ప్రొమోస్ చూసి ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అని కొన్ని సినిమాల కోసం తెగ ఎదురు చూసేవాళ్ళం...నేను ముందు చూసానంటే నేను ముందు చూశాను అని చెప్పుకోవటమే గొప్పనుకునేవాళ్ళం....ఆ రోజులు పోయాయి...
కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి నేనొక సినిమా కోసం ఎదురుచూస్తున్నాను...
అది "Cheeni kum" డైరెక్ట్ చేసిన ఆర్.బాలకృష్ణన్ తీసిన మరొక హృద్యమైన చిత్రం "Paa" కోసం. 'హృద్యమైన' అని చూడకుండానే ఎలా చెప్తున్నానంటే...."చీనీ కమ్" చూసాకా వచ్చిన భరోసాతో."చీనీ కమ్" నాకు చాలా నచ్చేసింది. కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుందని నా సిక్స్త్ సెన్సె చెబుతోంది. అది తప్పో రైటో మళ్ళీ వారం తేలుతుంది.Dec 4th న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆ మధ్యన ఎప్పుడో ఓ సారి చూశాను టి.వి లో.
ఇక "Paa" కధ లోకి వచ్చేస్తే.. దీనిలోని ప్రత్యేకతలేమిటంటే తండ్రి అభిషేక్ బచ్చన్, అతని 13ఏళ్ళ కొడుకుగా అమితాబ్ నటించారు. "ప్రోజీరియా" అనే అతి అరుదైన genetic disorder వల్ల 13ఏళ్ళకే మరో ఐదింతల వయసున్నవాడిలా తయారయ్యే పిల్లవాడి పాత్ర అమితాబ్ ది. ఇంకో విశేషం ఏంటంటే "Mrs. Doubtfire" సినిమాలో రోబిన్ విలియమ్స్ కు మేకప్ చేసిన Stephen Dupuis ఈ సినిమలో అమితాబ్ కు మేకప్ చేసారట.ఆ తండ్రీ కొడుకుల బంధం చుట్టూ కధ తిరగాడుతుందని వినికిడి. పిల్లవాడి తల్లి "విద్యా బాలన్"
గైనకాలజిస్ట్ ట.
ఇవాళ అనుకోకుండా ఈ సినిమాలోని ఒక పాట చూసాను ఏడ్స్ లో.
"गुम सुम गुम...गुम सुम हो क्यो
गुम सुम गुम..गुम सुम हो तुम..."
ఇదేమిటి ఇదేదో తెలిసిన ట్యూన్ లా ఉందే...అని ఆలొచిస్తే గుర్తుకొచ్చేసింది...నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి...
"ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది..."
ఈ పాటలో నాకు బాగా నచ్చేది "లాల్లా లలలల లలలల లలలల... లాల్లా లలలల లలలల లా...." అనే హమ్మింగ్...జానకిగారి గొంతులో "రోలర్ కోస్టర్" తిరిగినట్లు సులువుగా మలుపులు తిరుగుతూ సాగే ఈ రాగం నా మనసుకు ఎంతో హత్తుకుపోతుంది....
ఇళయరాజా తనదైన బాణిలో కట్టిన ట్యూన్ ఇది...ఇన్నాళ్ళకు మళ్ళీ హిందీ పాట కోసం వాడుకున్నారు. కాకపోతే హిందీలో ఇది ఒక కోరల్ సాంగ్ . అందుకని ట్యూన్ బాగున్నా సోలో సాంగ్ కాకపోవటం వల్ల తెలుగు పాటే బాగుంది అద్భుతంగా అనిపించింది.
తన పాటలను తానే మళ్ళీ వాడుకోవటం ఇళయరాజాకు అలవాటే. "అన్వేషణ"లో "ఇలలో కలిసే.." పాట బాణీ ని మళ్ళీ "అభినందన" లో "ఎదుటా నీవే.." కోసం వాడుకున్నారు. అసలు ముందు "అభినందన " కోసమే చేసారుట. అన్వేషణ ముందుగా రిలీజ్ అవటంతో అదే ముందు చేసారనుకుంటాం. ఎక్కడో ఇంటర్వ్యూలో చదివిన గుర్తు.
"చీనీ కమ్" లో కూడా ఒక పాట ఉంది --
"सूनी सूनी खॊयी खॊयी आंखॆ मॆरी डूडॆ तुझॆ ही
कब सॆ... हा कब सॆ
अब आवॊगी तब आवॊगी कब आवोगी पूछॆ मे यही
खुद सॆ... हा खुद सॆ
मै हू यहा..तू है कहा..आहे मॆरी सुन..."
