సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, January 23, 2010
ऐ मालिक तेरे बंदे हम...
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో వి.శాంతారాం ఒకరు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లలో కూడా ఒకరు. ఆయన నిర్మించిన, నటించిన చాలా సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారాను . అయన చిత్రాల్లో "దో అంఖే బారః హాత్" కూడా నాకెంతో ఇష్టమైన చిత్రాల్లో ఒకటి .
"ఓపెన్ ప్రిజన్" పరిశోధనల ఆధారంతో,గాంధీయ సిద్ధాంతాలతో తయారైన చిత్రం ఇది.ఒక జైలర్ కొందరు ఖైదీలని జైలుకి దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళలో గొప్ప మార్పుని ఎలా తీసుకువచ్చాడన్నది ఈ చిత్ర కధాంశం. చాలా గొప్ప సినిమా. శాంతారామ్ చిత్రాలన్నింటిలో నాకు నచ్చిన సినిమా ఇది.ఈ చిత్రానికి బెర్లిన్ ఫిమ్ ఫెస్టివల్లో "సిల్వర్ బేర్" మరియు "గోల్డెన్ గ్లొబ్ అవార్డ్" కూడా వచ్చాయి. ఈ సినిమాలోని "ఏ మాలిక్ తేరే బందే హం.." నేను ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ వినే పాట.
Movie Name: Do Aankhen Bara Haath (1957)
Music Director: Vasant Desai
Lyrics: Bharat Vyas
singer: Lata
ऐ मालिक तेरे बंदे हम
ऐसे हो हमारे करम
नेकी पर चलें
और बदी से टलें
ताकि हंसते हुये निकले दम
जब झुल्मों का हो सामना
तब तू ही हमें थामना
वो बुराई करें
हम भलाई भरें
नहीं बदले की हो कामना
बढ चुके प्यार का हर कदम
और मिटे बैर का ये भरम
नेकी पर चलें ...
ये अंधेरा घना छा रहा
तेरा इनसान घबरा रहा
हो रहा बेखबर
कुछ न आता नज़र
सुख का सूरज छिपा जा रहा
है तेरी रोशनी में वो दम
जो अमावस को करदे पूनम
नेकी पर चलें ...
बडा कमझोर है आदमी
भी लाखों हैं इसमें कमीं
पर तू जो खडा
है दयालू बडा
तेरी कर कृपा से धरती थमी
दिया तूने जो हमको जनम
तू ही झेलेगा हम सबके गम
नेकी पर चलें ...
బ్లాగ్మిత్రులకు:
నా సిస్టం పాడయిపోవటం వల్ల వారం నుంచీ నేను బ్లాగ్ తెరవలేకపోయాను. కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరించకపోవటంవల్ల టపాలు రాయటానికి వేరే ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేకపోయాను. సిస్టం బాగు చేయిస్తే ఆరోగ్యం పట్ల అశ్రధ్ధ వహిస్తానని శ్రీవారు పి.సి.ని బజ్జోపెట్టే ఉంచేసారు :)
బ్లాగుల్లోని చాలా టపాలకు వ్యాఖ్యలు బాకీ ఉన్నానని ఇవాళ బ్లాగులు చూస్తే తెలిసింది....కానీ ప్రస్తుతానికి ఎవ్వరికీ వ్యాఖ్యలు రాయలేను...మిత్రులందరూ అన్యధా భావించద్దని మనవి.
ఆరోగ్యం పట్ల శ్రధ్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ఈ బ్లాగ్లో కొన్నాళ్ళు పాటు రెగులర్గా టపాలు ఉండవు. ఏ మాత్రం వీలున్నా వారం పదిరోజులకు ఒక టపా అయినా రాయటానికి ప్రయత్నిస్తాను...ఇంతకాలం వ్యాఖ్యలు రాసి,నా బ్లాగ్ చదివి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
అందరూ మెచ్చే ఎంతో మంచి పాటని మళ్ళీ గుర్తు చేసారు. తృష్ణా, ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ మంచి పోస్ట్ తో త్వరలో నే దర్శనమివ్వాలి మరి.
మంచి చిత్రం, పాట గుర్తు చేసారు. బాగుంది. రెస్ట్ తీసుకోండి. తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ...
Take care of your health! Get well soon and come back with a bang!
Krishna
చాలాఏళ్లక్రితం చూశాను ఈసినిమాని. నాకొలీగ్ సిస్టంలో ఉండి. ఓసారి సూసేస్తే పనైపోతుందనుకుంటా. తెలుగులో ఎన్టీఓడిది రీమేకుందికదా.
ఆరోగ్యం జాగ్రత్త తృష్ణ. మీకు వీలైనప్పుడే రాయండి.
శాంతారాం గారి గురించి మీ వంటి వారి దగ్గర నుంచి వినటమే తప్ప ఏమి చూడలేదు నేను.:-(
ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.. ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేయగలం..
వ్యాఖ్యలు బాకీ అనుకోడం ఆశ్చర్యం కలిగిస్తోంది నాకు..
ముందు ఆరోగ్యం , తరువాతే బ్లాగు .
శ్రధ తీసుకోవాలిసినంత అంటే ?
తృష్ణ గారూ !
మంచిపాట అందించారు. ధన్యవాదాలు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కోలికున్నాక శాంతారాం చిత్ర్రాల్ని, పాటల్ని ఒకటొకటిగా పరిచయం చెయ్యాలని కోరుకుంటూ.....
తృష్ణ గారూ,
ఆరోగ్యం జాగ్రత్త..! బాగా రెస్టు తీస్కోని మళ్లీ వచ్చి కబుర్లు చెప్పండి :)
వ్యాఖ్యలు రాసిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు...మీ అందరి అభిమానంతో తరచూ మళ్ళీ టపాలు రాస్తూండాలని కోరుకుంటున్నాను.
मेरे डेस्कटॉप पर आपके ब्लॉग के फॉण्ट नज़र नहीं आ रहे
nice geet
Post a Comment