ఇవాళ "వైకుంఠ ఏకాదశి". దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. విష్ణు ద్వారాలు తెరుచుకుంటాయి అంటారు. ఉత్తరాయణానికి ముందుగా వచ్చే ఏకాదశి ఇది.ఈ రోజున విష్ణు పూజ,ఉపవాసం విశేష ఫలాన్ని ఇస్తాయని పెద్దలు చెబుతారు.ఏకాదశి ముందు రోజు ఒంటి పూట భోజనం చేసి , ఏకాదశినాడు ఉపవసిస్తూ ఉంటారు కొందరు.తిరిగి ద్వాదశినాడు విష్ణువుకు నైవేద్యం పెట్టి సహస్రనామ పారాయణా చేస్తారు. ఇది ఎంతో మహిమాన్వితమైన ఏకాదశి అని పురాణాలలో చెప్పబడింది.ఉపవాసం చేయను కానీ విష్ణు సహస్రనామాలు చదువుకుని నైవేద్యం పెడుతూంటాను నేను.
వారాంతంలో "షిరిడీ యాత్ర" చేసి వచ్చాము.ఆ చలికి విపరీతమైన జలుబు, కాస్త జ్వరం వచ్చేసాయి.అందుమూలంగా "షిరిడీ యాత్ర" కబుర్లను ఓపిక వచ్చాకా ఒకటి రెండు రోజుల్లో వీలుని బట్టి రాసి మిత్రులందరితో పంచుకోవాలని ఆశ...
11 comments:
"ముక్కోటి ఏకాదశి" మీదైన తీరుగ గడుపుకుని, ప్రయాణపు స్వల్ప అస్వస్థత నుండి వీలైనంత త్వరగా కోలుకుని, ఓపిక తెచ్చుకుంటారని ఆశిస్తూ..
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
షిర్డీ యాత్ర విసేషాలకోసం ఎదురు చూస్తుంటాము....
ధన్యవాదాలు..
tvaragaa koelukoenDi.
వైకుంఠఏకాదశి శుభాకాంక్షలు
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ.
Get Well Soon.
Get well soon.
Expecting the travelogue of Shirdi.
Jai Sai Ram.
త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. షిరిడీ కబుర్ల కోసం ఎదురుచూస్తూ...
@మరువం ఉష: ధన్యవాదాలండీ..
@శివ చెరువు: షిర్డీ విశేషాలు ఇప్పుడే ప్రచురించాను.చూడండి.
ధన్యవాదాలు.
@సునీత:
@దుర్గేశ్వర:
@గీతాచార్య:
@భావన:
@భాస్కర రామి రెడ్డి:
మీ అందరి అభిమానానికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
@గణేష్: రాసాను చూడండి మరి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: మీ అందరి అభిమానంతో త్వరగానే కోలుకున్నానండి...షిర్డి కబుర్లు రాసాను చూడండి మరి...ధన్యవాదాలు.
Post a Comment