అద్గదీ "BoBo" కధ. యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, మిక్కీ జె మేయర్ తదితరుల తరువాత దిగుమతి అయిన ఈ తమిళ "శశి" మరో ప్రోమిసింగ్ కంపోజర్ అని నాకనిపిస్తోంది. మరి ఎంతవరకు రాణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే...!!
Tuesday, August 31, 2010
promising "BoBo"
అద్గదీ "BoBo" కధ. యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, మిక్కీ జె మేయర్ తదితరుల తరువాత దిగుమతి అయిన ఈ తమిళ "శశి" మరో ప్రోమిసింగ్ కంపోజర్ అని నాకనిపిస్తోంది. మరి ఎంతవరకు రాణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే...!!
Monday, August 30, 2010
ఒక వెరైటీ కథ - "సెవెన్త్ సెన్స్"
Friday, August 27, 2010
Tribute to Mukesh...
నాన్న ఫేవరేట్ సింగర్ ముఖేష్. బోలెడు పాటలు చిన్నప్పటి నుంచీ వినీ వినీ మాక్కూడా ముఖేష్ అంటే ఇష్టం. ఇవాళ ఆయన చనిపోయిన రోజు.(aug.27,1976) ఆ రోజున రేడియోలో ఆ వార్త విన్న సంగతి ఇప్పటికీ నాన్న తలుచుకుంటారు.
sab kuch seekhaa hamne (anari)
kabhi kabhi mere dil mein (kabhi kabhi)
kai baar yuhi dekha hai (rajnigandha)
jeenaa yahaa marnaa yahaa (mera naam joker)
jaane kaha gayE woh din (mera naam joker)
jis gali mein tera ghar na ho baalma (kati patang)
nain hamaarE (annadata)
ek din bik jayEgaa maaTi ke mool (Dharam karam)
ek pyaar ka nagma hai (shor)
dost dost na rahaa (sangam)
dil jalta hai (pehli nazar)
gaye ja geet milan ke(mela)
chod gayE baalam (Barsat)
aawaara hoon (Awaaraa)
raat andheri door savErA (Aah)
mera jootaa hai jaapAnI (shree 420)
woh subha kabhi to aayegi (phir subah hogi)
Suhaanaa safar (madhumati)
ye mera deewana pan hai (yahudi)
aa laut ke aajaa meere meet (rani roopmati)
Hum hindustani (Hum hindustani)
tere yaad dil se (Hariyali aur Raasta)
aa ab laut chalE (jis desh mein ganga behti hai)
bhooli hui yaadein (sanjog)
Tum jo hamare meet na hotE (aashiq)
humne tughse pyar kiya tha jitna (dulha dulhan)
sajanre jhoot mat bolo (teesri kasam)
chandan sa badan (saraswatichandra)
kahi door jab din dhal jaye (Anand)
woh tera pyaar ka gham (My love)
koi jab tumhara hruday toD de(purab aur pachhim)
mein har ek pal ka shaayar hoon (kabhi kabhi)
bas yahi apraadh mein har baar karta hoon (Pehchaan)
Tum aaj mere sang haslo (aashiq)
ఎంత పెద్ద లిస్ట్ అయ్యిందో...రాస్తున్నంత సేపు పాటలాన్నీ పాడేసుకుంటూ రాసేసా...భలే పాటలు..!!
కొందరన్నా ఈ లిస్ట్ చదువుతూ కొన్ని పాటలన్నా పాడుకోకుండా ఉంటారా అని ఆశ.
*******************
ముఖేష్ సంస్మరణార్ధం రేపు(28-8-10) రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ ముఖేష్ గా పేరుగాంచిన సామ్సన్ ముఖేష్ గారి "స్వరాంజలి" పేరున పాటలవిభావరి నిర్వహిస్తున్నారుట. సమయం మాత్రం రాత్రి ఎనిమిదిగంటలకని రాసారు. (మరి అంత ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారో..)
Thursday, August 26, 2010
పిల్లలకి ఒక మంచి వెబ్సైట్...
ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలున్న వాళ్ళకీ... పిల్లల గేమ్స్ అడుకునే నాకులాంటి పెద్దపిల్లలకీ ఒక మంచి సంగతి..
మా పాప కోసం వెదుకుతూంటే ఇటీవలే నాకు దొరికిన ఒక మంచి వెబ్సైట్ ఇది. దీనిలో గేమ్స్, మిగిలిన ఎంటర్టైన్మెంట్ కాకుండా నాకు బాగా నచ్చినవి "Math Games". ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలు సులువుగా Maths నేర్చుకోవటానికి వీలుగా ఉండేలా ఉన్నాయి ఈ గేమ్స్.
మీరూ ప్రయత్నించండి..
http://www.toytheater.com/
ninaikkattherindha manamae...
నాకు అస్సలు తమిళం రాదు. కానీ కొన్ని తమిళ్ పాటలు విన్నప్పటినుంచీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి నాకు. పాత తమిళ్ పాటల కలక్షన్ మా నాన్నగారి దగ్గర బాగానే ఉన్నాయి. నా కాలేజీ రోజుల నాటి తమిళ్ సాంగ్స్ మాత్రం నేను అక్కడ ఉన్న స్నేహితులు, కజిన్స్ ద్వారా రికార్డ్ చేయించి తెప్పించుకునేదాన్ని. భాష తెలియకపోయినా వినటానికి కొన్ని పాటలు చాలా బాగుంటాయి. సినిమా పేర్లు తెలియక ఫలానా నటులు నటించారు, పాటలో ఫలానా కలర్ డ్రెస్స్ వేసుకుని ఉంటారు అని ఉత్తరంలో రాసేదాన్ని.
ఈ టపాలో పెడుతున్న పాట సుప్రసిధ్ధ గాయని పి.సుశీల పాడినది. పి.సుశీల గళంలోని మాధుర్యాన్ని మనం ఎన్నో తెలుగు పాటల్లో విన్నాం. కానీ ఆవిడ పాడిన కొన్ని తమిళ సినీ గీతాల్లో వారి వాయిస్లోని హైపిచ్ ను మనం పూర్తిగా ఆస్వాదించగలుగుతాము. తెలుగులో కూడా సుశీలగారివి అద్భుతమైన పాటలు ఉన్నా, సుశీలగారి గళాన్ని పూర్తి స్థాయిలో బాగా వాడుకున్నది తమిళసంగీతదర్శకులే అని కొందరు అంటూంటారు. "ఆనందజ్యోతి" అనే తమిళ చిత్రంలోని ఈ పాట విన్న తర్వాత నాకు అది నిజమేనేమో అనిపించింది.
ఈమధ్యనే విన్న ఈ పాట విన్న కొద్దీ మళ్ళి మళ్ళీ వినాలనిపించింది. అర్ధం తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను కానీ అడిగినవారు సరైన పొందికలో చెప్పలేకపోయారు. ఆఖరికి ఒక స్నేహితురాలు పంపిన అర్ధం సమంగా ఉందనిపించింది. "ఈ సాహిత్యానికి పొయిటిక్ గా అర్ధాన్ని రాయటం కష్టం, నాకు తెలిసినట్లుగా రాసి పంపుతున్నాను" అని తను చెప్పింది.
యూట్యూబ్ లింక్ క్రిందన తమిళ్ సాహిత్యం, ఆ క్రిందనే ఆంగ్ల అర్ధం రాసాను. విని, చదివి ఆస్వాదించండి.
సినిమా : ఆనందజ్యోతి(1963)
పాడినది: పి.సుశీల
సంగీతం: విశ్వనాధన్-రామ్మూర్తి
సాహిత్యం: Kannadasan
ninaikkath therindha manamae unakku marakkath theriyaadhaa
pazhagath therindha uyirae unakku vilagath theriyaadhaa
uyirae vilagath theriyaadhaa (ninaikkath)
OH MIND, IF YOU KNOW HOW TO REMEMBER, DON'T YOU KNOW HOW TO FORGET?
