాచ్ చెయ్యండి..లేదా వాటి మధ్యన ఈ ట్రే కూచునేలా అరేంజ్ చెయ్యండి ధన్యవాదాలు.
@కృష్ణ చైతన్య: అవునండీ. ఈ ప్రాజక్టులు పిల్లలకు కాదు తల్లిదండ్రులకు పోటీ :)
ధన్యవాదాలు.
@కిషోర్: చేసుకోండి..చేసుకోండి.. బోలెడు పనులున్నాయ్ ముందు ముందు..:)
ధన్యవాదాలు.
@జయ: స్కూల్ వాళ్ళు వెనక్కు ఇవ్వరేమో కదండి..
ధన్యవాదాలు.
@మాధవి: అంతేనండి :)
ధన్యవాదాలు.
@కామేశ్వరరావు భైరవభట్ల: :)
పిల్లలకు ఏమ్ ప్రయొజనం ఏమోగానీ తల్లిదండ్రులకి పరీక్షలే !
ధన్యవాదాలు.
@స్ఫూరిత: మనకి ఆటవిడుపే కానీ అస్తమానం చెయ్యాలంటే కుదరనప్పుడు చికాకు కలుగుతుంది కదాండి.. :(
ధన్యవాదాలు.
@చైతన్య: అవునవును..."అంతం కాదిది ఆరంభం","ముందుంది ముసళ్ల పండుగ" అనుకుంటుంటాం మేము..:)
@the tree: అవునండి అంటేనేమో..:)
ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అవునండీ..
ధన్యవాదాలు.
@ఇందు: థాంక్యూ :)
@ధాత్రి:thank you.
@ధాత్రి గారూ, మీ బ్లాగ్ లో "వార్డ్ వెరిఫికేషన్" తీసేయండి. కామెంట్ పెట్టడం కుదరట్లేదు..:(
మీ బ్లాగ్ బావుంది.రాస్తూండండి.
తృష్ణ గారు ఇప్పుడు తీసేసానండి.comment పెట్టొచ్చు..blog నచ్చినందుకు ధన్యవాదాలు..:)
Post a Comment