కొత్త పిచ్చోడు పొద్దెరగనట్టు,
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ...రోజంతా నా బ్లాగుని చూసుకుని నేనే మురిసిపోతున్నాను .
ఎవరైనా చూస్తున్నారో లేదో తెలీదు కానీ నేను మాత్రం పోస్టింగులు తెగ చేసేస్తున్నాను బ్లా బ్లా బ్లా అని .
ఆయినా నేను బ్లాగు పెట్టుకున్నది ఎవరి కోసం?
నేను కూడా ప్రపంచంతో పాటూ నడుస్తున్నాను అన్న సంతృప్తి కోసమే కదా ..!
ఇంక ఎవరైనా చూస్తే ఏమిటి ?చూడకపోతే ఏమిటి?
కోయిల ఎవరో వింటారని కూస్తుందా?పువ్వు ఎవరో చూస్తారని పూస్తుందా ?
నేనూ అంతే ...నా కోసం నేనే బ్లాగుకుంటున్నాను !!!
1 comment:
నా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది..ఎప్పుడో పోస్ట్ ఇప్పుడు comment పెట్టానని భయపడకండి తృష్ణ గారూ..
నాకు మీ బ్లాగ్ అంటే చాలా ఇష్టం..అందుకే ఇలా archives లో చదువుతూ ఉంటా..:)
Post a Comment