సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, January 8, 2011
వ్యాపారమైన ఆటకు కురుస్తున్న కోట్లు !!
"బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ...ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు.." అని పదకొండేళ్ళ క్రితం సిరివెన్నెలగారు రాసారు ఓ పాటలో. అప్పుడేమనుకుని రాసారో కానీ ఇప్పుడు నిజంగా అలాగే పాడాలనిపిస్తోంది కురుస్తున్న కాసులవర్షాన్ని చూస్తూంటే. ఇవాళ సెట్ మాక్స్ ఛానల్ లో వచ్చిన IPL,2011 auction చూస్తే పదిటీముల్లోనూ స్థానం సంపాదించుకున్న ప్రతి అంతర్జాతీయ ఆటగాడూ గత జన్మలో అంతో ఇంతో పుణ్యం చేసుకుని ఉంటారు ఇవాళీ రోజున కోట్లు సంపాదించుకుంటున్నారు... అనిపించకమానదు. మన దేశంలో ఎవరు ప్రవేశపెట్టారో గానీ పల్లెటూరిలో పిల్లలను సైతం చైతన్యవంతులను చెయ్యగల శక్తి, క్రేజ్ ఈ ఆటకు ఉంది. ఇది మన జాతీయక్రీడ కాకపోయినా పసిపిల్లలు సైతం "ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్,స్లీప్ క్రికెట్" అంటారు. శెలవు రోజుల్లో బేట్ బాల్ పట్టుకున్న పిల్లలు కనిపించని వీధులను వేళ్లతో లెఖ్ఖపెట్టచ్చు మన దేశంలో. ఆ ఒక్క విషయంలోనూ యావత్ దేశం సమైక్యంగా ఉంటుంది.ఇక నాలుగేళ్లక్రితం వరకూ ఏ దేశం ఆటగాళ్ళు ఆ దేశంలోనే. ఎవరి ఆట వాళ్ళదే. టోర్నమెంట్లు వస్తేనే కలిసేవి ఈ ఆటాడే దేశాలన్నీ. కానీ సరదాకు ఆడే ఆటలను కూడా వ్యాపారం చెయ్యగల మేధస్సు మానవుడిది.
ఈ ఆటతో ఇప్పటికే చాలా మంది చాలానే గడించారు. అయినా దాహం తీరలేదు. మానవుడి మేధస్సుకి అందని ఆలోచన లేదు కాబట్టి నాలుగేళ్ల క్రితం ఒక బుర్రలో ఈ ఆలోచన తళుక్కుమంది. అంతే..బిగ్ గేమ్ విత్ బిగ్ మనీ, బిగ్గర్ ఎంటర్టైన్మెంట్, బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది క్రికెట్. వేలు కాదు, లక్షలు కాదు కోట్లతో వ్యాపారం. వివిధ దేశాల ఆటగాళ్లకు నోట్లకట్టలు చూపెట్టారు. డబ్బుకు లోకం దాసోహం అయ్యింది. ఒక ఆటగాని కోసం ఇవాళ టివీలో కోట్లు గుమ్మరిస్తున్న వేలంపాట చూసి నేనైతే "ఔరా" అనేసాను. వేలంపాట ఎంత రక్తిగా సాగిందంటే...మాటల్లో చెప్పలేను. టీం మెంబర్స్ సెలక్ట్ అయ్యేదాకా టీవీ ఛానల్స్, న్యూస్ రిపోర్టర్లు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్లు ఉత్కంఠతతో ఊపిరిబిగపట్టారు. గుండ్రని టేబుళ్ల చూట్టూ కూర్చున్న వ్యక్తులు ఈ వేలంపాటలో కోట్లతో చేసిన వ్యాపారాన్ని చూస్తే కళ్ళు తిరిగాయి. $2.4million, $ 2.1million, $ 1.9million, $1.8million...ఇలా సాగాయి ఫైనల్ రేట్లు..!!
ఎందుకొచ్చిన చదువులు? ఉద్యోగాలూ? అనిపించింది. IPL లో పాల్గొనే టీమ్స్ తెచ్చుకున్న మొత్తం సొమ్ము, ఖర్చు పెట్టిన సొమ్ము, వాళ్ళ వద్ద మిగిలిన సొమ్ము తాలూకూ లెఖ్ఖలు కార్యక్రమం చివరలో స్క్రీన్ పై వేసారు. base price, sold price మధ్యలో వేలంపాటు పెరుగుదల నాకు "సంత"ను గుర్తుచేసాయి. కాకపోతే ఇది రాయల్ సంత, మోడ్రన్ సంత. అంతే తేడా. ఏ సంత అయితేనేం.. కోట్లెవరికి చేదు? క్రితం ఏడాది జరిగిన IPL రచ్చ తెలియందెవరికి? అప్పుడే మళ్ళీ బరి సిధ్ధమైపోయింది. అయినా నా పిచ్చిగానీ డబ్బుతో కొట్టుకుపోయే అపకీర్తి పరువును పోగొడితే మాత్రం పట్టించుకునేదెవరు? జనం ఎంత వెర్రివాళ్ళు కాకపోతే జనాల సెంటిమెంట్లతో ఇలా కొన్ని కోట్ల మిలియన్లడాలర్ల వ్యాపారం చెయ్యగలుగుతారు వీళ్ళు అనిపించింది.
