సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, January 4, 2011
మరో మంచి ఇండోర్ ప్లాంట్ (నిన్నటి టపాలోని మొక్క గురించి)
నిన్న పెట్టిన "ఇదేం మొక్కో చెప్పుకోగలరా?" టపాకు ఆరు వ్యాఖ్యలు వచ్చాయి. రాసిన అందరికీ బోలెడు థాంక్స్ లు. అందులో ఇద్దరు(సూర్యుడు గారు, స్నేహ గారు) కరెక్ట్ గా రాసారు. అది potato మొక్క. పైన ఫోటోలో దుంప కనబడుతోంది చూడండీ...
మా చిన్నప్పుడు ఒకసారి ఓ బంగాళాదుంపకు బాగా మొలకలు వచ్చేసాయని మట్టిలో పాతిపెట్టాం. అది పెరిగి అందమైన మొక్కగా తయారైంది. బాగా పొడుకు అయిపోతే నాన్న నాలుగు పుల్లలతో చిన్నపాటి పందిరి కూడా కట్టారు వంగిపోకుండా. కొన్నాళ్ళకు మొక్క ఎండిపోయింది. తవ్వితే క్రిందన చిన్న చిన్నవి నాలుగైదు బంగాళాదుంపలు ఉన్నాయి. ఎంతో అపురూపంగా ఆ బుజ్జి బుజ్జి దుంపలను ఉడకపెట్టుకుని తిన్నాం. ఇది చిన్ననాటి ఊసు.
అలానే మొన్నొకరోజు ట్రేలోని ఓ బంగాళాదుంపకి బాగా మొలకలు వచ్చేసాయి. ఎందులో పాతుదాం అని ఆలోచిస్తూంటే, బీట తీసినా పడేయలేక దాచిఉంచిన ఒక 'అన్ బ్రేకబుల్ డిష్' కనపడింది. వెంఠనే మట్టివేసి potato పాతేసాను. చల్లదనం వల్ల ఓ వారానికి బాగా ఏపుగా పెరిగింది. మరో వారానికి ఇదిగో పైన ఫోటోలోలా అయ్యింది. ఇండోర్ ప్లాంట్ లాగ చక్కగా ఇంట్లో ఏదో ఓ చోట పెట్టుకుంటే ఎంతబాగుంటుందో కదా అని ఐడియా వచ్చింది. మీరూ వేసి చూడండి. చలికాలం కాబట్టి ఇప్పుడే బాగా పెరుగుతుంది. మొక్క పెరిగాకా ఇంట్లో పెట్టినా అప్పుడప్పుడు ఎండలో పెట్టడం మర్చిపోకండేం...:)
గతంలో ఒకసారి చిలకడ దుంపతో అందమైన ఇండోర్ ప్లాంట్ ఎలా తయారౌతుందో రాసాను. ఆ టపా తర్వాత నుంచీ రెగులర్గా మీ బ్లాగ్ చదువుతున్నాం అని కొందరు రాసారు కూడా.
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
బావుందండి. చిలగడ దుంప పాదులా పెరుగుతుంది కదా !
@లలిత: అవునండి. మట్టిలోనే కాదు నీళ్ళలో కూడా పెరుగుతుంది. ఈ టపాలో చూడండి http://trishnaventa.blogspot.com/2009/09/blog-post_07.html
బావుందండీ మొక్క, మీ బ్లాగ్ లొ చూసి నేను సీసాలొ చిలగడదుంప పెట్టాను.బాగానే పెరిగింది.
అయితే సమ్మర్ లో ఆకులు రాలిపొవడంతో తీసేశాను.
బాగుందండి ... ఇంకా అది తోటకూర మొక్కెమో అనుకున్నాను ... ఈ రోజు మీ పోస్ట్ లన్నీ చదువుతూ కూర్చున్నా ...ఇంకా చదవాల్సిఉంది
హలో తృష్ణ గారు ,
మంచి ఐడియా ఇచ్చారు , నేను తప్పకుండా ట్రై చేస్తా. ఇంట్లో మొలకలు వచ్చిన బంగాళా దుంప వుంది :)
తృష్ణగారు! ఇది బంగాళాదుంపనా? నేను శివగారిలాగే ఇది తోటకూర మొక్కనుకున్నా! భలే ఉంది.నాకు చాలాసార్లు అనిపించింది.మొలకలు వచ్చిన బంగాళా దుంపని నేలలో పాతితే మొక్క వస్తుందా? వచ్చినా అది బంగాళాదుంపలు మళ్ళీ కాస్తుందా? అని.ఎవరినో అడిగితే దుంప కుళ్ళిపోతుందీ అన్నారు.సరే అని ఇక అలాంటి పనులు చేయలేదు.ఈసారి మా ఇంట్లో బంగాలాదుంపకి మొలకలు రప్పించి మరీ నాటి బంగాళదుంప మొక్క పెంచుతా :))
evarayinaa anaasa chettu penche prayatnam chesaaraa..pandu techchinappudu top cut chesi paathi choodandi!
@లత: ఎప్పటికప్పుడు కనీసం వారానికి నీరు మారుస్తూ ఉండాలండీ...అయినా పోతే మళ్ళీ పెట్టేసుకోవటమే...:)
@శివరంజని: oh,thankyou. చదవండి..చదవండి...చదువుతూనే ఉండండీ...:)
@: మరి మంచి టపాతో బోణీ చేసేయండి...అక్కడైతే ఇంకా బాగా పెరుగుతుందండీ.
@ఇందు: వేడి ప్రాంతాలో మొక్క వస్తుండి కానీ దుంప ఎక్కువగా పెరగదండీ. ఇప్పుడూ మీరున్న ప్రాంతాల్లో బాగా వస్తుంది. ప్రయత్నించండి.
@ఎన్నెల: ఇక్కడ శ్రీలక్ష్మి లెవెల్లో రాస్తోన్న నన్ను పెట్టుకుని మళ్ళీ ఎవరన్నా పెంచారా అని అడుగుతారేమిటండి? హన్నా. నేనున్నాకదా దొరికిన మొక్కనల్లా నాటేస్తూ ఉంటాను(ప్లేస్ ఉండాలే కానీ).అదీ ప్రయత్నించాను. బానే పెరిగింది కానీ మళ్ళీ ఎంతకీ పైనాపిల్ రాలేదని పీకిపడేసా...:)
మీకు పైనాపిల్ వచ్చిందా?
మీరందరు బలే వున్నారే , ఇలా బంగాళ దుంపలు చిలకడ దుంపలు పెంచేసుకుంటున్నారు, నాకేమో వేసవి కాలం అవ్వగానే ఇంట్లో పెట్టుకున్న తులసి మందార మల్లె మొక్కలని పెంచలేక దుంప తెగిపోతోంది, మొన్నే కచ్చి గా దేవుడిని తిట్టుకున్నా నన్ను ఈ చలి ప్రాంతం లో పడేసాడని. చాలా బావున్నాయి తృష్ణ మీ మొక్కలు. వెరీ నైస్ కీప్ ఇట్ అప్ మేడం..
Post a Comment