సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 30, 2012

కన్నులదా.. ఆశలదా..




ఈమధ్య రేడియోలో విన్న ఈ పాట ఎందులోదా అని వెతికితే "3" సినిమాలోదని గూగులమ్మ చెప్పింది. నాకు ఈ ట్యూన్ బాగా నచ్చింది. పాటలో ఎక్కువగా వాడిన గిటార్, వయోలిన్ బిట్స్ చాలా బాగున్నాయి.

సంగీతం: అనిరుధ్ధ్ రవిచందర్
సాహిత్యం: భువనచంద్ర
పాడినది: ధనుష్, శృతి హాసన్

http://www.raaga.com/play/?id=334560



 




సాహిత్యం:

ప: కన్నులదా.. ఆశలదా..
బుగ్గలదా.. ముద్దులదా..
పెనవేసుకున్న పెదవులదా
నువ్వు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవే కదా
కలలా కదిలే వలపుల చిలకా
అందని అందం నీవే కదా

చ: ఏదెదో పాడుతు, నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్ని చేయకు
గుండెల్లో ఆడుతు, కళ్లల్లో సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకూ
హృదయం హృదయం కలిసెనమ్మా.. వయసే విరిసెనమ్మా
అమృతం పొంగి అణువణువూ.. తలపే కురిసెనమ్మా
ముద్దుల్నే పేర్చవా, ముచ్చట్లే ఆడవా,
నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా

కన్నులదో.. బుగ్గలదో..
ముద్దులదో.. నవ్వులదో..
మదిలో మెదిలే వలపుల మొలక..
నాలో ప్రాణం నీవే కదా!


No comments: