సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, January 10, 2010
స్వర రాగ గంగా ప్రవాహమే...
"चलो मन जाये घर अपनॆ
इस परदॆस में वॊ पर भॆस में
क्यॊ परदॆसी रहॆं....
चलो मन जाये घर अपनॆ....."
అంటూ 1998 లో G.V.Iyer గారు దర్శకత్వం వహించిన "స్వామి వివేకానంద" హిందీ చిత్రానికి ఒక అద్భుతమైన పాట పాడారు ఏసుదాస్ గారు.
గుల్జార్ రాయగా, ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు "సలీల్ చౌదరి" గారు స్వరపరిచిన పాట ఇది.
ఈ పాట ఈ లంకెలో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=d5oOvxcff0g
నాకు చాలా ఇష్టమైన గాయకుల్లో "ఏసుదాస్" గారు ఒకరు. K.J.Yesudas గొంతు నాకు ఇష్టం అనటం "వెన్నెల" అంటే నాకూ ఇష్టమే అని చెప్పటమే అవుతుంది. ఆయన పాటల గురించి, ఆ స్వరంలోని మాధుర్యాన్ని, విలక్షణమైన ఒరవడి గురించీ ఎంత చెప్పినా తనివి తీరదు. కాబట్టి ఆయిన పాడిన కొన్ని తెలుగు ,హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను.
ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని తెలుగు పాటలు:
ఓ నిండు చందమామ..నిగనిగలా భామా (బంగారు తిమ్మరాజు)
కొంగున కట్టేసుకోనా(ఇద్దరు మొనగాళ్ళూ)
కురిసెను హృదయములో తేనె జల్లులే (నేనూ నా దేశం)
నీవు నా పక్కనుంటే హాయి(శివమెత్తిన సత్యం)
చిన్ని చిన్ని కన్నయా కన్నులలో నీవయ్యా(భద్రకాళి)
ఎవ్వరిది ఈ పిలుపు..(మానస వీణ)
ఊ అన్నా...ఆ అన్నా....ఉలికి ఉలికి పడతావెందుకు....(దారి తప్పిన మనిషి)
అమృతం తాగిన వాళ్ళు (ప్రతిభావంతుడు)
లలిత ప్రియ కమలం(రుద్రవీణ)
తులసీ దళములచే(రుద్రవీణ)
నీతోనే ఆగేనా(రుద్రవీణ)
తెలవారదేమో స్వామీ(శృతిలయలు)
చుక్కల్లే తోచావే(నిరీక్షణ)
ఇదేలే తరతరాల చరితం(పెద్దరికం)
రాధికా కృష్ణా(మేఘసందేశం)
ఆకాశ దేశానా(మేఘ సందేశం)
సిగలో అవి విరులో(మేఘ సందేశం)
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా(పచ్చని సంసారం)
పచ్చని చిలుకలు(భారతీయుడు)
స్వర రాగ గంగా ప్రవాహమే(సరిగమలు)
కృష్ణ కృపా సాగరం(సరిగమలు)
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ(అల్లుడుగారు)
నగుమోము(అల్లుడుగారు)
పూమాల వాడెనుగా పూజసేయకే(సింధు భైరవి)
నీవేగ నా ప్రాణం అంట(ఓ పాపా లాలి)
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా(కుంకుమ తిలకం)
మా పాపాలు కరిగించు (శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం)
నాకు చాలా ఇష్టమైన "హరివరాసనం" పాటను ఈ లింక్ లో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=rcQCkkVKC5w
ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని హిందీ పాటలు:
१)चांद जैसॆ मुख्डॆ पॆ...
२)दिल के टुकडॆ टुक्डॆ कर कॆ मुस्कुराकॆ चल दियॆ...जातॆ जातॆ यॆ तॊ बता जा हम जियॆंगॆ किस्कॆ लियॆ..
