ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన "శ్రీకృష్ణస్తుతి", "కృష్ణాష్టమి" సందర్భంగా ఈ టపాలో...
ఈమని శంకర శాస్త్రిగారి మేనల్లుడైన ఎమ్.ఎస్.శ్రీరాం గారు "పెళ్ళి రోజు", "మంచి రోజు" మొదలైన తెలుగు చిత్రాలు, "అనుమానం" మొదలైన డబ్బింగ్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
ఈ కృష్ణస్తుతిని స్తుతించిన మహామహులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎన్.సీ.వీ.జగన్నాధాచార్యులు గారు, వింజమూరి లక్ష్మిగారు, వి.బి.కనకదుర్గ గారు. ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన ఈ కృష్ణస్తుతి, శివస్తుతి మొదలైనవి విజయవాడ రేడియోకేంద్రం నుండి ఎన్నోసార్లు ప్రసారమై ఎంతో ప్రజాదరణ పొందాయి.
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే "శ్రీకృష్ణస్తుతి" ...
|
8 comments:
ది నా ఆల్ టైమ్ ఫేవరిట్! ఇంకేవరు ఎలా దీన్ని పాడినా సహించలేనంతగా అలవాటు పడిన స్తోత్రం ఇది. ఆలిండియా రేడియో వాళ్ళు వేసిన రికార్డుల్లో ఇది లేదు ప్చ్!
అనంత శయనం అయ్యంగార్ , మరో కళా కారుడూ కల్సి పాడిన వెంకటేశ్వర సుప్రభాతం మీ వద్ద ఉందాండి! ఉంటే నాకు ఇవ్వగలరా?
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .
బాగుందండి కృష్ణ స్తుతి.నేను వినలేదండి ఇదివరకు .డౌన్లోడ్ చేసేసుకున్నా .మీరు ఇటువంటి మంచిమంచి పాటలన్నీ పెడుతుఉండాలి.
బాగుందండీ. నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇది వరకు కూడా విన్నా. కృష్ణాష్ణమి శుభాకాంక్షలు.
@సుజాత: నాకూ బాగా నచ్చుతుందండీ. మీరడిగినది చేరవేయటానికి ప్రయత్నిస్తానండీ.
@మాలా కుమార్: ధన్యవాదాలు.
@రాధిక(నాని): మీవంటి మంఛి లిజనర్స్ ఉన్నారని తెలిసింది కదా, వీలైనంతమటుకు తప్పక ప్రయత్నిస్తానండీ.
@భావన: ఒకఫ్ఫుడు విజయవాడ రేడియోస్టేషన్ ప్రసారాలలో ఈ కృష్ణస్తుతి, శివస్తుతి మొదలైనవి శ్రోతలు బాగా మెచ్చి, మళ్ళీ మళ్ళీ ప్రసారంచేయమని అడిగేవారండీ.
Happy to see you after many days...
Chinnapudu Radio lo "Keeyurani Bhushayanthi Purusham......" anne samskrutha padyam vachedi.
Nenu Net lo daanikosam ento vetikannu, Nakku dorakaledu.
Mee daggara aa audio clip vunte upload cheyyagalaru.
Itlu,
Ravi Kumar
@ravikumar:దొరికితే తెలియపరుస్తానండి.
Post a Comment