క్రితం వారం అనుకుంటా ఒక హోటల్ కు డిన్నర్ కు వెళ్తే అక్కడ "దర్శకులు విశ్వనాథ్"గారిని చూడటం జరిగింది. బాగా దగ్గర నుంచి అదే చూడటం. అదివరకులా కాక బాగా సన్నబడ్డారు. వయసు ప్రభావం...వాకింగ్ స్టిక్ కూడా ఉంది చేతిలో..!ఆయన కుటుంబంతో కాబోలు ఉన్నారు. భోజనం అయిపోయి వెళ్పోతున్నారు. అందుకని ఇంక దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. కాకపోతే అన్ని గొప్ప సినిమాల సృష్టికర్త ను అలా "ఓల్డ్ ఏజ్"లో చూడలేకపోయాననే చెప్పాలి...ఏదో సినిమా మళ్ళీ తీస్తున్నారని వినికిడి.
ఆ తరువాత "వేటూరి"గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చానల్స్ వాళ్ళు ఆయనతో ఇంటర్వ్యూ లు ప్రసారం చేసారు. చాలా బాగా ,ఓపికగా మాట్లాడారు. ముఖ్యంగా తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, జాతీయ స్థాయిలో తెలుగు భాష ఎంతటి నిరాదరణకు,అలక్ష్యానికీ గురౌతోందో చక్కగా వివరించారు. ఆత్రేయగారి "నేనొక ప్రేమ పిపాసిని.." పాట గొప్పతనాన్ని ప్రతి వాక్యం, పదం గుర్తుచేసుకుంటూ చెప్పారు.
ఆయన ఇంకా రాస్తున్న కొత్త సినిమా పాటల వివరాలు చెప్పారు. చానల్ వాళ్ళు ఆయన రాసిన "సాంగ్స్ బిట్స్" వినిపించారు. అంతా బాగుంది కానీ,అయ్యో ఎంతటి మాహా రచయిత పెద్దవారైపోయారే అనిపించింది...
ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి "ఎనభై ఒకటి" సంవత్సరాలట.ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి 81సంవత్సరాలట. ఆ అద్భుత గాయనికి సాటిలేరెవరూ అనుకున్నాను.
అక్కినేని అవార్డ్ సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూంటే 87ఏళ్ల మనిషి ఆరోగ్యం పట్ల ఎంత శ్రధ్ధ తీసుకుంటారో అని అబ్బురం కలిగింది. ఆయన డిసిప్లీన్ , ఆరోగ్యం పట్ల ఆయన చూపే జాగ్రత్త చాలా మందికి మార్గదర్శకం కావాలి అనుకుంటూ ఉంటాను అస్తమానం.
ఈ మహామహులందరూ కారణ జన్ములు. ఎవరికి వారే "యునీక్" అనిపించింది. బాగా రాసేవారూ, పాటలు పాడేవారూ ,బాగా నటించేవారూ, సినిమాలు తీసేవారు చాలా మంది ఉన్నారు.. ఇంకా వస్తారు కానీ , పైన రాసిన మహామహులందరిని రీప్లెస్ చేసేవారు మాత్రం ఎవ్వరూ ఉండరు...పుట్టరు అనిపించింది. ఇటువంటి మహానుభావులెందరికోసమో నేమో త్యాగయ్యగారు అన్నారు..."ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు.." అని.
****************************
బ్లాగ్మిత్రులకు:
నా సిస్టం బాగవకపోవటం వల్ల బ్లాగులు చూసి చాలా కాలమైంది...! నాకొక బ్లాగుందని నేనే మర్చిపోతానేమో అని ఇన్నాళ్ళకు ఇలా ఓ టపా రాసే ప్రయత్నం చేసాను. తరచూ చూసే బ్లాగులు చూడకపోయినా నాకు బాధే. బ్లాగుల పట్ల నాకున్న మక్కువ అటువంటిది. వీలున్నప్పుడెప్పుడో మిస్సయిన టపాలన్ని చదువుతాను.
టపాలు తగ్గిపోయినా "తృష్ణ"ను మర్చిపోకండేం...!
11 comments:
తృష్ణ గారూ !
