పొద్దున్న స్కూలుకెళ్ళి రిపోర్ట్ కార్డ్ తెచ్చాం. వెళ్లగనే "your child got into the notice board this time" అన్నరు టీచర్ మాతో. గబగబా ఏ ర్యాంక్ వచ్చిందా అని చూసాం...4th rank ! marks 439/500 వచ్చాయి. నలభై మంది క్లాసుపిల్లల్లో ఆ మాత్రం ర్యాంక్ వచ్చిందంటే నాకు ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. మరోసారి నాలో "పుత్రికోత్సాహం" పొంగిపొర్లింది.
LKG లోనూ, UKGలోనూ గ్రేడ్స్ ఉండేవి. అప్పుడూ 'A+' వచ్చేది. ఫస్ట్ క్లాస్ నుంచీ ర్యాంక్ లు ఇస్తారు. ఇప్పటి ఫస్ట్ క్లాస్ కీ మేం చదువుకున్న ఫస్ట్ క్లాస్ కీ ఎంతో తేడా. అదేం సిలబస్సో..పిల్లలసలు చదవగలరా అనుకునేదాన్ని నేను. కానీ జనరేషన్ చాలా మారిపోయింది కాబట్టి అంతంత సిలబస్సులనీ కూడా ఇట్టే చదివేస్తున్నారీ కాలంపిల్లలు. ఈ ఏడాది మొదట్లో నేను ఓంట్లోబాలేక అమ్మ దగ్గర ఉండిపోవటంతో రెండు మూడు నెలలు దాని స్కూలు సరిగ్గా సాగలేదు. చాలా మిస్సయ్యింది. అవన్నీ మేమిద్దరం వీలైనప్పుడల్లా నేర్పిస్తూ, చదివిస్తూ వచ్చాము. అందులోనూ తెలుగు అక్షరాలూ, గుణింతాలూ అవీ బేసిక్స్ ఇప్పుడు సరిగ్గా రాకపోతే భాష సరిగ్గా రాకుండాపోతుందని మా భయం.
కానీ నువ్వు ఫలానా ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఏనాడూ మేము దాన్ని ఫోర్స్ చెయ్యలేదు. ర్యాంకులూ, పోటీ అంటూ పిల్లల చిన్నతన్నాన్ని చిదిమేసి చదువుల్ని పిల్లల మీద రుద్దేయటం మా ఇద్దరికీ కూడా ఇష్టం లేదు. "మార్కుల గురించి ఆలోచించద్దు. పాఠం సరిగ్గా అర్ధం అయ్యిందా లేదా? అన్నది చూసుకో" అని చెప్పేవాళ్ళం దానికి. స్కూల్లో అన్నీ బట్టీ వేయించేస్తూ ఉంటారు. పైగా ఏదన్నా తప్పు చెబితే మా టీచర్ ఇలానే చెప్పారు అంటుంది. అందుకని మేము నోట్స్ లోని ప్రశ్నలు జవాబులు కాకుండా టెక్స్ట్ బుక్ లోని పాఠమే చదివించేవాళ్లం. అయితే pressurize చెయ్యకుండా, పరీక్షల భయం ఇప్పటినుంచీ దానిలో కలగకుండా జాగ్రత్త పడ్డాం. మొత్తానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏనాడూ ఆశించలేదు.
ఇప్పుడు అందరు పిల్లలూ బాగా చదువుకుంటున్నారు, కళలు,ఆటలు అన్నింటిలోనూ ఏక్టివ్ గా ఉంటున్నారు. 4th rank is not a big thing... ఇదేమీ గొప్ప అని నేను రాయటం లేదు. కేవలం ఆనందాన్ని పంచుకోవటానికి రాస్తున్నాను. మా బంగారుతల్లి ఇలానే బాగా చదువుకుని ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటున్నాను. నా కలల్ని దాని మీద రుద్దాలని ఎప్పుడూ అనుకోను, కానీ తాను చూసే కలల్ని తను సాకారం చేసుకోగలగాలని ఆశపడతాను.
16 comments:
అభినందనలు తృష్ణ గారు. మీ చిన్నారికి ఆశీస్సులు కూడా :)
So nice ! My best wishes to her !
తృష్ణ గారు
మీ అమ్మయీకి అబినందనలు. తప్పకుండ చెప్పండెం.
నిజమేనండీ పరీక్షల భయం, పేరెంట్స్ వత్తిడి లేకపోతే పిల్లలు సహజంగానే రాణిస్తారు.
మీ అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పానని చెప్పండి.
మీ అమ్మాయి స్కూల్, రిపోర్ట్ సంగతులు చదువుతుంటే నాకు మా పిల్లల చిన్నప్పటి సంగతులు గుర్తు వచ్చేయి. మేము కూడా మీలాగే మా అమ్మాయినీ, అబ్బాయినీ కూడా రేంకుల గురించి ఖంగారు పెట్టేవాళ్ళం కాదు.
ఒకరోజు రెండోక్లాస్ లో మా అబ్బాయి రిపోర్ట్ తీసుకుందుకెళ్ళినప్పుడు ఆ టీచర్ నన్ను చూసి,
"He is not upto the mark.." అన్నారు.
ఎన్ని మార్కులొచ్చేయా అని చూస్తే 89% వచ్చాయి. ఇంక నేను రేంక్ పట్టించుకోలేదు. యేభై వచ్చినా తర్వాతి క్లాస్ కి వెడతాడు. తొంభై వచ్చినా తర్వాతి క్లాస్ కి వెడతాడు. దీని గురించి అంత బాధపడక్కర్లేదనిపించింది. అందుకే.."I don't mind.." అన్నాను ఆ టీచర్ తో. ఆవిడ నన్ను ఓ పిచ్చిదాన్ని చూసినట్టు చూసేరు. "He can do better.." అన్నారు. అప్పుడు నాకు తెలిసింది, టీచర్ తో అలా మాట్లాడకూడదని. పొరపాటనిపించింది. సారీ చెప్పేసాను వెంటనే. గబుక్కున ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది.
పిల్లల్ని సవ్యంగా పెంచడమంటే యఙ్ఞం చేసినట్టే. ఒక్కసారి మా పిల్లల చిన్నతనం గుర్తు చేసేరు. థాంక్యూ...
మీ అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. అంతకన్న గొప్పగా మంచిమనిషి అవుతుంది. భగవంతుని ఆశీర్వాదాలు మీ పాపకి ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ....
శ్రీలలిత..
చదువంటే ప్రశ్నలకు జవాబులు మాత్రమే అన్నట్టు చాలామంది పిల్లలను చదివిస్తున్నారు. విషయం అర్థం అయ్యిందా లేదా అని చూసేవాళ్ళు చాలా తక్కువ తల్లితండ్రులను చూస్తున్నాం ఈ మధ్య. Nice Article.
చదువంటే ప్రశ్నలకు జవాబులు మాత్రమే అన్నట్టు చాలామంది పిల్లలను చదివిస్తున్నారు. విషయం అర్థం అయ్యిందా లేదా అని చూసేవాళ్ళు చాలా తక్కువ తల్లితండ్రులను చూస్తున్నాం ఈ మధ్య. Nice article...
కంగ్రాట్స్ మీ బుజ్జితల్లి సాధించిన చిన్ని విజయానికి!
పొదిగిన గుడ్డు పిల్లయ్యిందా !!! ;)
అభినందనలు తృష్ణా. మరి తరువాత మా కాలేజ్ కే పంపించాలి. సరేనా.
తృష్ణ గారూ !
కొంచెం ఆలస్యంగా చిన్నారికి అభినందనలు....
అశీస్సులు.
Warm wishes to the little one!
పిల్లలతో కలిసి మళ్ళీ బాల్యాన్ని అనుభవించటంకంటే ఆనందమేముంది?
Best wishes to you too,
శారద
మీకూ , మీ బంగారు తల్లి కి అభినందనలండి .
@వేణూశ్రీకాంత్, శ్రావ్య వట్టికూడి, వంశి, శ్రీలలిత, శంకర్, రాధేకృష్ణ ఫ్రూట్ కంపెనీ, లక్ష్మి, ఇందు, చైతన్య, జయ, ఎస్.ఆర్.రావు, శారద, మాలా కుమార్ :
పాపకు ఆశీస్సులు అందించిన అందరికీ ధన్యవాదాలు.
బంగారు తల్లి కి కంగ్రాట్స్ చెప్పండి..
కానీ తాను చూసే కలల్ని తను సాకారం చేసుకోగలగాలని ఆశపడతాను. -- (ఆహా..అమ్మ ప్రేమ..ఇంత తియ్యగా ఉంటుంది..:))
బంగారు తల్లికి అభినందనలు..మీకు పుత్రికోత్సాహము అలా అలా ఎల్లలు లేకుండా పెరగాలని ఆకాంక్షిస్తున్నాను.
Post a Comment