ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత గీతాల్లో "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే "నాకు చాలా ఇష్టమైన పాట.
రాత్రిపూట పిల్లలను జోకొడుతూ "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగ.." అని పాడే తల్లులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నామటుకు నేనే చిన్నప్పుడు ఫ్యామిలీ గేదరింగ్స్ లో.. ఈ పాట తప్పక పాడేదాన్ని. నేను పాడకపోతే " అమ్మదొంగా నువ్వు పాడకుంటే నాకు బెంగ .." అని మా మావయ్యా పాడేవాడు :)
బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో ఈ పాట గురించి ఒక టపా కూడా రాసాను. అది వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట. అదే బాగా ప్రచారంలోకి వచ్చింది కూడా. కానీ ఇదే పాటను శ్రీమతి ’బి.వరహాలు’ అనే గాయని విజయవాడ రేడియోస్టేషన్ కొరకు పాడారు. వరహాలు గారి మధురమైన స్వరంలో అది కూడా బావుంటుంది.
శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:
సాహిత్యం:
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)
కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!
====================

అమ్మదొంగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట క్రింద వినవచ్చు. ఇది నేను ఎప్పుడో టివిలో వస్తుంటే చేసుకున్న రికార్డింగ్.
No comments:
Post a Comment