నేనూ ఒకప్పుడు విపరీతంగా క్రికెట్ చూసేదాన్ని. మా తమ్ముడు అంటించిన పిచ్చి అది. కాలేజీ రోజుల్లోని క్రేజీ హాబీల్లో ఒకటి. కానీ ఇప్పుడు మాత్రం చూడాలని అనిపించదు. ఒకసారి నాలుగైదు టోర్నమెంట్స్ వరుసగా ఓడిపోయారు మనవాళ్ళు, అప్పుడూ విపరీతంగా బాధపడిపోయాను. మనం రోజంతా పనులు మానుకుని, టివీకి కళ్ళప్పగించి చూస్తే వాళ్ళు ఓడిపోయి మనల్ని ఇంకా నిరాశపరచటం. మనమేమో ప్రపంచాన్ని కోల్పోయినట్లు రెండ్రోజులు దిగాలుపడిపోవటం. ఆడినవాళ్ళు, ఓడినవాళ్ళు బానే ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. జనాలు ఎత్తినప్పుడు గంతులేస్తారు. జనాలు తిట్టినప్పుడు చెవులు మూసుకుంటారు. ఓడినా గెలిచినా సంపాదన ఉంటుండి వాళ్లకి. మరి మనకీ? మాచ్ చూసిన టైమ్ వేస్టు, మనసుని దిగాలుపరుచుకుని మూడ్ పాడుచేసుకోవటం వల్ల ఓడిపోయారని బాధ, కోపం, ఉక్రోషం వల్ల మన ఎనర్జీ వేస్ట్. ఆ సమయంలో ఓ మంచి పుస్తకం చదువుకుంటే, ఓ మంచి పాటలు వింటే, ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అప్పటినుంచీ ఇక క్రికెట్ చూడటం మానేసా. చూసినా లాస్ట్ ఓవర్ టైంకి టీవీ పెడితే ఫైనల్ రిజల్ట్ తెలిసిపోతుంది.
చూట్టూ చూస్తే వందకి తొంభై మంది ఆటపై ఇష్టం ఉన్నవాళ్ళే. మన దేశం ఆడకపోయినా, ఏ దేశం ఆడుతున్నా "క్రికెట్ క్రికెట్ కోసం చూడాలంటూ.." చూసేస్తాడు మా తమ్ముడు. ఇక మా ఇంట్లో అత్తగారి దగ్గర నుంచీ పనమ్మాయి దాకా అందరు ఈ ఆట చూసేవాళ్ళే. వయసుతోనూ, ఆటకు సంబంధించిన కనీస పరిజ్ఞానం పనిలేకూండా క్రికెట్ చూసేవాళ్ళు లక్షల్లోనే ఉన్నరు మన దేశంలో. "ఏమిటీ క్రికెట్ చూడవా?" అని నన్నొక వింత గ్రహాంతరవాసినో, వెర్రిబాగుల్దాన్నో చూసినట్టు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే నా నిర్ణయం నాదే. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటే నాకేంటి? అంటాను నేను. ఓ పాట వింటేనో, పుస్తకం చదివితేనో, మంచి సినిమా చూస్తేనో కలిగే ఉల్లాసం, ఉత్సాహం నాకు ఆ ఆట చూస్తే రాదు మరి. "పుర్రెకో బుద్ధి..." అన్నారు అందుకే మరి.
IPL,2011 auction చరిత్ర, కబుర్లు, వివరాలు కావాలంటే ఈ లింక్ కు వెళ్లండి:
http://en.wikipedia.org/wiki/2011_Indian_Premier_League
----------------------------------------------
Note: ఈ టపాలోనివి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. క్రికెట్ ప్రేమికులని కించపరచటానికి ఎంతమాత్రం కాదని మనవి.
