సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, April 17, 2011

మరో కొత్త సినిమా బోధించిన పాఠలు !


కొత్త సినిమా బోధించిన పాఠలు :
* ప్రేమంటే ఏమిటి ? నిజమైన ప్రేమను గుర్తించాకా ఏంచెయ్యాలి?
* నిజమైన ప్రేమను గుర్తించాలి అంటే, ప్రేమంటే కనబడ్డ అమ్మయికల్లా లైను వేసి, ఆపైన పడేసిన అమ్మాయిల్లో ఎవరు బాఘా మనసుకి దగ్గరగా వస్తారో అని ఏళ్ల తరబడి గమనించుకుంటూ ఉండాలి.
* ఆ ప్రయత్నంలో ఎంత మంది అమ్మాయిలతో అయినా, ఎలాంటి అమ్మాయిలతో అయినా తిరగొచ్చు, ఏదైనా చేయచ్చు. మన పవిత్ర భారతదేశంలో అందరూ పవిత్రంగా భావించుకునే "పెళ్ళి" అయే టైముకి సదరు అబ్బాయిగానీ అమ్మాయి గానీ పవిత్రంగా ఉండాల్సిన పనే లేదు.
* ఆ పైన మనసుకి దగ్గరగా ఉన్న అమ్మాయిని గుర్తించాకా ఆ అమ్మాయికి పెళ్లయిపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళాలి.
* ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాకా అవసరం లేనకపోయినా ఒక పెద్ద హడావుడి ఫైటింగ్ ఒకటి చేయాలి.
* ఆ తరువాత అమ్మయి ఎక్కడుందో కనుక్కుని ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి, పెళ్లవకముందు చెప్పాల్సిన డైలాగుని ఆలస్యంగా చెప్తున్నందుకు చింతిస్తూ డైలాగులు చెప్పేయాలి.
* సదరు అమ్మాయి కూడా పెళ్ళికొడుకుతో డిన్నర్లకూ వాటికీ వెళ్ళి, పెళ్ళికి ఒప్పుకుని పవిత్రంగా తాళి కట్టించుకున్నాకా, వెర్రిమొహం వేసుకుని చూస్తున్న భర్తగారికి టాటా చెప్పి వెళ్పోవచ్చు.
* ఇప్పటిదాకా నిశ్చితార్ధాలు, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోయాయి సినిమాల్లో. ఇకపై అయిపోయిన పెళ్ళీళ్ళు కూడా రద్దు చేసుకోవచ్చు అని బాగా తెలియచెప్పారు.
* మనిషిలో కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎంతవరకూ ఉండొచ్చు అన్న విషయాన్ని చాలా బాగా తెలియచెప్పారు.

అర్ధం కానిది:

* ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాడు అన్న గాఠ్ఠి నమ్మకం గల సదరు అమ్మాయికి పెళ్ళికి ముందుగానే కాస్త జ్ఞానోదయం అయినా సరే పెళ్ళికి నిరాకరించకుండా ఎందుకు ఉండదో అర్ధం కాలేదు.
* ప్రేమించిన అమ్మాయిని చూడ్డం కోసం వీర ప్రేమికుడు ఒక చావు ఇంట్లో కూడా ప్రవేశించి అవతలవాళ్ళు ఏడుస్తూ ఉంటే అమ్మాయితో మాట్టాడ్డానికి ప్రయత్నించటం...
* ఒక ఫ్లాష్ బ్యాక్ కథలో పరికిణీ ఓణీలు వేసుకున్న ట్రెడిషనల్ అమ్మాయి "పోయింటెడ్ హీల్స్" ఎలా వేసుకుంటుంది ? కెమేరాలో అవి కనపడవనుకునేంత అమాయకులా సినిమావాళ్ళు?
* పాతతరం పేమ ఎలా ఉండేది? కొత్త తరంలో ప్రేమ ఎలా ఉంటోంది అని చూపించే వినూత్నప్రయత్నమే ఈ సినిమా తీసినవాళ్ల ముఖ్య ఉద్దేశం. ఈచిత్రానికి మూలమైన హిందీ సినిమా టైటిల్ కూడా అదే కదా. కానీ అదేమిటో నా మట్టిబుర్రకి ఈ సింపుల్ పాయింట్ అర్ధం కావట్లేదు.
* అంతా బానే ఉంది కానీ ఈ పెళ్ళి అయిన తరువాత పారిపోవటం అనే కాన్సెప్ట్ ఎంతకీ మింగుడు పడట్లేదు...may be iam very old fashioned to catch this great concept !!

నచ్చినవేవైనా ఉన్నాయా?

* నేపథ్య సంగీతం చాలా చాలా నచ్చింది నాకు. సన్నివేశానిసారంగా, భావానికి దగ్గరగా, మనసుకు హత్తుకునేట్లుంది.
* చివరిదాకా వాళ్లకు తెలీకపోయినా వాళ్ల మధ్యన కనబడిన ప్రేమ నచ్చింది.
* కొన్ని డైలాగులు బాగున్నాయి.

