సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, May 31, 2009

స్వాతంత్ర్యం ..

స్త్రీ కి స్వాతంత్ర్యం ఎప్పుడు?
చిన్నప్పుడు 'అటు వెళ్ళకు' 'ఇటు వెళ్ళకు' అంటారు..
పెద్దయ్యాక 'అలా చేయకోడదు ఇలా చేయకూడదు' అంటారు ..
ఇక పెళ్ళయ్యాక 'భర్త,అత్తమామలు చెప్పినట్టు నడుచుకోవాలి' అంటారు..
పిల్లలు పుట్టాక సరే సరి --వాళ్ళు ఎలా చెప్తే అలా ఇవాల్టి రోజున చెయ్యక తప్పుతుందా?
జీవితంలో కొన్ని రోజులైనా తనకు కావాల్సిన విధంగా స్త్రీ కి జీవించడం సాధ్యమా?
నిజంగా అలాంటి స్వాతంత్ర్యం వచ్చినా,ఆ సమయానికి జేవితం చివరిదశకు వచ్చేస్తే
ఇక ఆ స్వాతంత్ర్యానికి ఊపయోగం ఏం ఉంటుంది?

Saturday, May 30, 2009

అంతరంగం ..

కొత్త పిచ్చోడు పొద్దెరగనట్టు,
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ...రోజంతా నా బ్లాగుని చూసుకుని నేనే మురిసిపోతున్నాను .
ఎవరైనా చూస్తున్నారో లేదో తెలీదు కానీ నేను మాత్రం పోస్టింగులు తెగ చేసేస్తున్నాను బ్లా బ్లా బ్లా అని .
ఆయినా నేను బ్లాగు పెట్టుకున్నది ఎవరి కోసం?
నేను కూడా ప్రపంచంతో పాటూ నడుస్తున్నాను అన్న సంతృప్తి కోసమే కదా ..!
ఇంక ఎవరైనా చూస్తే ఏమిటి ?చూడకపోతే ఏమిటి?
కోయిల ఎవరో వింటారని కూస్తుందా?పువ్వు ఎవరో చూస్తారని పూస్తుందా ?
నేనూ అంతే ...నా కోసం నేనే బ్లాగుకుంటున్నాను !!!

మనసంతా నువ్వైనా వేళ







మనసంతా నువ్వైన వేళ ..
ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే

ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే

రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే

మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే

నీ గమనంలో
ఆ మౌనంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!

ఆకాశమంత ...

"ఆకాశమంత" --ఒక మంచి సినిమా చాలా రోజులకి...
ప్రతి తండ్రి -కూతురు తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా !!
ప్రేమతో ,అభిమానంతో ,కొద్దో గొప్పో గారంతో పెరిగిన చాలమంది ఆడపిల్లలు అత్తగారింట్లో ఎందుకనో ఒక కోడలిగానే చూడబడతారు.... ?!

Friday, May 29, 2009

pot painting


glass painting


cross-stich on a bedsheet


pot painting


అప్పుడు...ఇప్పుడు ...


అప్పుడు .....
పొద్దున్నే కాఫీ తాగుతూ పేపర్ చదవటం ...
వర్షం వస్తే బాల్కనీ లో ఉయ్యాలలో మంచి మ్యూజిక్ వింటూ కూర్చోవటం ...
birthday అంటే ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవటం ...పుట్టినరోజు అంటేనే హడావుడి .
పోస్ట్లో వచ్చిన గ్రీటింగ్స్ లెఖ్ఖ పెట్టుకోవటం ...ఆ రోజు వచ్చిన ఫోన్ calls note చేసుకోవటం ...
పాదం మీద చిన్న పగులు వస్తే,అమ్మో అని అది పోయే వరకూ క్రీములు అవీ రాసేసి అది తగ్గే దాకా బోలేడు కేర్ తీసుకోవటం .
మొహానికి రకరకాల ఫేసుప్యాక్స్ అవీ వేసుకుని ఎంతో శ్రధ్ధ తీసుకోవటం...
ఇంట్లో ఉన్నంత సేపూ ఎప్పుడూ టేప్ రికార్డర్ మోగిస్తు ఉండటం...