OH SOUL, IF YOU KNOW HOW TO MEET, DON'T YOU KNOW HOW TO DEPART?
OH SOUL, DON'T YOU KNOW HOW TO DEPART?
mayangath therindha kannae unakku urangath theriyaadhaa
malarath therindha anbae unakku maraiyath theriyaadhaa
anbae maraiyath theriyaadhaa
(ninaikkath)
OH EYE, if YOU KNOW TO MESMERISE, DONT YOU KNOW HOW TO CLOSE?
OH LOVE, if YOU KNOW TO BLOSSOM, BUT DON'T YOU KNOW TO DISAPPEAR?
OH LOVE, DONT YOU KNOW TO DISAPPEAR?
edukkath therindha karamae unakku kodukkath theriyaadhaa
inikkath therindha kaniyae unakku kasakkath theriyaadhaa
padikka therindha idhazhae unakku mudikkath theriyaadhaa
padarath therindha paniyae unakku maraiyath theriyaadhaa
paniyae maraiyath theriyaadhaa -Mist then don’t u know how to hide
(ninaikkath)
OH HAND, YOU KNOW HOW TO TAKE, BUT DON'T YOU KNOW HOW TO GIVE?
OH FRUIT, YOU KNOW TO BE SWEET, BUT DONT YOU KNOW HOW TO TURN BITTER?
OH BOOK, YOU KNOW HOW TO READ, BUT DON'T YOU KNOW HOW TO FINISH?
OH MIST, YOU KNOW HOW TO SPREAD, BUT CAN'T YOU DISAPPEAR?
OH MIST, CAN'T YOU DISAPPEAR?
kodhikkath therindha nilavae unakku kulirath theriyaadhaa
kulirum thenral kaatrae unakku pirikkath theriyaadhaa
pirikkath therindha iraivaa unakku inaikkath theriyaadhaa
inaiyath therindha thalaivaa unakku ennaip puriyaadhaa
thalaivaa ennaip puriyaadhaa
(ninaikkath)
OH MOON, YOU KNOW HOW TO BURN, DON'T YOU KNOW HOW TO COOL?
OH BREEZE, YOU KNOW HOW TO SOOTHE BUT DON'T YOU KNOW HOW TO SEPARATE?
OH LORD, YOU KNOW HOW TO SEPARATE, BUT DON'T YOU KNOW TO JOIN US?
OH DEAR, IF YOU ARE CLOSE TO ME, DON'T YOU UNDERSTAND ME?
OH DEAR, DON'T YOU UNDERSTAND ME?
**************************************************
అడిగిన వెంఠనే పాట అర్ధాన్ని రాసి పంపిన నా స్నేహితురాలి స్నేహితురాలికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.
Monday, August 23, 2010
రాఖీ శుభాకాంక్షలు
Thursday, August 19, 2010
వైదేహిగారి కవిత
వృత్తిపరంగా డాక్టర్.
ప్రవృత్తి పరంగా కవయిత్రి.
స్వభావరీత్యా స్నేహశీలి.
ఒక మంచి మిత్రురాలు.
డా.వైదేహీ శశిధర్ గారితోనూ, వారి కవితలతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం...తిలక్ గళంలో ఆయన కవిత పోస్ట్ పెట్టినప్పుడు పరిచయమయ్యారు. రెండు మూడు వాక్యాలు రాసినా వాటిల్లో ఎంతో ఆత్మీయత, అభిమానం దాగిఉంటాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే మనోబలం మాటల్లో చెప్పలేనిది.
కవిత్వాన్ని విశ్లేషించేంత భాష నాకు రాదు కానీ వైదేహిగారి కవితలు చదివినప్పుడల్లా అవి నా మనసుని తాకుతాయి, వాటిల్లోని దగ్గరితనం మనసు మూలల్లో దాగున్న ఎన్నో భావాలను తట్టిలేపుతాయి.వైదేహిగారు కవితా సంకలనం "నిద్రిత నగరం" గురించి ఇక్కడ చూడవచ్చు.
