సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, January 12, 2010

సంక్రాంతి...ముగ్గులు...


స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,

డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.

సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....




ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo

ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.

మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...








బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

14 comments:

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

మధురవాణి said...

ముగ్గులు చాలా బాగున్నాయి. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :)

సిరిసిరిమువ్వ said...

ముగ్గులు బాగున్నాయి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓ సారి నా జ్ఞాపకాలు చూడండి. http://vareesh.blogspot.com/2008/01/blog-post.html

జయ said...

చాలా ముగ్గులే వేశారు. నేను కూడా సంక్రాంతికి నెల రోజులు ఎన్నో ముగ్గులు వేసేదాన్ని. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతకి మీ పాపకి భోగి పళ్ళు పోస్తున్నారా? బొమ్మలు పెట్టిస్తున్నారా? నేను బొమ్మలు పెడ్తాను. నాకు చాలా ఇష్టం. సంక్రాంతి మూడు రోజులు ఎంత కళకళ లాడుతుందో కదా. నేను ముత్యాలముగ్గు సినిమా పాట ఈ రోజుల్లో ఎప్పుడో అప్పుడు పాడుకుంటూ ఉంటాను.

మురళి said...

సంక్రాంతి శుభాకాంక్షలు..

swathi said...

happy sankranthi

మాలా కుమార్ said...

ముగ్గ్గులు బాగున్నాయండి . మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

శ్రీలలిత said...

ఎంచక్క... ఎంత బాగున్నాయో ముగ్గులు..
సంక్రాంతి శుభాకాంక్షలు..

భావన said...

తృష్ణా మీకు నూతన సవత్సర శుభాకాంక్షలు కూడా సంక్రాంతి శుభాకాంక్షల తో పాటు. ముగ్గు లు బలే వున్నాయి.

హరే కృష్ణ said...

సంక్రాంతి శుభాకాంక్షలు

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

నిషిగంధ said...

మీరు చెప్పిన వెడల్పు పోత ముగ్గు టెక్నిక్ బావుంది.. దీంతో ముగ్గు ఇంకా చక్కగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది!

మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ప్రేరణ... said...

ముగ్గులు చాలా బాగున్నాయి.సంక్రాంతి శుభాకాంక్షలు!

తృష్ణ said...

వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.