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
ఒకప్పుడు ఇండియా ఆడుతుంటే చూసేటప్పుడు జాతి ఆలోచనలు మొత్తం ఒకటి గానే ఉండేవి . నా ఉద్దేశ్యం సచినో, గంగూలి యో ఆడుతుంటే వాళ్ళు సెంచరీ కొట్టాలని మనసు కోరుకునేది. కానీ విచిత్రం ఏంటంటే అదే సచిన్ ఇప్పుడు దక్కన్ చార్జర్స్ తో ఆడుతుంటే ప్రతి వాడూ డక్ అవుట్ అయిపోవాలని కోరుకుంటాడు. మళ్ళీ వీళ్ళే రేపు వరల్డ్ కప్ లో సచిన్ సెంచరి చెయ్యాలని తెగ ప్రార్ధనలు చేస్తారు. క్రికెట్ లో కూడా ప్రాంతీయ తత్వాన్ని చొప్పించిన ఘనత ఐపిఎల్ దే.
నేనూ చూసా వేలం పాట. నాకైతే ఆ ప్లేయర్స్ ని స్టేజి మీద నిలబెట్టి మెడలో పలక మీద వాళ్ళ రేటు వేసి వాళ్ళని వేలం వేస్తే చూడాలని అనిపించింది. (ఏమో ఒకటి రెండేళ్ళు పోతే అంతకూ దిగజారుతారు....డబ్బండీ డబ్బు.)
Trishna Garu
To Save your time & Our time IPL Introduced in place of Full Day Oneday. Just 20 Overs 1.5 Hrs Max Enjoy the match In TV Possibly With Big Plasma Screen and get relief & relax from normal work Life.
IPL Is not for country just for club so not attachment with any country.
Regards
Anil Krishna Kotamraju
ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ గా చూడటం లేదు కానీ,ఒకప్పుడు నేనూ విపరీతంగా క్రికెట్ చూసిన దానినేనండి.
బాగుందండి మీ టపా .బాగా రాసారు.
తృష్ణ గారు, మా పెద్ద బాబు...ఫుట్ బాల్ ఆటగాడు అయిపోవాలని కలలు కంటాడు..అది కూడ ఇండియన్ టీం కి క్యాప్టెయిన్ లెవెల్లో...అందరం క్లాసు పీకుతూ ఉంటాం అది అంత తేలిక కాదమ్మ అని...ఒకొక్క సారి "ఫుట్ బాల్ ప్లేయర్ అయితే చదువు మానెయొచ్చా "అని అడుగుతాడు...మా బీపీ 290/300 కి ఇంక హార్టు బీటు 210 కి పెరిగిపొతుంది...హహహాహ్.
మీ పొస్ట్ చూసాక 'పొనీ అవనిద్దామా అని ఆలొచన వచ్చిందండొయ్!..
ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చినవాళ్ళకి ఆ మాత్రం డబ్బు ఇవ్వడం న్యాయమేనేమో?
అయినా ఈ రోజుల్లో కోట్లు సంపాదించే ఎన్ ఆర్ ఐ లు ఎంతమంది లేరు?
ఇంజనీరు అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కాని ఒక "సచిన్" అవ్వడం శతకోటిమందిలో ఒక్కరికే సాధ్యం.
>>>"మనం రోజంతా పనులు మానుకుని, టివీకి కళ్ళప్పగించి చూస్తే వాళ్ళు ఓడిపోయి మనల్ని ఇంకా నిరాశపరచటం."
http://bandgf.blogspot.com/2010/10/steve-waugh.html
మీ ఆవేదన తెలిసిన ఒక ఆటగాడున్నాడు. చదివినట్టున్నారు. మళ్ళా చదవండి :)
హ్మ్మ్...
@ SHANKY gaaru :)
tRshNa gaaru,
nenu & ramaayanam (mamoolu telugulo (naa blog lo kotta post)mee kosam tega eduruchoostunnamu.abba, kallu noppettestunnaayi...hahaha
తృష్ణగారూ....నాకు గంగులీ అంటే ఎంత ఇష్టమో! కానీ ఈ మధ్య ఈ ఐపీయల్ చూసి..చూసి...విసుగేసి....చిరాకేసి..ఇక చూడ్డం మానేసా! ఆడుకోనివ్వండీ..కోతికొమ్మచ్చి ఆటలు....ఎవరిని ఉధ్ధరించేను! ఎవరన్నా రెండు దేశాలు ఆడుతుంటే దేశభక్తి కోసమైనా చూస్తాం.ఇదేమిటండీ బాబూ! డబ్బులు ఏంచేసుకోవాలో తెలియని వారు కనిపెట్టిన ఆటలాగా ఉంటుంది నాకు :X అందుకే రాం-రాం ఈ ఐపీయల్ కి.
//ఆడుతుంటే దేశభక్తి కోసమైనా చూస్తాం//
ఆ!!...:D ఆ దేశభక్తి బౌండరీ కెళ్ళ.. :)
Post a Comment