ఎండలో గొడుగు వేసుకుని డాబాపై ఒడియలు పెడుతుంటే
అమ్మతో ఒడియాలు పెట్టిన రోజు గుర్తొస్తుంది
భోజనాలయ్యాకా డైనింగ్ టేబుల్ సర్దుతున్నప్పుడు
"కాస్త కంచాలు తీసిపెటట్టచ్చు కదా, గిన్నెలు వంటింట్లో పెట్టవే"
అన్న అమ్మ కసుర్లు, ఒకోసరి బ్రతిమాలడo గుర్తుకొస్తుంది
కాస్త ఖర్చులటూఇటూ అయిన నెలలో
బజార్లో వెళ్తున్నప్పుడు
పాప అడిగిందేదైనా కొనలేనప్పుడూ
నేనడిగినప్పుడు డబ్బులివ్వలేదని
అమ్మని తిట్టుకున్న రోజులు జ్ఞాపకమొస్తాయి
వండిన కూర నచ్చలేదని పాప అలిగినప్పుడు
అమ్మ వంటకు పెట్టిన వంకలు జ్ఞాపకమొస్తాయి
కష్టపడి వండిన కూర పడేయలేక ఫ్రిజ్ లో పెట్టినప్పుడు
"అలా పెట్టకపోటే పడేయొచ్చు కదా"
అని అమ్మను వేళాకోళం చేసిన మాటలు గుర్తుకొస్తాయి
ఒంట్లో బాలేకపోయినా తప్పక పనిచేయాల్సొచ్చినప్పుడు
నన్ను ఒక్క పనీ చెయ్యనివ్వకుండా
అన్నీ తనే చేసుకున్న అమ్మ జ్ఞాపకమొస్తుంది
ఏదన్నా తేడా వచ్చినప్పుడు
నోరు మెదపలేకపోయినప్పుడు
చిన్నమాటకే అమ్మపై అరవటం జ్ఞాపకమొస్తుంది
కొన్ని చిక్కులు ఎదురైనప్పుడు..
అమ్మతో చెప్పలేకపోయినప్పుడు
శ్రీవారినీ ఇబ్బందిపెట్టలేననిపించినప్పుడు
స్నేహితులవద్ద లోకువవకూడదని పంచుకోలేనప్పుడు..
ఇలాంటప్పుడు అమ్మ ఎలా నెట్టుకువచ్చిందో అనిపిస్తుంది
మల్లెపూలు కడుతూంటే మాల విడిపోయినప్పుడు
ఎడచేత్తోనే చకచకా మాలకట్టేసే అమ్మ గుర్తుకొస్తుంది
అల్లరి చేసిందని పాపను కేకలేస్తూంటే
వాళ్ళనాన్న వెన్కేసుకొచ్చినప్పుడల్లా
నన్ను నాన్న వెన్కేసుకొస్తున్నారని
అమ్మ కోప్పడిన వైనం గుర్తుకొస్తుంది
ఆరేళ్ల కూతురిని చూసి
'అమ్మో ఎదిగిపోతోంది' అని నే బెంగపడినప్పుడు
పెళ్ళిడుకొచ్చిన నన్ను చూసినప్పుడల్లా
అమ్మ ఎంత బెంగపడేదో కదా అనిపిస్తుంది
ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో
ఇంకెన్నో వందల సార్లు
అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది
ఇంకా బాగా అర్ధం అవుతూనే ఉంటుంది..
17 comments:
చాలా బాగుంది త్రిష్ణ గారు :)
నాకు మా అమ్మ గుర్తొస్తుంది..
Simply Superbbb...
good one..
నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు
http://alochanalu.wordpress.com/2011/01/10/
నాకు మా అమ్మ గుర్తొస్తుంది..
:(
ఎవరికయినా "అమ్మ, నాన్నార్లు" అంతే. భగవద్గీతలా జీవితపు ఒక్కో దశలో ఒక్కో విధంగా అర్ధమవుతూ ఉంటారు
ఎంత బాగా చెప్పారు తృష్ణ గారు ! ఎంత బాగా చెప్పారు !ఎన్ని సార్లో కదా అలా !
manam amma ayyake mana amma manku baaga ardham avuthundi.
నిజంగానే మీరన్నది నిజంగా నిజం....
హుమ్మ్.. నాకూ అమ్మ గుర్తొస్తోంది.. :(
Anthulenanni sarlu gurthu vastuu nee vuntundi amma :) Chala baga chepparu
చాలా బాగుంది తృష్ణ గారు.
Yes, history repeats itself:) very nice. I liked it.
అందరికి అమ్మ గుర్తు వాచేలా చేసారు..చిన్ని చిన్ని విషయాలు ఎంతటి విలువైనవో బాగా చెప్పారు..
లక్ష్మీ రాఘవ
:( నాకు చాలా బాధేస్తుంది ఈ పోస్ట్ చూస్తే!! మనం అచ్చం మనలాగా ఉండేది అమ్మ దగ్గరేనేమో కదా!! I love my mom!! :(
@రాఘవ:
@కిరణ్:
@మనసుపలికే:
ధన్యవాదాలు.
@ప్రవీణ: చదివానండీ. చాలాబాగుంది.
ధన్యవాదాలు.
@కావ్య: :)
థాంక్యూ.
@శంకర్.ఎస్: అవునండీ ౧౦౦% నిజం.
ధన్యవాదాలు.
@సుధీర: అవునండీ..ధన్యవాదాలు.
@గీత_యశస్వి: :) ధన్యవాదాలు.
@శ్రీలలిత, మధురవాణి, విరిబోణి, వేణూ శ్రీకాంత్, జయ, లక్ష్మీ రాఘవ: ధన్యవాదాలు.
@ఇందు: అవునండీ. అమ్మ దగ్గర ఉన్న స్వాతంత్ర్యం మరెవరిదగ్గరా ఉండదు. మనం అరిచినా, కోపగించుకున్న, దెబ్బలాడినా, తిట్టినా, వేలాకోళం చేసినా, మౌనం వహించినా...ఏం చేసినా మనల్ని భరించేది అమ్మ ఒక్కర్తే.
ధన్యవాదాలు.
Post a Comment