३)गॊरि तेरा गांव बडा प्यारा में तो गया मारा आकॆ यहा रॆ...(चित चॊर)
४)आज से पेह लॆ..आज सॆ ज्यादा खूशी आज तक नही मिली..(चित चॊर)
५)जब दीप जले आना..जब शाम ढलॆ आना(चित चॊर)
६)जानॆ मन जानॆ मन तॆरॆ यॆ नयन..
७)निस..गम..पनि....आ ..आभीजा..(आनंद महल)
८)सुरमयि अखियॊं में..(सदमा)
९)का करू सजनी आयॆ ना बालम (स्वामी)
१०)माना हॊ तुं बॆहद हसी..(टूटॆ खिलॊनॆ)
११)कहा सॆ आयॆ बदरा -- (चष्मॆ बद्दूर, Singers: K.J. Yesudas & Haimanti Shukla)
నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇక్కడ చూడండి...
2000లో ఈయన పాడిన "Sitaron mein tu hi" ప్రైవేట్ హిందీ అల్బమ్ చాలా ఆదరణ పొందింది. "మెహబూబ్" రాయగా, హిందీ చిత్ర స్వరకర్త "లలిత్" స్వరపరిచిన ఈ అల్బం లోని పది పాటలూ చాలా బావుంటాయి. వాటిలోని ఒక "చమక్ ఛం ఛం" అనే పాటని ఇక్కడ చూడండి..
ఏసుదాస్ గారికి "పిన్నమనేని అవార్డ్" ను విజయవాడలో ఒక సభలో ప్రధానం చేసారు. అప్పుడు ఆయన చేసిన "లైవ్ కచేరి" వినలేకపోయినా, రికార్డింగ్ ను దాచుకోగలగటం నా అదృష్టం. K.J.Yesudas గురించిన మరిన్ని వివరాల కోసం "ఇక్కడ" చూడండి. కొందరు ప్రముఖులు ఆయనకు ఇచ్చిన ప్రశంసలు, ఆయనకు వచ్చిన అవార్డులు, పాడిన భాషల వివరాలూ అన్నీ ఈ వికిపీడియా లింక్ లో ఉన్నాయి. అందుకని ఇంక ప్రత్యేకంగా ఆయన గురించి ఇంకేమీ రాయటం లేదు.
ఏసుదాస్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మనకందరికీ ఇంకెన్నో అద్భుతమైన పాటలనందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆయన టపా ద్వారా ఇవాళ ఏసుదాస్ గారి పుట్టిన రోజని తెలిపి నాకు ఈ మధురమైన పాటలన్నీ మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన "మురళిగారికి" ప్రత్యేకధన్యవాదాలు.
Subscribe to:
Post Comments (Atom)
29 comments:
"అరె..ఈ గొంతు ఇన్నాళ్ళూ ఎలా మిస్సయ్యాను" అనిపించిందండీ, మొదటిసారి తన పాట విన్నప్పుడు.. అతిశయోక్తి అనిపిస్తుందేమో కానీ, తను పాడిన ఏ పాటా 'బాలేదు' అనిపించదు నాకు.. బాగుందండి మీ జాబితా..
Very nice.
మురళి గారు చెప్పినట్టు
తను పాడిన ఏ పాటా 'బాలేదు' అనిపించదు
జేసుదాస్ లో నాకు నచ్చే ఇంకో గుణం తన ప్రత్యక్ష కచేరీల్లో సినిమా పాటనీ కర్నాటక సంగీతాన్నీ విడిగా ఉంచడం.
జేసుదాసు నాకు తొలిసారిగా పరిచయమైనది మలయాళం డబ్బింగ్ సినిమా స్వామి అయ్యప్ప ద్వారా. అందులో ఆయన పాడిన అనేక అయ్యప్ప భజన కీర్తనలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా హరివరాసనం ..
ఆయనా అదృష్టవంతుడనే అనుకోవాలి. చెంబై శిష్యుడు కాకుండి ఉంటే ఏమై ఉండునో కదా! ఏదేమైనా, కర్నాతక సంగీత రంగంలో ఉన్న అంతర్రాజకీయాల వల్ల ఈయనకి రావలసిన గుర్తింపు రాలేదు.
