సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 26, 2010

ఎవరు నువ్వని?


కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న
అమాయకత్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
గారాల పాపాయిని అంది.

పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న
రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.

కళ్ళనిండా కాటుకతో
కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
విరబుసిన మందారాన్ని...కన్నెపిల్లని అంది.

చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే
ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.

అధికారంతో ఆ చేతులకు
రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.

సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ
వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.

పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న
సిగ్గులమొగ్గను అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.

మెడలో మెరిసే మాంగల్యంతో
తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.

వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో
తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.

విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ
కలహాలను దాటుకుని
పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా..
కలకాలం అతని వెంట
జంటగా నిలిచే భార్యను అంది.

నెలలు నిండుతున్న భారంతో
చంకలో మరో పాపతో సతమతమౌతున్న
సంఘర్షణ నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.

అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ
పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
నా చిన్నారులకు మొదటి గురువుని అంది.

ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

29 comments:

Unknown said...

Really Superb. pentastic. Oka stri ki inni stages untai ani teliyachesina or gurthuchesina meeku danyavaadaalu.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఈబ్లాగులోని టపాలన్నింటిలోకి ఇదే బెస్ట్

మా ఊరు said...

బావుందండి కవిత

శిశిర said...

చాలా బాగుందండి.

మిర్చి said...

Wow. Wonderful.

Padmarpita said...

Beautiful....

జయ said...

చాలా చక్కని భావాల అనుభవాలు. అవి ఎలాగు మున్ముందుకు కొనసాగుతూనే ఉంటాయి. చక్కటి వ్యక్తీకరణ. ఇప్పుడు ఒడిలోని పసిపిల్లలు రేఫు ఇవే ప్రశ్నలు తల్లిని అడిగినప్పుడు ఈ అనుభవాల పాఠాలే తల్లి ప్రేమతో వారికి వివరిస్తుంది. ఈ రోజుల్లో భవిష్యత్తు పిల్లలే చక్కగా రూపొందించుకుంటున్నారు.
భవిష్యత్తులో నేనేమౌతానమ్మా అని అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానాన్ని తల్లి ఇవ్వాలి.
I tell them wait and see
what ever will be will be,
the future is not asked you see...
what will be will be....
అన్న "కేసొరా" సమాధానం ఇప్పుడు రాదు.
నాకిది చాలా చా....లా నచ్చింది తృష్ణ.

శ్రీలలిత said...

చాలా చాలా చాలా బాగుంది..

శేఖర్ పెద్దగోపు said...

nice one...

భాస్కర రామిరెడ్డి said...

చాలా బాగుంది తృష్ణగారూ.

Kalpana Rentala said...

తృష్ణ,
సింపుల్ గా కవితా బాగుంది. ఇలాగే మీరు ఇంకా మంచి మంచి కవితలు రాస్తూ వుండాలని కోరుకుంటూ..

ప్రణీత స్వాతి said...

ప్రస్తుతం అక్కడిదాకా వచ్చి ఆగారన్నమాట.
పొందికైన పదాలల్లి ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా పరిచయం చేశారండీ మీ గురించి. సింప్లీ సూపర్బ్!!

SRRao said...

తృష్ణ గారూ !
బాగుంది. మీ పరిణామ క్రమ భావజాలం. ఆ క్రమం ఇంకా సాగి మీ కలం మీ భావాలను వ్యక్తీకరించాలని కోరుకుంటూ.....

Bhãskar Rãmarãju said...

:):) శుభాకాంక్షలు!!

ప్రియ said...

:)

nice

వీరుభొట్ల వెంకట గణేష్ said...

ఇప్పటి వరకు మీరు వ్రాసిన వాటిల్లో ఇది బెస్ట్.
Generally, I don't read 'కవితలు'.
After second visit, I read carefully.

Somasekhar said...

Chaalaa baavundandi....kluptamga, ramyamgaa oka mahila jeevana gaadha. Kaadu, kaadu, mahila jeevitam lo pradhamaardha gaadha. Hope you collect many more such rich experiences as you move along in life. And that you also find time to share each of those with us in such beautiful and expressive language.

అఖిల్ said...

మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......

పరిమళం said...

బావుంది తృష్ణ గారు ...చివరిపేరా ఐతే మరీనూ :)

తృష్ణ said...

తరచూ టపాలు రాయట్లేదని వ్యాఖ్యలు కూడా తగ్గిపోయాయా అని నేను మధనపదుతున్న సమయంలొ ఈ కవితకు లభించిన స్పందన నన్నెంతో ఆనందపరిచింది. వ్యాఖ్యలు రాసిన బ్లాగ్మిత్రులు

సంధ్య
చైతన్య
మా ఊరు
శిశిర
మిర్చి
పద్మార్పిత
జయ
శ్రీ లలిత
శేఖర్
భాస్కర్ రామి రెడ్డి
కల్పన
ప్రణీత స్వాతి
ఎస్.ఆర్.రావు
భాస్కర్ రామరాజు
ప్రియ
గణేష్
అఖిల్
సొమ శేఖర్
పరిమళం

అందరికీ నా అభిమానపూర్వక ధన్యవాదాలు.

ఏమాత్రం ఓపిక ఉన్నా అందరికీ పేరు పేరునా జవాబులు రాస్తున్నాను. ఇలా ఎప్పుడైనా పేరుపేరునా జవాబులు రాయలెకపోతే అన్యధా భావించవద్దని "తృష్ణ" మనవి.

తృష్ణ said...

జయగారూ, "కేసరా సరా" పాట మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.నాకూ ఇష్టం ఆ పాట.

తృష్ణ said...

అలానే చాలా రోజులకు వ్యాఖ్యలతో ఆనందపరిచిన బ్లాగ్మిత్రులు మా ఊరు, పద్మార్పిత గారూ,
భాస్కర్ రామి రెడ్డి గారికీ, కల్పన గారికీ, భాస్కర్ రామరాజు గారికీ ప్రత్యేక ధన్యవాదాలు.

మరువం ఉష said...

అన్నీ రాసారు...

మరి "తృష్ణ" ని యేమీ ప్రశ్నించలేదా?
నేనవరో తెలియదా..
నీ ప్రశ్నలన్నిటికీ నేనే సమాధానం అనేది. :)

మనిషిలోని ఆ తృష్ణేగా వివిధరూపాల్లో వెల్లువయేది.

బాగుంది.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు

తృష్ణ said...

@ మరువం ఉష:
@ కొత్తపాళీ:
చాలా చాలా ధన్యవాదాలు...

Srujana Ramanujan said...

హహహ. భలే రాశారు. మళ్ళీ మళ్ళి చదివించింది కవిత.

తృష్ణ said...

@Srujana: thank you..thankyou..and thankyou...!

Unknown said...

asalu ii kavitha super andi...

naku okka sari idi chaduvuthuu unte..ammamma.com serial title song gurthochindi..andulonuu ilage aada pilla prathii stage explain chestaru kada....

kinda line chaala chaala bagunnai

ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

Arun Kumar said...

బావుందండి కవిత