గాయని, నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, ప్రొడ్యూసర్, రచయిత, స్టూడియో ఓనర్ అయిన బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ గారి జయంతి ఈవేళ. ఈ సందర్భంగా ఆవిడ పాడిన ఒక ప్రైవేట్ రికార్డ్ "పసిడి మెరుంగుల తళతళలు" ఈ టపాలో...
రేడియో రజనిగా ప్రసిధ్ధి పొందిన డా. బలాంత్రపు రజనీకాంతరావుగారు రచించి, స్వరపరిచిన పాట ఇది. ఆయనతో పాటుగా భానుమతి గొంతు కలిపి పాడిన పాట ఇది. 1948లో విజయవాడ రేడియోస్టేషన్ ప్రారంభించిన కొత్తలో ప్రతిరోజూ ప్రసారానికి ముందు ఈ పాట వినిపించేవారు అని రజనిగారు తన తీపి జ్ఞాపకంగా ఇప్పటికీ చెప్పుకుంటారు.
తెలుగుతనం ఉట్టిపడే మధురమైన ఈ పాట నిజంగా తియ్యగానే ఉంటుంది.
భానుమతిగారు పాడిన సినిమాపాటల్లో, "మల్లీశ్వరి" చిత్రంలో నాకు ఇష్టమైన రెండు పాటలు " ఇక్కడ "
5 comments:
మంచి పాట, ఆ పైన చారిత్రాత్మకమైన పాటను బ్లాగ్ పాఠకులకు పరిచయం చేసినందుకు సంతోషం! పనిలోపనిగా ఆ పాట పుట్టుక, చరిత్ర అంతా కూడా చెప్పేయండి.
రజని, భానుమతిగార్లు ఈ పాటను రికార్డుగా కూడా యిచ్చారు. ఆ రికార్డు రెండవ పక్క వారిద్దరు పాడిన "వందేమాతరం" వుంటుంది. అది మంచి క్వాలిటీలో అందించగలిగితే - నావరకు మాత్రం :-) - మీకు బోల్డు ఋణపడివుంటాను. నాకు అప్పట్లో దొరికిన రికార్డు బాగా అరిగిపోయి వుండటంతో ఆ పాటను సరిగా రికార్డు చేసుకోలేకపోయాను.
నిజానికి ఆపాట 4-5 సంవత్సరాల క్రితం మిత్రులొకరు దేశమంతటా రికార్డయిన వందేమాతరం వెర్షన్లనన్నిటిని compile చేస్తూ తెలుగువారు పాడినవుంటే పంపమన్నారు. ఆ 2 సి.డి ల సంకలనంలో రజని, భానుమతుల పాట చేర్చలేకపోయానని ఇప్పటికీ చాలా బాధ పడుతుంటాను.
భవదీయుడు,
-- శ్రీనివాస్
ప్రైవేటు రికార్డ్ అని, రజనిగారు రచించి స్వరపరిచారనీ రాసానండీ. మిగిలిన వివరాలు తెలియవు మరి. "వందేమాతరం" పాట గురించి విన్నాను కానీ నా దగ్గర లేదండీ. ఎక్కడైనా దొరుకుతుందేమో కనుక్కుని తెలియపరుస్తాను.. ధన్యవాదాలు.
తృష్ణ గారూ పాటెక్కడండీ? నాకు కనిపించట్లేదు :(
నాకు మైల్ చెయ్యగలరా ఈపాటని? వినాలని ఉవ్విళ్ళూరుతున్నాను....అందులోకి భానుమతి పాట...తహతహలాడిపోతున్నా!
@ఆ.సౌమ్య:ఎలా మిస్సయిందోనండి.. చూసి పంపుతాను. తెలియచేసినందుకు థాంక్యూ..:)
సౌమ్య గారు , దొరికిందండి పాట..లింక్ సరిచేసాను. మరోసారి ధన్యవాదాలు.
Post a Comment