డా .పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ అవార్డు విజయవాడ కి చెందిన ప్రముఖ డాక్టర్స్ స్థాపించిన ఫౌండేషన్ .జేసుదాస్ కి రెండువేల సంవత్సరం లో ప్రదానం చేయబడిందండీ.
చిన్నప్పుడు మనకు తెలిసిన పాటగాళ్ళు గంటశాల, బాలు. కొన్నిపాతల్లో గొంతుతేడా తెలిసేదికానీ ఆగొంతు యేసుదాసుది అని తెలీదు. మొదటి సారి ఆయన్ని తిరువయ్యారులో త్యగరాజ ఆరాథోనత్సవాల్లో చూశాను. శివున్ని స్తుతిస్తూ ఆయనపాడిన కృత్,ఇ అందులో శివా..! అంటూ ఆయనచేసి ఆలాపన ఇంకా గుర్తే. నాకు బాగానచ్చేవి తెలవార్దేమో స్వామీ, ముద్దబంతి పువ్వులో, నగుమోమూ కనలేని, అందమైనవెన్నెలలోనా వగైరా వగైరా.
బాగుందండి మీ కలెక్షన్ .
ఎన్ని విన్నా ఇంకొన్ని వినాలని, ఎన్నిసార్లు విన్నా ఇంకొన్నిసార్లు వినాలని... ఆయన అభిమానకోటిలో నేనొకరిని. బాగా ప్రెజెంట్ చేసారు..
>> आज से पेह लॆ..आज सॆ ज्यादा खूशी आज तक नही मिली..(चित चॊर)
I like this song very much.
తృష్ణగారు మీకు నచ్చిన పాటలతో పాటు నాకు ఇంకొక పాట కూడా ఇష్టమండి....దారిచూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక(గృహప్రవేశం), మీ సెలక్షన్ బాగుందండి.
మీరు, మురళీగారు జేసుదాసుగారి గురించి వ్రాసి ఈ ఆదివారము హాయిగా ఆయన పాటలతో గడిచేలా చేసారు. థాంక్సండి!
నేను ప్రాణాధికంగా ఇష్టపడే గళాల్లో జేసుదాస్ గారి గళం ఒకటి.
పోయిన జనవరిలో హైదరాబాదులో ఆయన కచేరీ చేసినపుడు రాసిన పోస్టు ఇది. వీలైతే చూడండి.
http://manishi-manasulomaata.blogspot.com/2009/01/blog-post_24.html
హరివరాసనం సినిమాలో పాడాక, ఆయన రికార్డ్ కోసం పాడింది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వినండి. ఇంకా "స్వామి గీతాలే " " అయ్య దర్శనం"పాటలు కూడా అద్భుతాలే!
http://www.musicindiaonline.com/p/x/9UQ2JGHd2t.As1NMvHdW/
ఆయనవే ఇంకా అనేక శాస్త్రీయ సంగీతం ఆల్బములు ఇదే వెబ్ సైట్ లో దొరుకుతాయి.
ఆయన పాడిన తెలుగు పాటలకంటే హిందీ పాటలంటే నాకు ఎంతో ప్రాణం. HMV వారి అన్ మోల్ రతన్ కలెక్షన్ అంతా అమృత ప్రవాహమే!
చిత్చోర్ పాటల నుంచి నేను ఆయన వీరాభిమాని నయిపోయాను. చక్కటి గళం, సంగీత జ్ణానం మనల్ని ఇట్టే నిలిపేస్తుంది. ఇప్పటికి కూడా ఆ గొంతులో ఎటువంటి మార్పు రాని ప్రత్యేక గాయకుడు. ఎన్నెన్ని పాటల్నొ గుర్తుచేసారు. బాగుంది.