కౌముది ఆగష్టు సంచిక లో ప్రచురితమైన వైదేహిగారి కవిత "మిత్రచ్ఛేదం" నాకు బాగా నచ్చింది. వారి అనుమతితో అది ఇక్కడ రాస్తున్నాను..
"మిత్రచ్ఛేదం"
పూర్తిగా ఆలపించకుండానే
అర్ధంతరంగా ఆపేసిన రాగాలు
కొన్ని పరిచయాలు.
అభిమానంతోనో అతిశయంతోనో
ఎప్పటికీ పూర్తి చేయని
జుగల్బందీలు కొన్ని స్నేహాలు.
అసహనంతోనో అపనమ్మకంతోనో
మధ్యలోనే ముగించిన రహదారి ప్రయాణాలు
మరికొన్ని పరిచయాలు.
మొత్తంగా రేకులు విడవకముందే
తన పరిమళంతో
జ్ఞాపకాలను వెలుగించే స్నేహపుష్పాలని
అహాల పోరాటం వల్లో అమాయకమైన అజ్ఞానంతోటో
కొనగోటితో చటుక్కున త్రుంచేసే
వేన వేల హస్తాలు !!
***
వైదేహిగారి కవితల్లో నాకు నచ్చిన మరో కవిత "నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య "
వైదేహిగారు రాసిన మరిన్ని కవితలు ఇక్కడ చూడవచ్చు.
అనుమతినిచ్చిన వైదేహిగారికి ధన్యవాదాలతో...
తృష్ణ.
Monday, August 16, 2010
Tum se hi...Tum se hi...
సాహిత్యం: Irshad Kamil
సంగీతం: Pritam Chakraborty
శ్రీరాముడి విజయం..!!
ఆనందమానందమాయెనే...మన శ్రీరాముడు ఇండియనైడిలు ఆయెనే....!!
***
నిన్న పొద్దున్నే ఫోనులో ముఖ్యమైన విశేషాలు అయిపోయాకా, పిచ్చాపాటి కబుర్లలోకి వచ్చాము...
"ఇవాళ ఇండియన్ ఐడిల్ చూడాలి రాత్రి" అన్నాను.
"ఇండియన్ ఐడిలా..??" తన ప్రశ్న.
"శ్రీరామ్ గురించి ఎక్కడా చదవలేదా..చూడలేదా?"
"శ్రీరామ్ ఎవరు?"
"రామ రామా..ఇదేం ప్రశ్నండీ..? once upon a time in mumbai...
మనం సోనీ చానల్ లో ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాం మొదలైనప్పటీ నుంచీ ఇద్దరు ఐడిల్స్ సెలక్షన్స్ వరకూ అన్ని ఎపిసోడ్స్ చూసేవాళ్ళం...
అర్ధరాత్రి దాకా రిజల్ట్ చెప్పరు..మధ్యలో ఏడ్స్...నాన్పుడు, టైమ్ వేస్ట్ అని మీరు విసుక్కునేవారు గుర్తులేదా?"
"ప్చ్...!"
"అవునులెండి, మీకు గుర్తుంటే ఆశ్చర్యపడాలికానీ.....అయినా శ్రీరామ్ గురించి తెలియకపోవటమేమిటండీ..." అన్నాను నిరాశగా..
అప్పుడు ఓ నవ్వు నవ్వి చెప్పారు " నేను SMS చేసాను" అని.
ఈసారి నేను ఆశ్చర్యపోయాను..
"ఏమిటి? మీరేనా? SMS ఆ? అయితే ఆ కుర్రాడు ఖచ్చితంగా గెలుస్తాడు.." అన్నాను నవ్వుతూ.
"అవును మరి, మన తెలుగుఅబ్బాయిని మనమే గెలిపించాలి " అన్నారు.
