నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో
నిదుర రాని చీకటిపొద్దులో
చక్కిలి జారే ఎన్ని నిట్టుర్పుచుక్కలో
అలుముకున్న గాఢనిద్రలో
ఎన్నియలలో ఎన్ని కలలో
రెప్పపాటులో దూరమయ్యే దీవెనలు
ఎడారిలో ఒయాసిస్సులు
గుండెను భారం చేసే దిగుళ్ళు
దాచినా దాగని వాస్తవాలు
ఆపినా ఆగని కన్నీళ్ళు
గట్టుదాటి పొంగే నదీతీరాలు
రెక్క విప్పుకుని నింగికెగసే చిరునవ్వులు
రూపు మారిన సీతకోకచిలుకలు
కలవరం లేని రేపటికోసం ఎదురుచూపు
నింగికెగసిన ఆశాసౌధం
నిరాశను అశాంతం చిదిమేసే మనోనిబ్బరం
ఇప్పుడే కళ్లుతెరిచిన పసికందు
ఎన్ని మలుపులు తిరిగినా దొరకదు గమ్యం
అందని జాబిలిలా
నిరంతరం భాషిస్తూనే ఉంటుంది అంతరాత్మ
ఘోషించే సాగరంలా
ఎన్ని నిరాశలు ఎదురైనా ఓడదు మనసు
అలుపెరుగని అలలా
నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో
7 comments:
ఓటమి నుంచే గెలుపుకే ఇక మీ పయనం......బావుంది తృష్ణ గారు
"నిదుర రాని చీకటిపొద్దులో
చక్కిలి జారే ఎన్ని నిట్టుర్పుచుక్కలో"
బావుందండీ!!!
"ఎన్ని నిరాశలు ఎదురైనా ఓడదు మనసు
అలుపెరుగని అలలా"
ఈ భావం నాకు చాలా నచ్చిందండీ...
అలుముకున్న గాఢనిద్రలో
ఎన్నియలలో ఎన్ని కలలో
కవిత చాల బాగుందండీ. ముఖ్యం గా పై పదాలలో.. రెండో పంక్తి లో.. రెండు అర్థాలు వచ్చే మంచి పద ప్రయోగం చేసారు.. ఎన్నో అలలు (అలలు "అల"జడి కి రూపం కదా) .. ఎన్నో కలలు అని ఒక అర్థం... వెన్నెలలో ఎన్నో కలలు అన్న అర్థం వచ్చే లాగ బాగుందండీ.
రామకృష్ణ
చాలా బాగుంది
కాముధ
nice trushna gaaru !
@చెప్పాలంటే:
@గోపాళం:
@శ్రీలలిత:
@కాముధ:
@సుధీర:
వ్యాఖ్యనందించినందుకు ధన్యవాదాలు.
@మూర్తి: ఆ పద ప్రయోగాన్ని ఎవరు గుర్తించరేమో అనుకున్నాను...ధాంక్స్ అండి.
Post a Comment