హాస్య బ్రహ్మ జంధ్యాల గారి అద్భుత హాస్య చిత్రరాజాల్లో "మొగుడు పెళ్ళాలు" ఒకటి. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు 15ఏళ్ళ క్రితం ఒకసారి టివీలో ప్రసారమైనప్పుడు (అప్పుడు కంప్యూటర్లు, యూట్యూబ్ లు, డివిడీలు తెలియని క్రితం ) నేను టేప్ రికార్డర్లో కొన్ని హాస్య సన్నివేశాలు రికార్డ్ చేసాను. ముఖ్యంగా నా ఫేవొరేట్ హాస్యనటి శ్రీలక్ష్మి గారి డైలాగులు, సుత్తి వీరభద్రరావు గారి కొత్తరకం తిట్ల ప్రయోగాలు కడుపుబ్బ నవ్విస్తాయి.
మా ఇంట్లో ఇప్పటికీ "లకసుమపినాకీ", "కీ", "చించినాహట్" లాంటి తికమక పదప్రయోగాలు, "మొజాయిక్ ఫ్లోర్ మీద ఆవలు వేసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం నువ్వూనూ.." లాంటి వాక్యాలూ వాడుకుంటూ ఉంటాము. ఆ డైలాగుల్ని మిత్రులందరూ విని మరోసారి మనసారా నవ్వుకోండి.
http://www.esnips.com/doc/eda4acce-ffe8-4bc2-88bf-4c3d39e9d13d/mogudu-pellaalu-సుత్శోర్ట్
http://www.esnips.com/doc/eda4acce-ffe8-4bc2-88bf-4c3d39e9d13d/mogudu-pellaalu-సుత్శోర్ట్
12 comments:
:) :) హాస్యబ్రహ్మకు జోహార్ !
Poddunne levagaane baagaa navvunchaaru. Thanks for the post :)
chaalaa bagundi download chesukovadam ela
baagunnayandi .mallii okasaari aa dailagulanni vinipinchaaru.
చించినాహట్ తిట్టు బాగుంది..
తాంతియాతోపే పేరు చాలా రోజులతర్వాత విన్నా.. అర్జెంట్‌గా ఈ సినెమా డి వి డి కొని చూసెయ్యాలి..ధన్యవాదాలు త్రుష్ణగారు..
సిరిపురపు క్రిష్ణవల్లభరావు సుత్తివేలు అసలు పేరా?అది జస్ట్ ఈ సినెమా పేరా?
అద్భుతంగా ఉన్నది ఆడియో. ఈ సారి విజయవాడకి వెళ్ళి నప్పుడు గుర్తుంచుకుని ఈ సినిమా కొనుక్కోవాలి తప్పదు.
ee cinima chala baguntundi, ede kadu jandyala gari cinimaalanni chala chala baguntai nenu ekkadikochchaaka ave naaku koncham kalakshepam
చాలా బాగుంది...ఆఫీస్‌లోనే తెగ నవ్వేసాను నేనైతే...ఎంతైనా వీరభద్రరావుగారి కామెడీనే కామెడి...ఎంత నవ్విస్తాయో ఆయన డైలాగ్సు మరియు ఆ మాడ్యులేషన్....శ్రీలక్ష్మీ కామెడీ బాగుంది...ఒక చోట భార్య పోయినపుడు అతను అనే డైలాగ్స్ మనసుకు హత్తుకున్నాయి....అజ్జెంటుగా ఈ సీ.డీ కొనుక్కోవాలని నేను డిసైడ్ అయిపోయా...మంచి కలెక్షన్‌ని మాతో పంచుకున్నందుకు థాంక్యూ...
http://www.onlinewatchmovies.net/telugu/mogudu-pellalu-1985-telugu-movie-watch-online.html
ఇంకా చాల చోట్ల వుంది ఈ సినిమా ఆన్ లైన్ లో వుంది ...
@పరిమళం,@సృజన:
thank you.
@a: ఆ ఈస్నిప్ ఐకాన్ పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ కు దారి చూపెడుతుందండీ. లేట్ గా జవాబు రాస్తున్నండుకు మన్నించాలి.
@radhika(nani): thank you.
@raj:'సుత్తి వేలు' పేరు వెనుక ఉన్న చిన్న కథ -- అసలు పేరు 'కె.లక్ష్మీ నరసింహారవు' అండీ. బాగా సన్నంగా ఉన్నాడని చిన్నప్పుడు "వేలు" అని పిలిచేవారట. "నాలుగుస్థంభాలాట" సినిమా టైటిల్స్ లో "వేలు" అనే ఉంటుంది. ఆ సినిమా తరువాత ఆయన "సుత్తివేలు", వీరభద్రరావుగారు "సుత్తి వీరభద్రరావు" అయ్యారు.thankyou.
@శివ: తప్పక కొని ఉంచుకోవాల్సిన కామిడీ. నాకూ దొరకలేదండీ. వెతకాలి.thankyou.
@లక్ష్మీ స్రవంతి: నిజం. మంచి రిలాక్సింగ్ కాలక్షేపం. ధన్యవాదాలు.
@శేఖర్: ఎన్నిసార్లు విన్నా మళ్ళి వినాలనిపిస్తాయి. సినిమా నేనూ కొనుక్కోవాలండీ. ధన్యవాదాలు.
@విజయ క్రాంతి: లింక్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండీ.
Post a Comment