ఈ పాట సినిమాలో వినగానే తెలుగు పాట గుర్తుకొచ్చేసింది.
"మౌనరాగం" సినిమాలో "మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏలా అదేలా?.."
డబ్బింగ్ పాట కావటం వల్ల సాహిత్యం కొంచెం నవ్వు తెప్పించినా ఈ ట్యూన్ చాలా బాగుంటుంది. కానీ మంచి సాహిత్యం అందటం వల్ల హిందీలో ఈ పాట ఇంకా బాగుంటుంది.
"paa" మిగతా పాటలు కూడా బాగున్నాయి. అన్ని కూర్చుని డౌన్లోడ్ చేసేసా...:)
"हिच्की हिच्की...",
అమితాబ్ తో పాడించిన "मॆरॆ पा..",
"मुडी मुडी कहा कहा मै इत्तॆफाक सॆ...",
"उडी उडी हवा उडी.." బాగున్నాయి.
ఇక "हलकॆ सॆ बॊलॆ..कलकॆ नजारॆ.." వింటుంటే "శ్రీ కనకమహాలక్ష్మీ డాన్స్ ట్రూప్" లో బాగా వాడిన మ్యూజిక్ అని గుర్తుకొచ్చింది. అచ్చం అదే...సినిమా బాగా తెలిసినవాళ్ళకు తెలుస్తుంది. ఆ డైలాగుల కోసం అస్తమానం పెట్టుకుని చూసేవాళ్లం మేము...అందుకని బాగా తెలిసింది నాకు.
ఇదేమిటి నేనేమన్నా "పా" సినిమా పబ్లిసిటీ బోర్డ్ మెంబర్నా...?! తీరా సినిమా బాలేకపోతే మళ్లీ నన్ననేరు...
ఇక ఆపుతా...
ఇంతకీ నేను ఎప్పటికి చూస్తానో..??!!
నెలలోపు చూస్తే గొప్పే. లేకపోతే ఆరునెల్లలో టి.విలో ఎలాగూ వస్తుంది..... :))
15 comments:
ఇదే పాయింట్‌తో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా చాలా ఏళ్ల కిందట రాబిన్ విలియమ్స్‌తో Jack అనే సినిమా తీశాడు. అది పెద్ద హిట్టేమీ కాదు. మరి మన హిందీ సినిమా దాన్నుండి ఈ స్థాయిలో ప్రేరణ పొందిందో విడుదలయ్యాగ్గానీ చెప్పలేం. 'చీనీ కమ్' బాగా తీసిన దర్శకుడు Jack లో ప్రధానాంశాన్ని తనదైన శైలిలో ఆసక్తికరమైన కథగా మలుస్తాడనే నమ్మకమైతే నాకుంది.
Thanks. I am also looking fwd for the movie. Kudos to your music sense and memory power.
నాకు చీనీ కమ్ బానే ఉందనిపించింది. పెద్ద గొప్ప సినిమా కాదు కాని అద్భుతమయిన సినిమాటోగ్రఫీ (పి సి శ్రీరాం), సంగీతం భలే నచ్చాయి . పా కి ప్రేరణ జాక్ అని చూడగానే అనిపించింది. జాక్ కూడా ఏవరేజ్ సినిమా. పా పాటలు మాత్రం చూడడానికి వినడానికి భలే ఉన్నాయి. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. దర్శకుడు బాల్కి యాడ్ ఫిలిం మేకర్ ట. ఆ విషయం అతని సినిమా విజువల్స్‌లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
చీనీకమ్ నాకు బాగా నచ్చిన హింది సినిమాలలో ఒకటి. దాని పాటలు కూడా నా ప్లేయర్ లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాయ్. పా కూడా అలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇళయరాజా గారు పాత ట్యూన్ మళ్ళీ ఉపయోగించినా సన్నివేశానికి చక్కగా ఇమిడిపోతేనే ఉపయోగిస్తారు అందుకే కొత్తది కూడా అంతే నచ్చుతుంది సినిమా చూశాక.
"...అది తప్పో రైటో మళ్ళీ వారం తేలుతుంది.Jan 4th న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా..." confusing..
ఇళయరాజా తన పాటలు తనే వాడుకున్నా కొంత వైవిధ్యం చూపిస్తాడు.. నిజానికి 'శ్రీ కనకమాలక్ష్మి..' నేపధ్య సంగీతం లో 'స్వాతి ముత్యం' సంగీతాన్ని పోలి ఉంటుంది కొన్ని చోట్ల, గమనించారా? రెహ్మాన్ తన పాటల్లో హిట్టైన వాటి ట్యూన్స్ ని తరువాతి సినిమాలకి బీజీయెం గా వాడతాడు.. తన త్యూన్లని తనే వాడుకునే మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో కీరవాణినీ చేర్చాలి..