FM లకు, టివీ ప్రోగ్రాములకు SMS లు పంపటం అనేది మా ఇద్దరికీ ఇష్టం లేని పని. మామూలు SMS కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేట్ అయినా సరే SMSలు చేసేస్తూ మనకు తెలియకుండానే మొబైల్ కంపెనీలను పోషిస్తూ, వాళ్ళ లాభాలను పెంచుతున్నాం అన్నది మా అభిప్రాయం. మా అత్తగారు ఏదన్నా కార్యక్రమానికి SMS పంపమని అడిగితే, నాకయితే ఛాయిస్ ఉండదు కానీ మా వారయితే బయటకు వెళ్తున్న మనిషి ఆగిపోయి, ఆవిడ "బాబూ, నేను SMS పంపనులే.నువ్విక వెళ్ళు" అనే దాకా ఆవిడకు ఓ క్లాస్ ఇచ్చి వదులుతూ ఉంటారు. అలాంటి మనిషి ఇవాళ తెలుగువాడిని గెలిపించాలి అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు.
సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు. అలాంటిది ఒక తెలుగువాడిని గెలిపించాలి అని ఇవాళ రాష్త్రమంతా కలిగిన ఈ స్పృహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
శ్రీరామ్ లోని ప్రతిభ అతడిని చివరిదాకా నడిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కార్యక్రమం గురించి తెలిసినా, తెలియకపోయినా; ప్రేక్షకుల్లో సంగీతం గురించిన అవగాహన ఎంత ఉందీ అన్న ప్రశ్న పక్కన పెడితే, తెలుగువాడిని గెలిపించాలి అనే స్పృహ వలన యావత్రాష్ట్రంలో కలిగిన ప్రకంపనల తరంగాలు అతడి విజయానికి కారణమయ్యాయి. కానీ ...ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి? అన్న ఒక్క విషయమే నాకు మింగుడు పడని ప్రశ్న. మిగిలిన కార్యక్రమాలకీ సంగీత పోటీలకూ తేడా ఉంది కదా. ఇక్కడ గెలుపును సంగీతజ్ఞులు, విద్వాంసులు నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. విద్వాంసులు, సంగీతజ్ఞులైన జడ్జీలు ఉన్నా కూడా గెలుపు జనం ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది అంటే అది నేను హర్షించలేను. ప్రాంతీయ,జాతి,మత భేదాలు లేకుండా ఎంత మంది జనం నిజమైన ప్రతిభకు ఓటు వేస్తారు? ఇలాంటి గెలుపు ను పాల్గొనేవాళ్ళు, ప్రేక్షకులు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు? అన్నది నాకు అర్ధంకాని ప్రశ్న.
ఈ మధ్యన ఏ టివీ చానల్ చూసినా ప్రతి కార్యక్రమంలో ఈ మధ్యన ఈ SMSల జోరు బాగా పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా సరే అసలు మన డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు SMSలు చెయ్యాలి? పూర్వకాలం ఈ SMSలు ఉన్నాయా? అయినా "సురభి", "TVS Saregama", సిధ్ధార్ధబాసు క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ షోలు, సీరియల్స్ మొదలైన వన్నీ ప్రాముఖ్యతను పొందలేదా? ఎందుకు మొబైల్ కంపెనీవాళ్ళ ఆదాయాల్ని సామాన్య ప్రేక్షకుడు పెంచాలి? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. నాకనిపించేదేమిటంటే జనంలో పెరగాల్సింది SMSలు చెయ్యటం వల్ల మనకన్నా మొబైల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం వాటిని పెంచి పోషిస్తున్నాము అన్న స్పృహ. కాదంటారా?
*****
ఇవాళ పొద్దున్నే తనకు ఫోన్ చేసాను...
"శ్రీరామ్ గెలిచాడు తెలుసా. అర్ధరాత్రి దాకా కూర్చుని చూసాను.."
"తెలుసు...అతనిది మన ఏరియానేట. రాత్రి చాలా హంగామా చేసారు...ఆ టపాకాయలూ, ఫైవర్క్స్ సందడికి నాకు మెలుకువ వచ్చెసింది...నిద్రలో పిల్ల జడుసుకుంది కూడా..."
Sunday, August 15, 2010
స్వాతంత్ర్యం..?!
