సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 7, 2011

మూర్తిబాబయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు


ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మూర్తిబాబయ్యకు నా బ్లాగ్ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని, "మాయదారి కుటుంబం", "గమ్యం" మొదలైన చిత్రాలకి సంగీతాన్ని అందించిన ".ఎస్. మూర్తి"గారిని మేము ఆప్యాయంగా "మూర్తిబాబయ్య" అని పిలుచుకుంటాం.

కవి శ్రీ బాల గంగాధరతిలక్ గారి మేనల్లుడు తను. నాన్నకు చిరకాల మిత్రుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణి విభాగం మొదలుపెట్టిన కొత్తలో నాన్న, మూర్తిబాబయ్య మరికొందరు మిత్రులు కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో కార్యక్రమలు నిర్వహించారు. కార్యక్రమాలకు పాటలు రాసి, బాణీ కట్టి, గిటార్ వాయిస్తూ వాటిని తనే పాడేవాడు మూర్తిబాబయ్య.

గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్ అయిన తను కథలు. కవితలు కూడా రాసేవాడు. గాయకుడు బాలు దగ్గర కొన్నేళ్ళు పనిచేసిన తరువాత సంగీతదర్శకుడు "ఎస్..రాజ్ కుమార్" వద్ద చాలా ఏళ్ళు కంపోజింగ్ గిటారిస్ట్ గా ఉన్నాడు మూర్తి బాబయ్య. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మల్టీ టాలెంటెడ్ అనిపించే మూర్తిబాబయ్య పలు కారణాలవల్ల తెర వెనుకనే ఉండిపోయాడు. సరైన అవకాశాలు వచ్చి ఉంటే తప్పకుండా ఎంతో పేరు వచ్చిఉండేదని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తను సుమారు అరవై దాకా రాసిన సినిమా పాటల్లో ఎన్నో పాపులర్ అయ్యాయి. వాటిలో నిన్నే ప్రేమిస్తా" సినిమాలో "ప్రేమా ఎందుకనీ", "సూర్యవంశం" సినిమాలో "కిలకిల నవ్వుల" పాటల సాహిత్యాలు బాగా ఇష్టం నాకు. తను రాసిన పాటల్లో కొన్నింటిని లింక్ లో మీరు వినవచ్చు: http://www.raaga.com/channels/telugu/lyricist/ES._Murthy.html


చాలా ఏళ్ళ క్రితం అంటే పాప్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బంస్ జనాలలో పాపులర్ కాని రోజుల్లో తను చేసిన "చిలిపి ఊహలు" అనే ప్రైవేట్ ఆల్బం నాకు బాగా ఇష్టమైనది. అందులోని ఎనిమిది పాటలు తనే రాసాడు. కేసెట్ కు సంగీతాన్ని బి.ఆర్.సురేష్ గారు అందించారు. పాటలు వీలైతే నా "సంగీతప్రియ" బ్లాగ్ ద్వారా వినిపించాలని నా కోరిక. ప్రైవేట్ ఆల్బంస్ కు ఎంతో ఆదరణ ఉన్న రోజుల్లో "సీడీ" రూపంలో ఆల్బం ను మళ్ళీ రిలీజ్ చెయ్యమని నేను కోరుతూ ఉంటాను.

మూర్తిబాబయ్యవాళ్ల అమ్మాయి "నిషి"(నిశాంతి) కూడా మధ్యనే తన మొదటి చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. "LBW"(Life before Wedding) అనే చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర ధరించింది. బొంబాయిలో 'ఫిల్మ్ డైరెక్షన్లో' కోర్సు పూర్తి చేసిన నిషికి సినిమా డైరెక్షన్ పట్ల ఎక్కువ మక్కువ. నాగేష్ కుకునూర్, ప్రకాష్ కోవెలమూడి వద్దా, మరికొందరి వద్దా అసిస్టెంట్ గా కూడా పని చేసింది. తను ఎన్నుకున్న ఫీల్డ్ లో నిషీ ఎన్నో విజయాల్ని చూడాలని ఆకాంక్షిస్తున్నాను.

మధ్యనే cinegoer.com అనే వెబ్సైట్ వారు మూర్తిబాబయ్యను ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూలో తన కెరీర్, రాసిన పాటల వివరాలు మొదలైనవాటి గురించి చెప్పాడు మూర్తిబాబయ్య. ఇంటర్వ్యూ తాలూకు యూట్యూబ్ లింక్స్ క్రింద ఉన్నాయి. ఆసక్తి గలవారు చూడవచ్చు.
Part-1)
http://www.youtube.com/watch?v=fjPuiMWpV8s&feature=player_embedded

Part-2)
http://www.youtube.com/watch?v=h3JCNaXs-Jc&feature=fvwrel

Part-3)
http://www.youtube.com/watch?v=BUPyF_5tYP4&feature=relmfu

7 comments:

కొత్త పాళీ said...

గమ్యంలో పాటలు బాగున్నాయి. సమయమా చలించకే నాకు బాగా నచ్చింది. శ్రీ మూర్తిగారికి శుభాకాంక్షలు

SHANKAR.S said...

మొదటి సారి మీ మూర్తి బాబయ్య గారి పేరు మీ "తిలక్ గళం లో ఆయన "వెన్నెల" పోస్ట్ లో చూశాను. కాబట్టి నాకూ ఈయన పరిచయమే :)
నా తరపున కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందించేయండి.

R Satyakiran said...

ఈ ఎస్ మూర్తి గారి పాటలు మాకు అందరికి కూడా చాలా ఇష్టం. ఆయనకి మా జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి.
చిలిపి ఊహలు పాటలు కాలానికన్నా ముందు వచ్చేసాయి. నిజంగా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇంకా బాగా హిట్ అవుతాయి.

LBW సినిమా చాలా నచ్చేసి రెండు సార్లు చూసాము మేము. ఇంకా అందరికీ చెప్పి చూపించాము కూడా. నిశాంతి ఇంకా అందరూ కూడా చాలా Natural గా నటించారు

గోదారి సుధీర said...

ee parichayam baagundi trushna gaaru thank you

వేణూశ్రీకాంత్ said...

మూర్తిగారికి జన్మదిన శుభాకాంక్షలు. గమ్యం నాకు బాగా నచ్చిన ఆల్బం. అప్పటినుండి ప్రతి కొత్త సినిమా ఆడియోలోనూ తనపేరుందేమో అని వెదకడం పనిగా పెట్టుకున్నాను.

తృష్ణ said...

@కొత్తపాళీ:
@శంకర్.ఎస్:
@ఆర్.సత్యకిరణ్:
@గోదారి సుధీర:
@వేణూ శ్రీకాంత్:
మూర్తిగారికి అభినందనలు అందించిన బ్లాగ్మిత్రులందరికీ బాబయ్య తరఫున ధన్యవాదాలు. ఈ సర్ప్రైజ్ పోస్ట్ చూసి చాలా సంతోషించాడు తను కూడా.

Ennela said...

నా తరపున కూడా మూర్తిగారికి జన్మదిన శుభాకాంక్షలు అందించేయండి.