నేను రాజా వీరాభిమానినే. కానీ he lost his magic touch. అయినా ఓకేనే. ఒక కోరిక ఉంది. రాజా బాణీ కట్టీ దానికి రెహమాన్ orchestration తోడయితే..
"हलकॆ सॆ बॊलॆ..कलकॆ नजारॆ.." ఈ పాట 'సీతాకోకచిలుక' తమిళ version లోనిది. తెలుగులో ఉందో లేదో తెలీదు కానీ.. తమిళంలో మాత్రం జానకిగారు పాడిన పాట: 'పుత్తం పుదు కాలై'. అత్భుతమైన పాట. ఆ సినిమా పేరు 'అలైగళ్ ఓయ్వదిల్లై' అనుకుంట. నాకు తమిళం సరిగ్గా రదు కానీ.. ఇలాంటి పాటలు వింటూ ఉంట.
ఆసక్తికరమైన సినిమా గురించి ప్రస్తావించారండి..నేను కూడా మీ పక్కనే ఉన్నానండి, ఈ సినిమా కోసం వేచి చూస్తూ :-)
కంటిన్యస్ ప్లే లో రోజులతరబడి విన్న పాటల్లో చీనీ కం లోని 'జానే దో నా' ఒకటి.. :-)
I am also waiting for this movie..
www.tholiadugu.blogspot.com
నేకూడా నేకూడా
ఏమి నేకూడా
సినిమా నేకూడా
ఏమి సినిమా
పా సినిమా
ఏమి పా
బచ్చన్ పా
ఏమి బచ్చన్
అమితా బచ్చన్
ఏమి అమితా
ఆశ అమితా
ఏమి ఆశ
సినిమాహిట్ ఆశ
ఏమి సినిమా
అబ్బ నేను చెప్పను బాబు చూసి తీరాల్సిందే...
ఈ సినిమా జయాపజయాలతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని నేననుకుంటున్నాను. ఈ సినిమాతో ప్రొజేరియా డిసీజ్ గురించి ప్రజల్లో మంచి అవగాహన కలిగే అవకాశముంది. మీరన్నట్టు పాటలు బాగున్నాయి.
అమితాబ్ బచ్చన్ గారు తన వయ్సుని కూడా లెక్క చెయకుండా .. తీసిన సినిమా ఇది....మెకప్ వెసులోవడానికి కి ..పాత్రని పందిచ డానికి కూడా ఎంతో ఓర్పు అవసరమౌతుంది ...
ప్రేక్షకుల ఆదరణ ఎలా వుంటుదో మనం చెప్పలేము.....ప్రేక్షకుల నాడి అంత తొందరగా దొరకదు....సినిమా వాల్లేమో సగటు ప్రేక్షకుడిని మరచి పోయి, దశాబ్ధాలవుతుంది.. సంచలనంగా మిగులుతుందో ...సక్సెస్స్ గా మిగులు తుందో వేచి చూడాలి...
ఈ ఆర్టికల్ వ్రాయడాని మీరు మంచి విషయ సేకరణ చేసినట్లు తెలుస్తుంది..
సత్యగారూ,
"ఈ ఆర్టికల్ వ్రాయడాని మీరు మంచి విషయ సేకరణ చేసినట్లు తెలుస్తుంది.."
ఈ ఆర్టికల్ రాయటానికి నేను ఎటువంటి సేకరణ చేయలేదండీ. నాకు చాలా ఇష్టమైన ఆసక్తుల్లో "సినిమాలు" ఒకటి. ముఖ్యంగా తెలుగు,ఇంగ్లీషు,హిందీ మూడు భాషల్లో సినిమాల గురించిన అన్ని వివరాలూ నేను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటానండీ. ఈ సినిమా పాటలు వినగానే రాయాలనిపించి ఒక పదిహేను నిమిషాల్లో రాసిన టపా ఇది...అంతే.
ఈ టపాకు వ్యాఖ్యలు రాసిన మిత్రులకు,
సినిమా చూసాకా కలిగిన స్పందనతో జవాబులు రాదామని ఇంతదాకా రాయలేదండీ...సినిమా చూసాకే అందరి వ్యాఖ్యలకూ జవాబులు రాయాలని...
అవును, "పా" కోసం నేనూ ఎంతగానో ఎదురు చూస్తున్నా! వీలైతే మొదటి రోజే చూడాలని!
Post a Comment