కారణజన్ములపై మీ అనుభూతుల్ని పంఛడం బావుంది. ముఖ్యంగా విశ్వనాథ్ గారిని గుర్తుచేసి నా అనుభవాల్ని, అనుభూతుల్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
నిజమేనండీ వారంతా కారణజన్ములే ! "ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు.."అప్పటి మాట!"కొందరే మహానుభావులు...వారిలో కొందరికే వందనములు " ఇది ఇప్పటి మాట అనుకోవాలేమో ...
వచ్చే వయసుని ఎవరూ ఆపలేరు కదండీ.. కానీ నిజమే ఒక్కోసారి ఏదో తెలియని బెంగ అనిపిస్తూ ఉంటుంది.. విశ్వనాధ్ గారు చాలా బాగా మాట్లాడతారట.. ఈసారి అవకాశం దొరికితే మిస్సవకండి..
మహానుభావులని తలచుకుంటూ మంచి టపాతో చాలారోజులకి....బాగుందండి!
అవును , వాళ్ళు కారణ జన్ములే అనిపిస్తుంది .
మిమ్మలిని అస్సలు మరచి పోము . బెంగ పడకండి .ఆరోగ్యం ఎలావుంది ?
ఎందరో మహానుభావులు. ఇంకా ఎంతో మంది మహానుభావులున్నారు, కదూ! మీ సిస్టం బాగాలేదా...ఇంకా మీ హెల్త్ బాగాలేదేమొ అనుకుంటున్నాను.
బాగున్నారా తృష్ణ. ఆరోగ్యం ఎలా వుంది. పూర్తి గా కోలుకునే వరకు జాగర్త గా వుండండి.
అవును విశ్వనాధ్ గారు, వేటూరి, లత మంగేష్కర్ గారు వీళ్ళందరు కారణజన్ములు. నిజమే. ఈ రోజు పొద్దుటే స్వరాభిషేకం లో పాటలు వింటూ ఆయనను తలచుకున్నాను. మొన్నీ మధ్య న బాలు గారి పాడుతా తీయగా (పేరు అదేనా? మారిందా?) లో విశ్వనాధ్ గారిని ఇలానే వాకింగ్ స్టిక్ తో చూసి అనిపించింది. ఆ రోజు సిరిసిరి మువ్వ లో పాటలనుకుంటా గుర్తు చేసుకున్నారు. మంచి టాపిక్ మీద రాసేరు.
వ్యాఖ్యలు రాసిన మిత్రులకుపేరు పేరునా ధన్యవాదాలు ధన్యవాదాలు.చాలా సణ్తోషమైంది మీ వ్యాఖ్యలు చూసి..! జయగారూ, సిస్టం ఇంకా బాగవలేదంటే... నాకు ఇంకా బాగవలేదనే కదండి..:)
మావారంత నన్ను తేలికపదకుండా నన్ను వదుల్తారా...:)
ఇవాళ రాసినందుకే రెండు గంటలు పట్టింది . బోలెడు నీరసం వచ్చింది.కాబట్టి,ఈ బ్లాగ్వియోగం నాకు ఇంకొన్ని నెలలు తప్పదు...మధ్య మధ్య వీలైతే రాయటానికే ప్రయత్నిస్తాను....!
ఇప్పుడే హరివరాసనం పాట వింటూ అయ్యో ఏమిటీ తృష్ణగారు ఈ మధ్య కనపడటం లేదు, ఒక వేళ ఫీడ్ సరిగా పని చేయడం లేదేమో అనుకుంటూ మీ బ్లాగ్ ఓపెన్ చేశాను. ఈ టపా చూడటం బాగుంది. విశ్వనాధ్ గారిని ఈ మధ్య చూసి నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. కానీ ఎంతవారైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదు కదా.. అన్నట్లు మీ ఆరోగ్యం జాగ్రత్తండీ.. పూర్తిగా తగ్గాకే మళ్ళీ మొదలెట్టండి. మేమెవ్వరం మర్చిపోము :-)
ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం
Hellow trishnagaru, na peru lakshmi
me blog one week back nundi chustunna. rajahmundry gurunchi chaduvutunte namanasuki chala hai anpinchindi. anta baga cheppinanduku chala thanks andi
Post a Comment