ఒకప్పుడు టివీ సీరియల్స్ "meaningful drama" అనిపించేవి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్సవ్వకుండా చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ తో ఆ డైలాగ్స్, పాత్రలు, కథ గురించిన చర్చలకి అంతు ఉండేది కాదు. కొన్ని సీరియల్ డైలాగ్స్ అయితే పేపర్ మీద రాసుకుని దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేం చదువుకునే రోజుల్లోని హిందీ సీరియల్స్ గురించి. తెలుగులో బాలచందర్ వి రెండు సీరియల్స్, ఋతురాగాలు తప్ప ఇంకేమీ చూడతగ్గవి ఉండేవి కాదు. జీ టివీ లో బనేగీ అప్నీ బాత్, కషిష్, సైలాబ్, స్పర్ష్, మొదలైనవి ఎంతో బాగుండేవి. నెట్ లో ఏదో వెతుకుతూంటే "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ దొరికింది.
ఈ పాట సాహిత్యం కోసం సీరియల్ మొదలైనప్పుడు, ఆఖరులో టైటిల్స్ అప్పుడు కాయితం పెట్టుకుని రాసుకుంటూ ఉండేదాన్ని. సీరియల్ లో డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉండేవి. "రవిరాయ్" దర్శకత్వం వహించిన అన్ని సీరియల్స్ లోనూ డైలాగ్స్ అలానే ఉండేవి.
"సైలాబ్" తరువాత "రవిరాయ్" దర్శకత్వం వహించిన "స్పర్ష్" అనే సీరియల్ సోనీ లో వచ్చేది. చాలా బాగుండేది. కృష్ణ పాత్ర అయితే మా స్నేహితులందరికీ ఫేవొరేట్ అయిపోయింది. Mahesh thakur(anand), Mrinalkulkarni (krishna) మధ్యన జరిగే డైలాగ్స్ బాగున్నాయనిపించేవి రాసుకునేదాన్ని. ఇప్పటికీ దాచుకున్నాను....!
ఇంతకీ "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ ను talat aziz స్వరపరచగా, Jagjit singh పాడారు. ఎంతో పాపులర్ అయ్యిందీ గజల్. ఇదిగో వినండి...
lyrics:
अपनी मर्जी सॆ कहाँ अपनी सफर की हमनॆ
रुख हवावॊं का जिधर है उधर की हमनॆ
पेहलॆ हर चीज थी अपनी मगर अब लगता है
अपनॆ ही घर में किसी दूसरॆ घर कॆ हम है
वक्त कॆ साथ मिट्टी का सफ़र सदियॊं सॆ
किसकॊ मालूम कहाँ कॆ है किधर कॆ हम है
चलतॆ रेहतॆ हैं कॆ चलना है मुसाफिर का नसीब
सॊचतॆ रेहतॆ हैं किस राह गुजर कॆ हम हैं
3 comments:
ఇదే సీరియల్లో "జీవన్ క్యాహై చల్తా ఫిర్తా ఏక్ ఖిలౌనా హై " అన్న ఘజల్ కూడా చాలా బాగుంటుంది...నాకు చాలా ఇష్టమైన సీరియల్స్ లో ఇది ఒకటి..కాని extramarital affairs support చేసారని ఈ సీరియల్కి ఒక అపవాదుకూడా ఉంది..
చాలా సంతోషం సార్. నెట్ లో పాట దొరకగానే, ఎవరో ఒక్కరన్నా ఈ సీరియల్ చూసినవాళ్ళు ఉండకపోతారా అని ఈ పోస్ట్ పెట్టాను.... మీరు రాసిన గజల్ క్రింద లింక్ లో వినండి.
http://www.youtube.com/watch?v=S5LNcI_daAI
@ raj: you can get more lyric in this link too --
http://www.youtube.com/watch?v=kCs7VPRswGQ&NR=1
Post a Comment