ఇంక ఫిర్యాదులు :
"లిస్ట్ లో రాసిన ఐటెమ్స్ కన్నా ఒక్క వస్తువు సూపర్ మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చినా అమ్మ ఎందుకని కసురుకుంటుంది..?"
" పనులు చెప్తూనే ఉంటుంది అమ్మ..."
"Extra money.. అంటే ..budget లేదు అంటుంది అమ్మ..."
"ఆప్పడాలు లేకుండా అన్నం తిననని చెప్పాను కదా?"
" ఈ కూర ? నాకు వద్దు"
" కొంచం అన్నం మిగిలింది తినమంటే ..నాకు వద్దు."
ఇప్పుడు....

రోజు మొత్తంలో newspaper చదివే తీరిక ఏది ?
వర్షం వస్తోంది రా అమ్మ అని పాప పిలిచినా వెళ్ళే తీరిక ఏది ?
ఇప్పుడు పాదం అంతా పగుళ్ళే!కానీ ఏదో అశ్రధ్ధ.
ఇప్పుడు కావాల్సిన పాట పెట్టుకుని వినాలి అనే ఆసక్తే తగ్గిపోయిన్ది.
ఇప్పుడు ఎల ఉంటే ఏమిటిలే అనే నిరాసక్తి...
supermarket list లో ఏవైనా వస్తువులు తగ్గించాలా అని పది సార్లు ఆలోచన.. .
"కొంచం అన్నం మిగిలింది ఈ కాస్త తినేయమని అని నేనే బ్రతిమాలటం .కడుపులో ఖాలీ ఉంటే నేనే తినేయటం "
"రోజూ ఆప్పాడాలు వేయించాలా?"
ఏ కూర అయినా తను తింటే చాలు అదే నేను తినేయటం .
పని చేసుకుని చేసుకుని ఉన్నాక ఎవరైన కాస్త సాయం చెస్తే బాగుంటుంది అనిపిస్తుంది..

ఇలా ఎన్నో...ఇంకెన్నో..
ఇప్పుడు అమ్మ బాగా అర్ధం అయ్యింది...
ఇప్పుడు అమ్మ అంటే చాల ఇష్టం...
ఇప్పుడు అమ్మ చేసిన త్యాగాలు ,పడిన బాధలు అన్నీ బాగా అర్ధం అవుతున్నయి !!
People and their opinions do change with circumstances and situations around..
Here iam ...a live example of my above statement!!

Thursday, May 28, 2009

మనసులో మెదిలాయి ...


మనసులో మెదిలాయి ...
మనసులో మెదిలాయి ఆనాటి ఆశలు...
కలలు కన్నఆ కళ్లు
రాగం పలికిన ఆ స్వరం
రంగులు పరిచిన కుంచలు
రంగవల్లులు వేసిన వాకిళ్ళు
ఆట పాటల కేరింతలు
ఘుమఘుమల రుచులు
ఆత్మీయుల మన్ననలు
స్నేహితుల అభిమానాలు
పుస్తకాలకే పరిమితమైన పరిధులు ...
మనసులో మెదిలాయి ఏవో మధురానుభూతులు !!
ఆదర్శాలు ఆలోచనలు
నిర్ణయాలు వాటి నిమజ్జనాలు
ఆవేశాలు ఉద్వేగాలు
నిరాశలు వాటి నిట్టూర్పులు ...
మనసులో మెదిలాయి ఆ నిస్సహాయతలు !!

కలల నుంచి కాగితం పొరల్లోకి జారి
అక్షరం నుంచి ఆవిరైన ఆశలవైపు
జాలిగ చూసాయి కనుమరగైన సంకల్పాలు
నిలకడ లేని నిశ్చయాలను వెక్కిరించాయి
వివేచన చేయగల అంతరంగాలు
చేవలేని ఆక్రోశాలని చీత్కరించాయి
ఆలోచనల హ-హ కారాలు..
మనసులో మెదిలాయి నా పిరికితనపు కసరత్తులు...!!