తృష్ణ గారు, "Sitaron mein tu hi" ఆల్బం గురించి మీ ద్వారానే వింటున్నాను.. థాంక్యూ సో సో మచ్!! ఇక 'కహా సే ఆయె బదరా' ఎన్నిసార్లు విన్నా అన్నిసార్లూ కళ్ళు తడి కాకుండా మానవు! అసలు ఏపాటకాపాటే సాటి! ఆ గంభీరమైన గొంతు హుషారైన పాటలకి ఎలా సూటవుతుందో అనుకున్న నాకు 'ఆజ్ సె పెహలె ' , జానె మన్.. జానె మన్..' పాటలు విన్నాక ఆ అనుమానం పటాపంచలైంది.. ఆ మహాగాయకుడి గురించి ఇంత మంచి టపాను, వివరాలను, ముఖ్యంగా బోల్డన్ని మంచి పాటలను అందించినందుకు ధన్యవాదాలు :-)
మంచిపాటలను పాడిన మంచి గాయకుని గురించి బాగా వివరించారు..
చాలా బాగా రాశారు తృష్ణ గారు. పాటలు ఇలా జాబితా ఇవ్వడం చాలా బాగుంది. నేను సాధారణంగా హిందీ పాటలు వినడం తక్కువ అవడంతో తన పాటలు కూడా కొన్ని మిస్ అయ్యాను. ఇప్పుడివన్నీ వెదికి వినేయాలి అర్జంట్ గా.
తృష్ణగారూ ... "निस..गम..पनि..पिया बावरी..पी कहा..." ఈ పాట "ఖూబ్ సూరత్" సినిమాలో ఆశా భోంస్లే గారూ, అశోక్ కుమార్ గారూ పాడారు కదండీ..
http://www.youtube.com/watch?v=-0ys_K21ytY&feature=fvw
యేసుదాసుగారు కూడా అలాంటి పాట పాడారా?
ప్రణీత గారూ, "నిస గమ పని..’ దాకా కరక్టేనండీ..ఆ తరువాత పొరపాటున 'పియా బావరి' అని రాసేసాను. ఈ పాటను ఈ క్రింద లింకుల్లో వినవచ్చు మీరు.
1)http://74.125.153.132/search?q=cache:AON18qp8rj4J:www.tubeq.com/view/921336+nisa+gama+pani&cd=7&hl=en&ct=clnk&gl=in
2)http://www.youtube.com/watch?v=1q5gYjNXG_I
@మురళి: ఆయన గొంతులో ఏ పాటా "బాలేదు" అనిపించదు. నిజమేనండీ..కానీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించెవి కొన్నే ఉంటాయి కదండీ...ఆయన పాడిన, నా దగ్గర ఉన్న రెండు,మూడొందలు పాటల్లో నేను రాసిన లిస్ట్లో పాటలు నాకు అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలండీ.
@కొత్తపాళీ: పైన మురళిగారికి రాసినట్లే బాలేకపోవటం కాదండీ...నాకు బాగా వినాలనిపించేవి నే రాసినవండీ.
కర్ణాటక సంగీతం విషయంలో మీరు రాసినది అక్షరాలా నిజం.
@చిన్ని: అవునండీ. హడావిడిలో నేను పొరపాటు రాసాను. ఏలూలు వాళ్ళది వేరే సంస్థ. వాళ్ళు కూడా గతంలో చాలా మంది సినీ ప్రముఖులను పిలిచి అవార్డులు ఇచ్చారు. సరి చేసినందుకు ధన్యవాదాలు.
@చైతన్య: చిన్నప్పుడు నాకూ అంతే ఎవరు పాడారో గుర్తుపట్టడం తెలిసేది కాదు...:)
@మాలా కుమార్ : థాంక్స్ అండీ.
@మరువం ఉష: తమరి రాక మాకెంతొ సంతోషమ్ సుమండీ....మీక్కూడా థాంక్యూ...
