సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, February 20, 2010

రాగ సుధారస



వాగ్గేయకారులలో నాకెంతో ఇష్టమైన "త్యాగయ్య" కృతులను కొన్నింటినైనా బ్లాగ్లో రాయాలని సంకల్పం. జనవరి నెలలో ఒకటి రాసాను. ఇది నాకు నచ్చిన మరొక కీర్తన...
బాలమురళిగారు పాడిన ఈ కీర్తన ఇక్కడ వినవచ్చు:




త్యాగరాయ కృతి
రాగం: ఆందోళిక
తాళం: ఆది

ప: రాగ సుధారస పానము చేసి - రంజిల్లవే ఓ మనసా (ప)
అ.ప : యాగ యోగ త్యాగ - భోగఫల మొసంగే (ప)

చ: సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తు - లని త్యాగరాజు తెలియు (ప)

నా కర్ధమైన అర్ధము:

ఓ మనసా! రాగమనెడి అమృతమును సేవించి రంజిల్లుము. ఇది యాగము, యోగము, త్యాగము, భోగము మొదలైన భోగముల ఫలములను అందిస్తుంది. నాదము సదాశివమయమైనది.ఓంకారూపమందు నిలిచిన ఆ నాదమే రాగమైయింది. ఈ సత్యానెరిగినవారంతా జీవన్ముక్తులు అన్నది త్యాగరాజు తెలుసుకున్న సత్యం.

10 comments:

SRRao said...

తృష్ణ గారూ !
మంచి కీర్తన... మంచి తాత్పర్యం... మంచి గాత్రం... రాగసుధారసాన్ని పంచారు.

జయ said...

చాలా బాగుంది తృష్ణా, కొంచెం అప్పుడప్పుడు ఇలాటి కీర్తనలు వినిపిస్తూఉండండి.

తృష్ణ said...

SR Rao garu, jaya garu,

thankyou verymuch for the comments..

భావన said...

బాగుంది తృష్ణా. మీ ఆరోగ్యం జాగర్త.

తృష్ణ said...

@భావన : మొన్నటి టపాకు దీనికీ మీ వ్యాఖ్య రాకపొయేసరికి బెంగ పెట్టేసుకున్నానండి..ఏమిటో రాయలేదు..అని...ఇప్పుడే రెండు వ్యాఖ్యలు చూసాను..చాలా సంతోషమైంది...! నేను రెగులర్గా వ్యాఖ్యలు రాసేవాళ్ళకు రాయలేకపోయినా,నాకు వాళ్ళ వ్యాఖ్యలు రాకపొయినా అలానే బెంగపడతాను నేను..

Bhãskar Rãmarãju said...

ఈ కీర్తన ఏదో సినిమలో విన్నానే?? ఆపాత మధురాల్లో...ఏసినిమనో తెలియజేయ గలరా?

తృష్ణ said...

భాస్కర్ గారు, అది "మిస్సమ్మ" సినిమా లోది. సావిత్రి పిల్లలకు సంగీతం పాఠాలు చెప్తూ నేర్పిస్తూండగా పడుతుంది.

తృష్ణ said...

భాస్కర్ గారు, చాలా రోజులకు మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమైందండి... thankyou verymuch.

Pranav Ainavolu said...

చాలా బాగుందండి :)

sweeyapraneetham said...

adbhuthamayna keerthana, bhaavam kuda sarigga viviarincharu ee keerthanani malli sarigamalu cinemalo kuda vinipincharu (vineetha-rambha)