మన పాత తెలుగు సినిమా పాటల్లో మారువేషాలు ధరించిన పాశ్చాత్య బాణీలు ఎన్నో ఉన్నాయి...అయితే అలనాటి తెలుగు సినీసంగీత దర్శకులు ఒరిజినల్ ట్యూన్స్ తయారు చెయ్యటం లో సిద్ధహస్తులు కాబట్టి ఈ పాశ్చాత్య బాణీల నుంచి తగినంతవరకే ఇన్స్పిరేషన్ పొందేవారు. కొద్ది ఉదాహరణలు చూడండి :
ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది.
ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,
చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "love is blue" song music నుంచీ,
ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.
ఇలా పాశ్చాత్య బాణీల నుంచే కాక కొన్ని హిందీ పాటల నుంచి తెలుగుకు, తెలుగు పాటల నుంచీ హిందీ పాటలకూ కూడా ఎగుమతి అయిన బాణీలు ఉన్నాయి. పాత పాటలు వింటూంటే మరెన్నో పాటలు గుర్తుకు వస్తూంటాయి. అలానే ఈ మధ్యన ఒక కొత్త తెలుగు పాటకు మాతృక కనుక్కున్నా నేను. క్లారినేట్ మీద వాయించిన సిని గీతాల కేసెట్ వింటూంటే ఈ పాట వచ్చింది. ఇదేదో తెలుసున్న పాటలా ఉందే అని మళ్ళీ వెనక్కి తిప్పి వినే సరికీ అసలు పాట గుర్తువచ్చింది. అదేమిటంతే "వేదం" చిత్రానికి కీరవాణి గారు స్వరపరిచిన "ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..". ఈ పాట పల్లవి మటుక్కే ఇన్పైర్ అయ్యింది. మీరూ ఓ సారి వినేయండి ఇక్కడ:http://ww.smashits.com/music/artists/play/songs/9769/t-g-m-parvez-mehdi-toot-jaye-na-bharam/80755/RESHMI-SALWAR-KURTA-JALI-KA-INSTRUMENTAL.html
ఈ పాట "రేష్మీ సల్వార్ కుర్తా జాలీ కా.." అని "నయా దౌర్" సినిమా లోది. ఇక్కడ ఉన్న లింక్ ఆ పాటకు క్లారినేట్ మీద "మాష్టర్ ఇబ్రహిం" వాయించారు. ఈ పాట పల్లవి వినగానే మీకు "ఎగిరిపోతే.." పాట గురువచ్చేస్తుంది.
No comments:
Post a Comment