******    *****     ******

నా దృష్టిలో మంచి సినిమా ఎలా ఉండాలి?

* కొత్తదైనా పాతదైనా అప్పుడే అయిపోయిందా అనిపించాలి.
* హాస్యమైన, దు:ఖమైనా పాత్రల భావానుసారంగా మనమూ వాళ్ల అనుభూతిని పొందాలి.
* మధ్యలో కాస్తైనా బోర్ కొడుతోంది అనిపించకూడదు.
* తెర ఎత్తిన మొదలు దించేదాకా మరే ఇతర ఆలోచన రాకుండా ఉండాలి. మనల్ని మనం మర్చిపోవాలి.

అలాంటి మంచి సినిమా కోసం ఓ దేవుడా నేను ఎదురు చూస్తున్నాను.................

12 comments:

ప్రవీణ said...

నువ్వు నేను (పేరు సరిగ్గా గుర్తులేదు) అనే ఒక హిట్ సినిమా గుర్తుందా? నేను మా విజయవాడలో ఆ సినిమా చూసి ఇంటికి రాగానే వైజాగ్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నేను వీరవేషంగా ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యింది, పరమ చెత్తగా వుంది అనే తెగ తిట్టాను. నా ఫ్రెండ్ నా ఆవేశం అంతా బరించి చివరగా నాకో మాట చెప్పింది. "ప్రవీణ, నీకు ఆ సినిమా నచ్చలేదు అంటే, నువ్వు ముసలి దానివి అయ్యిపోయవు. నీకు ఆ సినిమాలు చూసే వయస్సు దాటిపోయింది". నాకు జ్ఞానోదైమయింది. నాలుగు fights, మరో నాలుగు పాటలు, చెత్త డైలాగులు..ఇదే ఈ రోజుల్లో సినిమాలంటే. చూసే ప్రతీ సీన్లోను involve అయ్యి చూడగలిగే సినిమా సంవత్సరానికి ఒక్కటి కూడా రావట్లేదు.

ఆత్రేయ said...

నలుపూ తెలుపుల్లో ఉన్నా మూడు గంటల పైన నిడివి ఉన్నా
అస్సలు పాటలూ, ఒంటి చేతి ఫైట్లు లేని సినిమా
ఒకటుంది
అది చూసి నేను లీనమై నవ్వి, ముచ్చటపడి, బాధ పడి, కంట నీరు తుడుచుకుని, తేరుకొని అప్పుడే అయి పోయిందా అనిపించినా సినిమా...
SCHILDLERS LIST

Unknown said...

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగు ''అందం గా లేదని అమ్మని
కోపంగా ఉంటాడని నాన్నని ఎప్పటికైనా వదిలేస్తామా ?
ప్రేమించిన వాడు అంతే'' అని త్రిష అనడం .

Sudha Rani Pantula said...

ఇంతకీ ఈ కొత్త సినిమా పేరేమిటో చెప్పనే లేదు...
నిశ్చితార్థం సరే కాని, తాళి కట్టబోతున్న పెళ్ళి కొడుకు చేతిని తోసేసి, అక్కడున్న పసుపు, కుంకుమలను ఒక్క తాపు తన్ని సదరు హీరో గారి మీద విరుచుకు పడిపోయే పెళ్ళి కూతుళ్ళనుచూసాం.

అయిపోయిన పెళ్ళిని తెగతెంపులు చేసుకొని ప్రేమికుడితో వెళ్ళిపోయే పెళ్ళికూతుళ్ళు.....ఏ సినిమా అండీ....
భారతదేశంలో తెలుగు సినిమాలో మెడలో తాళిబొట్టు పడ్డాక మళ్ళీ మరొకరితో వెళ్ళడమే...భేష్...తెలుగుసినిమాలో కూడా విప్లవాత్మకమైన ఆలోచనలు చూపిస్తున్నారన్నమాట.

శ్రీరామ్ said...

Perfect Review !

Unknown said...

wait cheyyaalsina avasaram ledu go and watch jalsa or athadu

మైత్రేయి said...

తృష్ణ గారు,
తెలుగు వర్షెన్ నేను చూడలేదు కానీ హిందీ మాతృక చూసాను. ఈ సినిమాలో చూపించిని 'ఆజ్' బొత్తిగా కల్పితమైతే కాదు. రెండవ, మూడవ జెనరేషన్ ఇండియన్ ఆరిజన్ పిల్లలు విదేశాల్లో, మెట్రోల్లో హైసొసైటీల్లో, పెళ్ళికి ముందు పరస్పర అంగీకారంతో సహజీవనం మామూలు విషయం. వారు పెరిగిన చూసిన సమాజంలో అది తప్పుకాదు. వారికి అది నియమ ఉల్లంఘన కాదు. అలా అని వారికి విలువలు లేవు అనటం కరెక్ట్ కాదు. వారివి భారతీయ విలువలు కాదు. వారివి పాశ్చాత్య విలువలు.

