
"పుత్రోత్సాహం" లాగ పుత్రికోత్సాహం నాలో పొంగి పొరలింది మొన్నటి రోజున...ఎందుకంటారా? వాళ్ళ స్కూలు ఏన్యువల్ డే సందర్భంగా జరిగిన ఫంక్షన్లో మా ఐదేళ్ల పాప మొదటిసారి స్టేజి ఎక్కి "వెల్కం డాన్స్" చేసింది. భయపడకుండా, ధైర్యంగా, నవ్వుతూ, కాంఫిడెంట్గా..! నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...బహుశా వాటినే పెద్దలు ఆనందభాష్పాలు అంటారేమో..
ఆ రోజు పాప పుట్టినరోజు కూడా అవ్వటం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. సమయానికి మావాళ్ళెవరూ ఊళ్ళో లేకపోయారు. అమ్మ,తమ్ముడు మాత్రం రాగలిగారు.
కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. కానీ మా పాపకు మొదట్లో పుట్టిన ఐదు నెలల్లో రెండు ఆపరేషన్లు జరగటం...ఆరునెలలుదాకా నిద్రాహారాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మనుషుల్లో పడిన పిల్ల అవటంవల్ల మాకు అందరికీ అదెంతో అపురూపం. అలా కళ్ళలో పెట్టుకు పెంచినపిల్ల ఇవాళ స్టేజి మీద డాన్స్ చేస్తూంటే మరి ఆనందమేగా. నాలోని నెగెటివె పోయింట్స్ రాకుండా అన్నీ మంచి గుణాలను అది పుణికిపుచ్చుకోవటం అదృష్టమే అనుకుంటాను. భగవంతుని దయ వల్ల పాప మంచి చదువు చదివి తన కాళ్ళపై తాను నిలబడాలని నా ఆకాంక్ష.
ఇదంతా బాగుంది కానీ తెర వెనుక కధ కూడా రాయాలని...
డాన్సు ప్రాక్టిసు కోసం నెల రోజులనుంచీ స్కూలువాళ్ళు పిల్లలను తెగ తోమేసారు. హోం వర్క్ లేదు చదువు లెదు. డాన్సులే డాన్సులు. పిల్ల ఇంటికి వచ్చి కాళ్ళు నెప్పులని గొడవ. ప్రొగ్రాం రోజున మూడింటికి పిల్లలను పంపమంటే పంపాము. నాలుగున్నరకు కార్యక్రమం మొదలౌతుందంతె నాలుగింటికే వెళ్ళి కూర్చున్నాము. స్టేజి తయారి దగ్గర నుంచీ కుర్చీలు వేయటం దాకా అంతా చూస్తూ దోమల చేత కుట్టించుకుంటూ కూర్చుంటే....ఏడున్నరకు మొదలెట్టారు. గెస్ట్ లందరి స్పీచ్లు అయ్యి కల్చురల్ ప్రోగ్రాంస్ మొదలయ్యే సరికీ ఎనిమిది దాటింది.
అదృష్టవశాత్తూ మా పాపది వెల్కం డాన్స్ అవటం వల్ల ముందు అది అయిపోయింది. కాని మొత్తం అయ్యేదాకా పిల్లలను పంపము అన్నారు. వంట్లో బాలేదు అంత సేపు కూర్చోలేను మొర్రో అని మొత్తుకున్నా వినరే...! మొత్తానికి ఎలాగో బ్రతిమిలాది నీరసంతో ఇంటికీ రాత్రి వచ్చేసరికీ పది అయ్యింది.
పుత్రికోత్సాహం సంగతి ఎలా ఉన్నా ఇంకెప్పుడు ఇలా డాన్సులకు పంపకూడదు అని నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి.కానీ తరువాత పాప ఇష్టపడి చెస్తాను అంటే చేసేదేముండదని తెలుసు..:) ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేము కదా. కాకపోతే ముందుగానే పర్మిషన్లూ అవి తీసుకుని ఉంచుకోవాలి అనుకున్నాము.
చలిలో పిల్లలను స్టేజీ పక్కన కూర్చోపెట్టారు.పిల్లలకు చలి+ దోమలు కుట్టేసి దద్దుర్లు. 4,5 గంటలు ఆకలితో ఉన్నారని మనకు బాధ తప్ప వాళ్ళకు ఆ ఉత్సాహంలో ఆకలే తెలియలేదు...:)
23 comments:
తృష్ణ గారూ !
మీ పాప డాన్స్ ఫోటో చూపించాల్సింది. మేం కూడా ఆనందించేవాళ్ళం ! మీ పాపకు ఆశీస్సులు.
ఇదేముంది ముందింకా ఉందిగా. ఒక్కసారి కళ్ళల్లో పడితే పదో తరగతిదాకా వదలరు స్కూల్లో. పతి ఫంక్షనుకీ మీరు ఆదోమల్తో దోస్తీకట్టాల్సిందే. ఆపై ఆనందభాష్పాలు రాల్చాల్సిందే. అన్నీదాటుకునే ఇక్కడికొచ్చాం.