ఈ మధ్యన న్యూస్ పేపరు చూస్తూంటే మాత్రం నాకు ఒకే పాట గుర్తుకు వస్తోంది...ఇవాళ పొద్దున్నుంచీ కూడా ఇదే పాట నోట్లో తిరుగుతోంది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డ్ + రాష్ట్రంలో నందీ అవార్డ్ అందుకున్న "సిందూరం(1997)" సినిమాలోని ఈ పాట రచయితగా శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నంది అవార్డ్ కూడా అందుకున్నారు.
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!
తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!
Friday, August 13, 2010
కృష్ణశాస్త్రిగారి గళం
భాషా పాండిత్యం లేని నాబోటి సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా సరళమైన కవిత్వాన్ని రాయగల నేర్పు ఒక్క కృష్ణశాస్త్రిగారికే ఉందనటం అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుని గళం వినాలనే కుతూహలం లేనిదెవరికి? 5-2-54 లో కాకినాడ లోని సరస్వతీ గానసభ వజ్రోత్సవాల(గోల్డెన్ జూబిలీ) సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చేసిన ప్రసంగంలోని కొంత భాగం ఇక్కడ పెడుతున్నాను.
ఈ సభ జరిగిన నాలుగైదేళ్ల తరువాత ఆయన స్వరం బొంగురుపోవటం, తప్పనిసరిగా ఆపరేషన్, తదనంతరం ఆ స్వరం మూగపోవటం జరిగింది. అందువల్ల చాలా మందికి ఈ అద్భుత కవి స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఆంధ్రా షెల్లీ గా ప్రఖ్యాతిగాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గళాన్ని ఈ బ్లాగ్ ద్వారా వినిపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Thursday, August 12, 2010
"అర్ధాంగి" (1955)
ఏ రకమైన సినిమా అయినా, చూస్తున్నంత సేపూ ఎంతో ప్రశాంతతని, హాయిని ఇస్తాయి మన పాత "బ్లాక్ అండ్ వైట్" చిత్రాలు. రంగులు లేక పోయినా ఎంతో గ్రేస్ ఉంటుంది ఆ చిత్రాల్లో. ఇక పాటల సంగతి చెప్పనక్కరలేదు. వెన్నెల్లో విహారమే. కొత్త పాటలూ, బాణీలూ కూడా బావుంటాయి కానీ అప్పటి సినిమాల, వాటిల్లోని పాటల తేరే వేరు. ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా ఒక సందేశం, దర్శకులు చెప్పదలుచుకున్న నీతి ఉండేవి. ఫలానా పాత్ర ధరించటం వల్ల "ఇది నేర్చుకున్నాను..." అని కొందరు నటులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అటువంటి అలనాటి తరానికి చెందిన కొన్ని ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటే "అర్ధాంగి". పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన రాగిణివారి "అర్ధాంగి" 1955, జనవరి 26న రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర కధకు బెంగాలీ నవల "స్వయంసిధ్ధ" ఆధారం. అర్ధాంగి లోని ’పద్మావతి’ పాత్రను సావిత్రిగారి నటజీవితంలో ఒక మరపురాయిగా చెప్పుకోవచ్చు. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో చీకటిగా మారబోయిన జీవితాన్ని వెలుగుబాటలోకి ఎలా నడిపించుకోవచ్చునో తెలుపుతుంది కధలోని పద్మావతి పాత్ర.
కధలోకి వెళ్తే, జమిందారు భుజంగరావు(గుమ్మడి)కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాఘవేంద్రరావు(నాగేశ్వరరావు) చిన్నతనంలో తల్లి చనిపోతుంది. జమిందారు రెండవ భార్య రాజేశ్వరి(శాంతకుమారి).ఆమెకు తన కొడుకు నాగేందర్రావు(జగ్గయ్య) పైన మితిమీరిన వాత్సల్యం. ఆయమ్మ పెంపకంలో పెరిగిన పెద్ద కుమారుడు రఘు మతిస్థిమితం లేనివాడు కావటంతో జమిందారు ఆస్తిని పొగరుబోతు అయిన చిన్నకొడుకు నాగు కు అప్పగిస్తాడు. బాధ్యత నెత్తిన పడిన తరువాత కూడా అతడిలో మార్పు రాదు.