ఒకటి మీరు గమనించినట్లయితే, వారు మోసం చేసుకోరు. అబద్దం చెప్పుకోరు. హిపోక్రసీలో ఉండరు. వారి మనసును దాచరు. ఆత్మాభిమానం కల వాళ్ళు. తెలుగులో ఉందోలేదో కానీ మీరాని వదిలిన తర్వాత తిరిగే ఇంగ్లీషు అమ్మాయి హీరోని నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది, అతను తన అవసరం కోసం అవును అని అబద్దం చెప్పడు.

వాళ్ళు మనసనేది ట్రాష్, భౌతిక అవసరాలే ముఖ్యం ప్రాక్టికల్ గా ఉందాం అనుకొన్న ఈ తరం వారైనా అనుబంధాలు, సెంటిమెంట్లు మనిషి ఉన్నన్నాళ్ళూ తప్పవనేదే కధ సారాంశం అని నా ఉద్దేశ్యం.

నచ్చటం నచ్చక పోవటం పర్సనల్ కానీ నా కనిపించింది చెప్పాలనిపించింది.

తృష్ణ said...

ఆత్రేయ గారూ, హింది సిన్మా నేనూ టీవిలో ఆ మధ్యన చూశాను. మీరన్న పాశ్చాత్య ప్రభావన్ని, యూత్ లో వస్తున్న ఇటువంటి మార్పుని చుట్టూరా చూస్తూనే ఉన్నాం. మెట్రోస్ లో, హై సొసైటీస్ లో "లివిన్ రిలేషన్షిప్స్" గురించి కూడా గత కొన్నేళ్ల నుండీ చూస్తున్నాం. సినిమాలూ తీశారు. కానీ వారిలో కూడా మీరు రాసిన నిజాయితీపరులు చాలా తక్కువమంది ఉంటారు.

ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది కానీ, నేననేది ఒకటేనండీ.. ఒక సినిమా ద్వారా ఏది చెప్పాలని అనుకున్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..cinema is a powerful media and a 'common man' in 'India' is crazy to adapt himself to what is shown to him. 'ఇలా ఉంది జమానా' అని చెప్పినా అని తెలియచెప్పటం, చూపించటం కూడా ప్రేక్షకుడిలో లేని ఉద్దేశాలను, కొత్త ఆలోచనలను రేపటమే అవుతుంది.
..there are a book of thoughts if we get into discussions which iam not in favour of !
No point in doing so...wastage of time...
anyways thank you for sharing your opinion.

తృష్ణ said...

@ప్రవీణ : "మా విజయవాడ"..?? ఇకపై "మన" అనండి. అక్కడ పుట్టకపోయినా నెలల పిల్లగా ఉన్నప్పటినుంచీ పెరిగి తిరిగిన నా ఊరు విజయవాడ. ఆ ఊరంటే నాకెంతో.....ప్రేమ. వెళ్ళినప్పుడల్లా "ఈగాలి..ఈనేల" అని పాడేసుకూంటా...:)

ఇక వ్యాఖ్యలో మీరన్నది నిజమే..ధన్యవాదాలు.

@ఆత్రేయ: క్రింద వ్యాఖ్య లో మైత్రేయి గారి పేరు బదులు కన్ఫ్యూజ్ అయ్యి మీ పేరు రాసాను. ఏమీ అనుకోకండి.
"స్పీల్ బర్గ్" సినిమాల్లో నేను మిస్సయిన ఏకైక సినిమా అదేనండి. మిగతావన్నీ చూసాను.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@రవిగారు: బాగున్న కొన్ని డైలాగుల్లో ఇది కూడా ఒకటండి.
ధన్యవాదాలు.

@సుధ: ఈపాటికి తెలిసిపోయి ఉంటుండి కదండి.
ధన్యవాదాలు.

@శ్రీరామ్: ధన్యవాదాలు.

తృష్ణ said...

@suckerchallanged : ఆ రెండూ చూసినవేనండి. రెండోది కాస్త ఆ కేటగిరీలోకి వేస్కోవచ్చు..:)
ధన్యవాదాలు.

@మైత్రేయి: మీకు రాసిన వ్యాఖ్యలో మీ పేరు తప్పు రాసాను హడావుడిలో. మన్నించండి.
ధన్యవాదాలు.

అనిర్విన్ said...

pointed heels లాగ ఇంకోటి చూడండి. హీరోకి ఉన్న నలుగురు ఫ్రెండ్స్ పాతకాలం బట్టలు వేసుకుంటారు, హీరో మాత్రం levis జీన్స్.