వీడియూ తీసి పెట్టాల్సింది కదండీ..మీ పాప బుజ్జి బుజ్జిగా చేసిన వెల్కం డాన్స్ మేమూ చూసేవాళ్ళం...మీ పుత్రోత్సాహం మాకూ కళ్ళకు కట్టినట్టు కనపడిదండీ టపా చదువుతుంటే...
"భగవంతుని దయ వల్ల పాప మంచి చదువు చదివి తన కాళ్ళపై తాను నిలబడాలని నా ఆకాంక్ష."
మీ ఆకాంక్ష నెరవేరాలని మీ పాపకు ఆశిస్సులు. అలానే అంత కష్టపడి చేసినందుకు అభినందనలు కూడా.
Wishing her GOOD LUCK and BRIGHT FUTURE.
మీ పాపకి ఆశీస్సులు.
GOD Bless her.
Good post...Good luck to her.
అమ్మాయి డాన్స్ విడియో పెట్టి ఉంటే మేమూ చూసి ఆనందపడేవాళ్ళంకదా!
అయ్యో! పిచ్చితల్లీ, ముందు ముందు స్కూల్ ప్రోగ్రాంస్ తో ఎన్ని తట్టుకోవలో. అనుభవంతో చెప్తున్నా. కొంచెం తొందరగా హెల్త్ బాగా చేసుకుంటే మంచిది మరి.
:)
మా పాప ,ప్రతీ సంవత్సరమూ స్కూల్ లోజరిగే ప్రోగ్రాంస్ లో పాల్గొంటుంది .మీరనట్టే ఆకలిగా ఉంటుందని ఏవైనా స్నాక్స్ తీసుకెల్లి పెడితే తినదు .మేకప్ పోతుంది అటుంది.వాళ్ళకి ఆటైంలో ఆకలి,దాహమూ ఏమీతెలియదు .వాళ్ల ఐటెం కోసం ఎంతో ఉత్సాహం గా ఎదురుచూస్తూ ఉంటారు .అయ్యో ఏమీ తినలేదు అని మనం బాదపడాలికానీ వాళ్ళదేమీ ఆలోచించరు .
మీపాపకి నా అభినందనలు తెలపండి .అలాగే లేటుగా ఐనా లేటెస్టుగా మీ పాపకి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి.
ఇంటికి రాగనే మీ పాపకి దిష్టి ( ద్రుష్టి) తీసేశారా?....
Nice. Yes. Once fallen into their eyes, not easy to escape. I too wish her a gr8 career, satifying both to you, the parents, and to the child :-)
రావుగారు,మా తమ్ముడు వీడియో తీసాడు కానీ నా కంప్యూటర్ లేదు కదండీ అందుకని పెట్టదం కుదరలేదు.
చైతన్యా,ముందు ముందు ఆ బాధ ఉండకూడడనే కోరుకుంటున్నాను.
శేఖర్ గారు, పైన రావు గారికి రాసానండి.నా సిస్టం బాగవకపొవటం వల్ల పెట్టలేకపొయానండి.
వేణూ శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు.
సృజన గారూ, ధన్యవాదాలు.
హరేఫల గారు, ధన్యవాదాలు.
ప్రేరణ గారు, ధన్యవాదాలు.
విజయమోహన్ గారూ, ఎందుకు పెట్టలేకపోయానో పైన రాసానండీ...ధన్యవాదాలు.
జయగారు, అంతం కాదిది ఆరంభం అని భయపెడ్తున్నారా...:)
thanks for the concern అండీ..
సుజ్జిగారు, ధన్యవాదాలు.
రాధికగారు, మామూలుగానే అన్నం తినతానికి తిప్పలు పెట్టే పిల్లలకు ఉత్సాహంలో ఆకలి తెలియదండీ..మీరన్నట్లు మనం అయ్యొ అనుకోవాల్సిందే...thanks for the birthday wishes.
@ RAYS: దిష్టి తీయకుండా నే అసలు ఉండనుగా...:)
@ G : నిజమే...అసలీసారి కూడా వాళ్ళే సెలక్ట్ చెసుకున్నారు.మేము పేరు ఇవ్వనేలేదు...thankyou for the wishes.
మీ పాపకు జన్మదిన శుభాకాంక్షలండి .
ఆలస్యం గా పోస్ట్ చూసి , ఆలస్యం గా చెబుతున్ననందుకు సారీ .
mala gaaru, thankyou verymuch..
పాప కు జన్మ దిన శుభాకాంక్షలు తృష్ణా.. మీ పుత్రికోత్సాహం మాకు కూడా మురిపం దానితో ఒక చిరునవ్వు ను రప్పించింది. :-) ఆరోగ్యం జాగర్త. జయ అన్నట్లు ఎన్నో మీకోసం ఎదురు చూస్తుంటాయి మరి. నేనైతే ఆ స్టేజ్ దాటి మా అబ్బాయి కి డ్రైవర్ వుద్యోగం చెయ్యటం లో బిజీ గా వున్నా. ;-)
@bhaavana: thankyou verymuch...
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చమెత్తుకునే పిల్లలకు చదువు వసతి కల్పించాలని మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించారు.
పసికందులతో భిక్షాటన
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్ లైన్)కు ఫోన్ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.
అప్పుల బాల్యం
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=439892&Categoryid=1&subcatid=33
Post a Comment