@గణేష్: ఆ పాట బావుంటుందండీ...ఆ మాతకొస్తే చిత్ చోర్ లో పాటలన్నీ సూపరే.
@ప్రేరణ: అవునండీ...ఈ పాట మర్చిపోయాను రాయటం..థాంక్సండీ.
@పద్మార్పిత: నేను కూడా ఆ పాటలు వింటూ ఆదివారమ్ గడిపేసానండీ...:)
@వెబ్ తెలుగు:thanks for the information.
@సుజాత: మీ పాత టపా ఎప్పుడో చదివేసానుగా..:)
మ్యూజిక్ ఇండియా లింక్ కు ధన్యవాదాలు.
ఆయన పాడిన కచేరీలు,కొన్ని కీర్తనలూ నా దగ్గర ఉన్నాయండి. తెలుగు,హిందీ సినిమాల్లో ఆయన పాడిన వాటిల్లో నేను రాసిన లిస్ట్ లోవే ఎక్కువగా ఇష్టపడతానండీ.
@జయ: వయసులో మార్పు గొంతులో కనపడని గొప్ప గాయకుల్లో ఆయనా ఒకరండీ...!
@నిషిగంధ: "సితారోం మే తూ హీ" ఆల్బం దొరికితే వినండి. పాటలన్నీ బావుంటాయి. కహా సే ఆయే బదరా..పాట విషయంలో మీమాటే నామాట..:)
నేను పాట వినటం కన్నా, ఆ పాటలు తెలిసినవాళ్ళతో ఆ కబుర్లు పంచుకోవటం నాకు ఎక్కువ ఆనందం ఇస్తుందండీ...ఇలా విచ్చేసినందుకు మీక్కూడా ధన్యవాదాలు.
@శ్రీలలిత: టపా నచ్చినందుకు ధన్యవాదాలండీ...
@వేణూ శ్రీకాంత్: మరి ఆ పాటలన్నీ వెతికి త్వరగా వినేయండీ..ఏవైనా దొరకకపోతే నే ఉండనే ఉన్నాను కదా..:) :)
kyuon hum bahaaronse, khushiyaan udhaar le......
kyuon na milke hum, apne jivan sanwaar le......
Tujho mere sur me sur milaale sang gaale to jindagee ho jaaye saphal.
One of the Best by Jesudas.చెవుల్లో అమృతమే అనుకోండి !!!!
Dheere dheere subah huyI...
jaag uThee zindagI.....మరో సుప్రభాతం గీతం భూపాల రాగం లో, ఆయన నోటివెంట....
ఈ రోజు పొద్దుటే హరివరాసనం పాట గుర్తు చేసుకున్నా ఆయన గొంతు నుంచి. మా సంగీతం మాస్టారు అదే చెప్పేరు కిందటి వారం. :-)
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవు గా పాట నా ఆల్ టైం ఫేవరేట్.
ఓపాప లాలి లో పాట కూడా అబ్బ ఎన్నని గుర్తు చేసుకోగలం..తల వంచి నమస్కరించటం అందరి తో కలసి జన్మ దిన శుభాకాంక్షలు తెలియ చేయటం తప్ప.
ఆయన పాడిన యువళ గీతాలు కొన్ని అంత గా నచ్చవు నాకు గీతా ఓ గీతా అంటే కిసుక్కున వ్వు వస్తుంది మళయాళ గీత కామోలు అని. కాని ఆయన మీద గౌరవం కొద్ది సైలంట్ గా వూరుకుంటా.
మీరు ఇప్పటివరకు రాసిన టపాలన్నిటిలోకి నాకు ప్రియాతిప్రియంగా నచ్చిన టపా ఇది. చాలా చాలా బాగుంది.
nireekshana loni "sukkalle tochave" anna paata naaku pichhi ishtam
@anveshita gaaru,@bhavana gaaru, @sunita gaaru,@గీత_యశస్వి gaaru,చాలా చాలా లేట్ గా బోలెడు ధన్యవాదాలు.
Post a Comment