రామాపురం లో వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళిన నాగు అక్కడి రైతు అయిన కోటయ్యపై దౌర్జన్యం చేస్తూండగా, మరో రైతు భూషయ్య కుమార్తె అయిన పద్మ అతడికి ఎదురుతిరిగి, అతడి అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. జరిగింది విన్న జమిందారు నాగు ను దారిలోకి తేగల వ్యక్తిగా భావించి పద్మతో అతడి వివాహం నిర్ణయిస్తాడు. కానీ అందుకు రాజేశ్వరి అంగీకరించకపోవటం తో నాగుకు బదులుగా పద్మను పెద్ద కొడుకు రఘుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు.
పెళ్ళిపీటల మీద భర్త నాగు కాదని, మతిస్థిమితం లేని జమిందారు పెద్దకొడుకు అని తెలుసుకున్న పద్మ నిర్ఘాంతపోతుంది. కానీ అర్ధాంగిగా తన కర్తవ్యాన్ని గుర్తించి భర్తలో మార్పు తేవటానికి ఎంతో కృషి చేస్తుంది. కానీ ఆమె సహనానికీ, పట్టుదలకూ పరీక్షగా అత్త రాజేశ్వరీ, మరిది నాగూ ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు. తన ధైర్యం, సహనం, ప్రేమానురాగాలతో పద్మ రఘును ఎలా మామూలు మనిషిని చేసింది; బాగుపడిన రఘు అధికరంలోకి రావటం సహించలేని రాజేశ్వరి, నాగూ భార్యాభర్తలను ఎటువంటి ఇబ్బందులకు గురిచేసారు; అధికార దాహంతో తప్పుదారి పట్టిన నాగును, అత్తగారు రాజేశ్వరి ఇద్దరిలోనూ తన మంచితనంతో పద్మ ఎలా మార్పును తెచ్చిందనేది మిగిలిన కధ. మొదట మతి స్థిమితం లేని భర్తగా, బాగయ్యాకా బాధ్యత గల భర్తగా, తండ్రి ఆస్తిని కాపాడే కొడుకుగా నాగేశ్వరరావు నటన మన్ననలనందుకుంది. ఇక పొగరుబోతుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగ్గయ్య, అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చాలని తాపత్రయపడే తండ్రి పాత్రలో గుమ్మడి, కొడుకుపై వల్లమాలిన ప్రేమతో అతడి పతనానికి పరోక్షంగా కారణమయ్యే తల్లి పాత్రలో శాంతకుమారి మెప్పిస్తారు.అందరినీ మించి టైటిల్ రోల్ లో భర్తను బాధించేవారి నుంచి రక్షించుకుంటూ, లాలనతో, అనురాగం తో అతడిలో మార్పు తెచ్చే సావిత్రి నటన మాత్రం అపూర్వం.
సినిమాలో సంగీతం, ఫొటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, డైలాగ్స్, దర్శకత్వమూ అన్నీ చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఆరు పాటలు, రెండు నేపథ్య గీతాలూ ఉన్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది బి.ఎన్ ఆర్(భీమవరపు నరసింహారావు). వాటిలోని "వద్దురా కన్నయ్యా" , "ఎక్కడమ్మా చంద్రుడు" పాటలు రెండూ నాకు బాగా ఇష్టమైనవి. రెండూ కూడా జిక్కీ(పి.జి.కృష్ణవేణి) పాడినవే. సన్నివేశానికి అనుగుణమైన ఆత్రేయగారి సాహిత్యం ఉదాత్తమైన భావాలను కలిగిస్తుంది. తమిళంలో ఈ చిత్రాన్ని "పెన్నిన్ పెరుమై" పేరుతో నిర్మించారు పుల్లయ్యగారు.
పాటల కోసం వెతుకుతూంటే యూట్యూబ్లో సావిత్రిగారు విజయవాడ రేడియో స్టేషన్ వారి కొసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బిట్ ఒకటి దొరికింది. ఈ ఇంటర్వ్యూ బిట్ యూ ట్యూబ్ లోకి ఎవరు పెట్టారో తెలియదు కానీ, విజయవాడ రేడియో స్టేషన్లో జరిగిన సావిత్రిగారి ఇంటర్వ్యూ తాలూకు రికార్డింగ్, డబ్బింగ్ రెండూ మా నాన్నగారు చేసారు.
ఈ సినిమాలోని పాత్ర గురించి సావిత్రిగారు చెప్పిన మాటల తరువాత ఉన్న "వద్దురా కన్నయ్యా..." పాటను కూడా ఈ లింక్ లో చూడవచ్చు. కాపీ రాగంలో స్వరపరచబడిన ఈ పాటను జిక్కీ గారు ఎంత అలవోకగా పాడేసారో అనిపిస్తుంది.
Tuesday, August 10, 2010
Runa laila's "रंजिश ही सही... "
ఈ గజల్ మొదట పాపులర్ అయ్యింది ప్రముఖ గజల్ రారాజు "మెహదీ హసన్" గళంలో. అది ఇక్కడ వినచ్చు.
నాకయితే ఈ గజల్ ను గాయని "రూనా లైలా" గళంలో వినటం బాగా ఇష్టం. "దమాదమ్ మస్త్ కలందర్.." అంటూ దేశాన్ని ఓ ఊపు ఊపిన రూనా లైలా ప్రత్యేకమైన గాత్ర శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ వాయిద్యాలు లేకుండా రూనా లైలా పాడిన ఈ గజల్ ను ఇక్కడ వినవచ్చు.
ఆర్కెస్ట్రా తో రూనా లైలా పాడిన "రంజిషీ సహీ..."
సాహిత్యం: Ahmed Faraz
रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिए आ ।
पहले से मरासिम न सही फिर भी कभी तो
रस्म-ओ-रह-ए-दुनिया ही निभाने के लिए आ ।
किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से ख़फ़ा है तो ज़माने के लिए आ ।
कुछ तो मेरे पिन्दार-ए-मुहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिए आ ।
एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ ।
अब तक दिल-ए-ख़ुश’फ़हम को तुझ से हैं उम्मीदें
ये आख़िरी शम्में भी बुझाने के लिए आ ।
భరణిగారి "ఆటగదరా శివా !!"
భరణిగారు రాసిన "నాలోన శివుడు కలడు" పాటల గురించి రాసినప్పుడు, ఆయన "ఆటగదరా శివా !!" (1999) అన్న శివతత్వాలు కూడా రాసారని తెలిసింది. అనుకోకుండా అది నాన్నగారి పుస్తకాల్లో ఈమధ్య దొరికింది. ఎంతో సరళమైన భాషలో, అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఉన్న ఆ శివతత్వాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఆట్ట మీది "బాపూగారి బొమ్మ", అట్ట వెనుక "వేటూరిగారి మాట(స్వదస్తూరీలో)" రెండూ ఎంతో ఆకట్టుకుంటాయి.
పుస్తకంలో నాకు బాగా నచ్చిన తత్వాలు కొన్ని ...
ఆటగదరా నీకు
మూడు కన్నులవాడ
ఆటగద
మాపైన సీతకన్ను.
***
ఆటగద బతుకంత
కాలకూటముగ్రక్కు
శుధ్ధి జేతువు గదా
తులసినీళ్ళు.
***
ఆటగదరా నీకు
అన్నపూర్ణప్రియా
ఆకలికి భిక్షాట
నాట నీకు.
***
ఆటగద అందాని
కజ్ఞాన మిచ్చేవు
జ్ఞాని కొసగేవు
వికృతరూపము.
***
ఆటగద మనవాడు
ఆటగద పైవాడు
అందరిని కలిపేది
వల్లకాడు.
***
ఆటగద సొంతాలు
ఆటగద పంతాలు
ఆటగద అంతాలు
ఆట నీకు.
***