సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 2, 2011

బుక్ మార్క్స్ & గ్రీటింగ్స్


చాలా రోజుల క్రితం greetings గురించి, కొన్ని హాబీల గురించి టపాలు రాసాను. నిన్న బజ్లో మళ్ళీ గ్రీటింగ్స్ గురించి కబుర్లు వచ్చేసరికీ నాకు పాత గ్రీటింగ్స్ అన్నీ చూసుకోవాలనిపించింది. తీరా వాటిని చూశాకా ఫోటోస్ తీసి దాచుకుందాం పాడయిపోకుండా ఉంటాయి అనిపించింది. ఇక ఫోటొలు తీసాకా..టపాలో పెట్టేద్దాము బ్లాగులో దాచుకున్నట్లుంటాయి అనిపించింది..:) గ్రీటింగ్స్ అంటే సరదా ఉన్నవాళ్ళు ఓసారి అన్నీ చూసేసి నాలాగే ఆనందించేయండి.


క్రింద ఉన్నవి రకరకాల బుక్ మార్క్స్. అప్పట్లో పుస్తకాలు బాగా చదివేదాన్ని కాబట్టి బాగా వాడేదాన్ని. ఏ కొత్త రకం వచ్చినా కొనేయటం ఒక సరదా.





ఇవీ కొన్ని లెటర్ పాడ్ సెట్స్ ,

హేండ్ మేడ పేపర్ తో చేసిన ఈ సెట్ వాడకుండా దాచుకున్నా..



గ్రీటింగ్స్ తయారుచేయటానికి రంగురంగుల హేండ్ మేడ్ పేపర్స్ . (చాలా కాలం న్యూ ఇయర్ కి, పుట్టినరోజులకు మిత్రులకు బంధువులకు గ్రీటింగ్స్ తయారు చేసి పంపేదాన్ని..)


కాలేజీ రోజుల్లో కొత్త గ్రీటింగ్ కార్డులు వస్తే ఇవ్వటానికెవరూ లేకపొయినా తలో రకం కొనేసేదాన్ని. అప్పట్లో బుల్లి బుల్లి గ్రీటింగ్ కార్డులు వచ్చాయి. ఏ షాప్ లో దొరికితే అక్కడ దొరికినన్ని రకాలు కలక్ట్ చేయటం ఒక హాబీ. క్రింద ఫోటోలోవి ఆ బుల్లి బుల్లి కార్డల కలక్షన్..





















ఇవీ గిఫ్ట్ల మీద బెస్ట్ విషెస్ రాసే కార్డ్లు..








"ప్రబోధా బుక్ సెంటర్లో" ఇన్స్పిరేషనల్ మెసేజెస్ ఉన్న బుక్స్ దొరికేవి . మంచి మంచి సీనరీలు ఉండి కొటేషన్స్ కూడా బావుండేది ఈ బుక్స్ లో.. క్రింద ఉన్నవి ఆ పుస్తకాలు..







ఇంక నా కలక్షన్లోని పెద్ద గ్రీటింగ్స్ పెట్టటంలేదు..వాటితో ఒక చిన్న సైజు కొట్టు పెట్టచ్చేమో ..:))







14 comments:

SHANKAR.S said...

ఇన్ని గ్రీటింగులా అమ్మ బాబోయ్. తృష్ణ గారూ అప్పట్లో మ్యూజికల్ గ్రీటింగులు కొత్తగా వచ్చాయి గుర్తుందా?

గోదారి సుధీర said...

ఎట్లాగూ పెట్టారు కదా ,పెద్ద గ్రీటింగ్స్ కూడా పెట్టెయ్యక పోయారా ...ఎంత బాగుందో కలక్షన్ ..నాకూ ఈ ఇష్టం ఉండేది .కానీ దాచుకోలేక పోయాను .

కృష్ణప్రియ said...

వావ్! చాలా జాగ్రత్త చేసారు. మిగిలినవి కూడా చూపించండి. ఇది చూసాక అనిపిస్తుంది. నావన్నీ ఎప్పుడో ఎక్కడో పోయాయి.. దాచుకోవాల్సింది అని:-(

మాలా కుమార్ said...

మీ కలెక్షన్ చాలా బాగుందండి . చాలా ఓపికగా దాచుకున్నారు .

ఇందు said...

నాకు అన్నిటికంటే ