సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, September 30, 2010

Tagore's rare photos from "సంస్కృతి ఎక్స్ ప్రెస్"

in his favourite easy chair


Tagore 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా "సంస్కృతి ఎక్స్ ప్రెస్" అని సికింద్రాబాద్(బోయిగూడా) రైల్వే స్టేషన్లో ఐదు బోగీలు ఉన్న చిన్న రైలుని ప్రదర్శనకు ఉంచారు.మొన్న పేపర్లో వార్త చూసి పోస్ట్ పెట్టాను. ప్రవేశ రుసుము ఏమీ లేదు. వాటిల్లో రవీంద్రునికి సంబంధించిన అరుదైన చిత్రాలు, రచనలకు సంబంధించి విశేషాలు, ఆయన ఉత్తరాలోని కొన్ని భాగాలు, పైంటింగ్స్ అన్నీ పెట్టారు. రేపటివరకూ మాత్రమే ఉన్న ఆ ప్రదర్శనను చూడాలని నిన్న వెళ్ళి చాలా ఆనందించాను. Its a great feeling...!!



కనీసం ఒకరిద్దరయినా ఈ టపా పట్ల ఆసక్తి ఉన్నవారు ఉంటే వాళ్ళతో అయినా నా ఆనందం పంచుకుందామని... అక్కడ నేను తీసుకున్న ఫోటొల్లో కొన్నింటిని ఈ టపాలో పెడుతున్నాను. మేము శాంతినికేతన్ వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు తీసుకోనివ్వలేదు. ఈసారి ఏ ఆటంకం లేకుండా కావాల్సినన్ని ఫోటోలు తీసుకున్నాను.

Its great great pleasure to have such rare photos and i feel previleged to know atleast a few things about such a great personality. Words can never describe the admiration i have for this man...i just love him for what he is...!!


Tagore and his wife Mrunalini who died at a very young age(29)

.Father of Indian Statistics prasant kumar Mahalonobish& Mrs.Nirmala Devi





With Bernard Shaw




when Gandhiji & kasturiba visited shantiniketan
Tagore's Nobel certificate

tagore's painting
another painting




Wednesday, September 29, 2010

cartoons on CWGames


CWGames గురించి ఇప్పటికే రకరకాల జోక్స్, వ్యంగ్యాలు, కార్టూన్లు ప్రచారం లోకి వచ్చాయి. మొన్న రాత్రి రేడియోలో 11pmనేషనల్ న్యూస్ లో ఒక వార్త మరింత నవ్వు తెప్పించింది. ఒక విదేశీ వెయిట్ లిఫ్టర్ తనకు ఎలాట్ చేసిన గదిలోని మంచం మీద కూచోగానే అది విరిగిపోయిందట....!! బ్రిడ్జీలే కాదు మంచాలు కూడానా అని నవ్వుకున్నాం.

హిందూ న్యూస్ పేపర్లో "కార్టూన్ స్కేప్" అని పదవ పేజీలో వివిధ కార్టున్లు వేస్తూంటారు. వాటిల్లో CWGames కు సంబంధించిన కొన్ని కార్టూన్లు...సరదాకి...


20th Sep cartoonscape


24th sep. cartoonscape


27th Sep.cartoonscape

Tuesday, September 28, 2010

ఇవాళ "లత" పాటలు వినద్దా మరి..?!


గ్రైండర్ తిప్పి చప్పుడు చేసిందని భర్త తిడితే, "లతా మంగేష్కర్ వచ్చి పప్పు రుబ్బి పెడుతుందా...?" అంటుంది భైరవి "సింధుభైరవి" సినిమాలో. ఆవిడ వంట ప్రావీణ్యం ఏపాటిదో తెలీదు కానీ ఆమె పాడిన పాటలు వింటూంటే "గానామృతం" అంటే ఇదే అనిపించక మానదు. మరువలేని మధుర గీతలను అందించిన ఈ పుట్టినరోజు పాపాయిని ఇవాళ తలుచుకోకపోతే ఎలా? ఆవిడ పాటలతో చాలా కేసెట్లు, ఆల్బమ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ వాటిల్లో ప్రత్యేకమైనవి HMVవాళ్ళు రిలీజ్ చేసిన 2 ఆల్బమ్స్.
1) "శ్రధ్ధాంజలి" పేరుతో ఒక 15,16మంది గాయనీగాయకులకు అంజలి ఘటిస్తూ, లతా వాళ్ళందరివీ ఒక 38, 39 పాటలు పాడారు.
2) " Lata in her own voice" అని కొందరు సినీ ప్రముఖులను తలుస్తూ, వాళ్ళ గురించి కబుర్లు చెప్తూ ఓ 41పాటలు పాడారు.
ఈ రెండు కూడా నాకు తెలిసీ అభిమానులందరూ కొనుక్కోవాల్సిన ఆల్బమ్స్.


కానీ ఒక విషయం నన్ను బాధిస్తూంటుంది. ఇంత గొప్ప గాయనీ(మిగిలిన ఏజ్డ్ సింగర్స్ కూడా) ఇంకా ఇంకా పాడటం నాకు మింగుడుపడదు. ఇరవైఏళ్ళ హీరోయిన్కి 70,80 ఏళ్ళ వాయిస్ సరిపోతుందా? అని దర్శకులు, నిర్మాతలూ ఎందుకు ఆలోచించరో మరి....


ఇవాళ్టి విషయానికి వచ్చేస్తే అసంఖ్యాకమైన ఆమె పాటల్లో ఇప్పుడు ఏవి తలిచేది..? అతి కష్టం మీద ఈ కొద్ది పాటలు ఏరాను...ఇవి నా దృష్టిలో ఆవిడ పాడిన కొన్ని మంచి పాటలు. విని ఆనందించండి..


1) Aja re pardesi-- madhumati
salil choudhury
shailendra



2) alla tero naam -- Hum dono
jaidev
saahir





3) ye malik tere bande hum -- Do Aankhen Bara Haath
Music Director: Vasant Desai
Lyrics: Bharat Vyas



4) kuch dil ne kaha -- Anupama
music:hemant kumar
lyrics:kaifi azmi







5) pyar kiya to darna kya-- Anarkali
naushad
shakeel badayuni



6) O sajna barkha bahaar aayi -- Parakh
salil choudhury
shailendra







7) tujh se nArAz nahi zindagi -- MAsoom
lyrics:gulzar
singer:lata
music:S.D.burman



8) yaara seeli seeli -- Lekin
hridaynath mangeshkar
gulzar







9) megha chaye aadhi raat -- Sharmilee
S.D.burman
neeraj



10) tere bina zindagi se koi -- Andhi
lyrics:gulzar
singer:lata &kishore kumar
music:R.D.burman



11) dil dhoodhta hai -- Mausam
lyrics:gulzar
singers:bhupender,Lata
music:madan mohan



12) O paalan haare -- Lagaan
A.R.Rehman
javed Akhtar
Lata & Udit Narayan





ఇక లత సినిమాల్లో పాడిన, నాకు బాగా ఇష్టమైన గజల్స్. వీటి సంగీతం, సాహిత్యం, లత పాడిన తీరు అన్నీ అద్భుతంగా ఉంటాయి...
1) unko ye shikaayat hai
Adalat
madan mohan
rajinder krishan


2) aap ki nazron ne samjha
anpadh
madan mohan
Raja mehdi ali khan


3) hai isi mein pyar ki aabroo
anpadh
madan mohan
Raja mehdi ali khan


4) naghma-o-sher ki saugaat
Gazal
madan mohan
sahir


5) mohabbat ki jhooti kahaani pe rooye
mughal-e-Azam
naushad
shakeel badayuni





ఈవాళ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు లతా మంగెష్కర్ గారికి ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్ర్రార్ధిస్తున్నాను.



మంచి మాట


మన ప్రాచీన గ్రంధాల్లోని మంచి సుభాషితాలు చాలా ఉన్నాయి. కొన్ని శ్లోకాలు, పద్యాలు మొత్తం తెలియకపోయినా వాటి తాలూకు మొదటి వాక్యమో, చివరి వాక్యమో మనం మాట్లాడేటప్పుడు వాడుతూ ఉంటాము. నాకు తెలుగు, ఇంగ్లీషు కొటేషన్స్ కలక్ట్ చేసుకునే అలవాటు ఉండటంతో చిన్నప్పుడు ఎక్కడో దొరికినప్పుడు రాసుకుని దాచుకున్నవి ఇవి. ఏవైనా అచ్చుతప్పులు ఉన్నయేమో తెలీదు.


మనం చాలాసార్లు వాడుకలో చెప్పుకునే వాక్యాలను, మనం చాలాసార్లు వాడుకలో చెప్పుకునే వాక్యాలను ఇవి మనకు తెలుసే అనిపించే హైలైట్ చేసాను. ఎంతో నీతి దాగి ఉన్న అలాంటి వాక్యాలు- వాటి పూర్తి రూపాలు కొన్ని ...


పుస్తకం వనితా విత్తం
పరహస్తం గతం గత:
అధవా పునరాయాతం
జీర్ణం భ్రష్టాచ ఖండశ:


పుస్తకం, స్త్రీ, ధనం ఈ మూడూ పరాయి చేతుల్లోకి వెళ్ళాకా ఆశ వదులుకోవలసినదే.
ఒకవేళ వెనక్కు వచ్చినా ముక్కముక్కలైపోయి నాశనమై వస్తాయి.




కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం


కృషి చేసేవారికి కరువనేది ఉండదు. భగవన్నామ జపం చేసుకునేవారికి పాపమంటదు.
మౌనంగా ఉండేవారికి కలహాలుండవు. జాగురుకతో ఉండేవారికి భయం ఉండదు.




ఋణానుబంధరూపేణా
పశుపత్నీ సుతాదయా
ఋణక్షయే క్షయంయాతి
కతత్ర పరివేదనా


ప్రపంచంలో మనకు ఏర్పడే అన్నిరకాల బంధాలూ ఋణానుబంధాలే. ఋణం తీరిపోయాకా ఆ బంధాలన్నీ నశించిపోతాయి. అందువల్ల ఈ ప్రాపంచిక బంధాలపై మమకారం పెంచుకుని వేదన పడకూడదు.




సత్యం బ్రూయాత్ప్రియంబ్రూయా
న్న బ్రూయా త్పత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయా
దేష ధర్మ స్సనత:


ఎప్పుడూ సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలి.
సత్యం అప్రియమైనదైనా కూడా ప్రియంగానే చెప్పాలి. ఇది అనాదిగా వస్తున్న ధర్మసూత్రం.




పరోపకారాయ ఫలంతి వృక్షా:
పరోపకారాయ వహంతి నద్యా:
పరోపకారాయ దుహంతి గావ:
పరోపకారార్ధ మిదం శరీరమ్.


అడగకుండానే చెట్లు పండ్లనిస్తాయి. అడగకుండానే నది నీళ్లనిస్తోంది. అడగకుండానే ఆవులు పాలనిస్తాయి. ఇవన్నీ ఇతరుల కోసమే. అలానే మానవ శరీరం కూడా ఇతరులకు ఉపకారం చేయటానికే ఇవ్వబడింది.

Tagore 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా "సంస్కృతి ఎక్స్ ప్రెస్"



ఠాగూర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళ కోసం ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఈ ప్రకటన.(ఈ వార్త సాక్షిలో కూడా ప్రచురించబడింది). ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం "శాంతినికేతన్" చూసాను. ఇప్పుడు ఈ రైలులో పెడతారంటున్నవన్నీ అప్పుడు చూసేసినవే. అయినా వీలుంటే వెళ్ళి ఆ రైలుని చూడాలని. ఆయనపై ఉన్న ప్రేమ అటువంటిది.



రవీంద్రుని గళంలో ఆయన కవితను, పాటనూ నా సంగీతప్రియ బ్లాగ్లో వినవచ్చు. 

Monday, September 27, 2010

ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!

చిన్ననాటి కబుర్లు ఎన్ని చెప్పుకున్నా తనివితీరదు. ఆనందాన్నిచ్చే మధురమైన జ్ఞాపకాలను తలుచుకున్న కొద్దీ మనసు పసిపాపలా మారిపోయి ఆ జ్ఞాపకాల దొంతరల్లో పరుగులు పెడుతుంది. జ్యోతిగారు "గుర్తుకొస్తున్నాయి.." అనే శీర్షికతో రాయమని అడిగినప్పుడు, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి రాయాలని అనుకున్నా.. కానీ అన్నింటిలో వేటి గురించి రాయాలి...అని ఆలోచిస్తే దేన్నీ వదలాలనిపించలేదు. అందుకనే నా అందమైన జ్ఞాపకాల్లో ముఖ్యమైన కొన్నింటిని కలిపి ఇలా ఓ చోట పోగేసాను...

























గోదారిఒడ్డూ...జన్మనిచ్చిన రాజమండ్రీ...
తాతగారిల్లూ...పెద్ద గేటు
మెట్లమీదుగా రేకమాలతి పందిరి
జ్ఞాపకాల్లోనూ మత్తెక్కించే ఆ పూల పరిమళం
దొంగా పోలీస్ ఆటలు, పరుగులూ
పాపిడీ బండి, రిబ్బన్లబ్బాయ్...

విజయవాడ వీధులూ...సూర్యారావుపేట
భాస్కరమ్మగారిల్లు...పక్కింటి తాతగారూ...
పెరడు, మొక్కలు, పక్కింటి పిల్లలు
అడుకున్న ఆటలూ, గోడల మీద విన్యసాలు
చింతల్లేని చిన్నతనం...తిరిగిరాని అమాయకత్వం




















సర్కార్ ఎక్సప్రెస్...కాకినాడ ప్రయాణాలు
రామారావుపేట..శివాలయం ప్రదక్షిణాలు
తాతమ్మా,నానమ్మల కథలు కబుర్లు
అన్నయ్యతో షికార్లు...గాంధీపార్క్ సాయంత్రాలూ
దొడ్లో మొక్కలూ...సంపెంగిపువ్వులూ
సన్నజాజిమాలలు...గిన్నెమాలతి అందాలు
సొంత ఇల్లు అందం...మహారాణీ భోగం..
గేటు దగ్గరి నైట్ క్వీన్ పూల సుగంధం...


మన్ చాహేగీత్ పాటలూ...నాన్నతో ముచ్చట్లు
టేపులూ....రికార్డింగులూ...ఆకాశవాణి స్టూడియోలూ
నిర్వహించిన యువవాణి కార్యక్రమాలు...
చెప్పిన హిందీ పాఠాలూ...కవితలూ..
చిరు చిరు సంపాదనల విజయగర్వాలు




















మేరీస్టెల్లా, బాబాగుడి , ఐదవనెంబరు బస్ రూటు
ఆప్షన్స్, ప్రబోధా, ఆర్చీస్ గేలరీలు, గ్రీటింగు కలక్షన్లు
కాలేజీ స్నేహితులూ..చెప్పుకున్న ఊసులూ
పోస్ట్ మేన్ కోసం పడిగాపులూ...ఉత్తరాల పరంపర..
సినిమా సరదాలు...టికెట్ క్యూల్లో పడిగాపులు
తిరిగిన వీధులు...తిన్న ఐస్క్రీములు


నాన్న అవార్డులు...ఢిల్లీ ప్రయాణాలు
ఆయన సన్మానాలూ..పేపర్లో వార్తలు
నాన్న కూతురినన్న గర్వం
వెళ్ళిన ప్రతిచోటా మర్యాదల పర్వం





















పున్నమ్మతోట క్వార్టర్స్, డి-వన్ ఇల్లు 
పెంచిన పూదోటలూ, పండించిన కాయగూరలు
మెట్ల మీద కబుర్లూ, బేట్మెంటన్ ఆటలు..
న్యూ ఇయర్ సంబరాలు, సంక్రాంతి ముగ్గులూ
పిన్నల మన్ననలు, పెద్దల దివెనలూ
ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!



తలిచినప్పుడల్లా నిన్నటివా గత జన్మావా అనిపించే ఈ చిన్ననాటి స్మృతులు ఎన్నటికీ తరగని నా ఆనంద నిధులు. రాస్తున్నంత సేపూ మనసు ఈ జ్ఞాపకాల తరంగాల్లో ఉయ్యాలలూగింది. ఈ శీర్షికకు రాయటం ద్వారా నాకు లభించిన మధుర క్షణాల ఆనందానికి కారణమైన జ్యోతిగారికి కృతజ్ఞతలు. ఆలస్యమేమిటి...అందరూ ఓసారి అలా మీ మీ చిన్నతనంలోకి వెళ్ళి వచ్చి నాలా రిఫ్రెష్ అయిపోండి మరి...!!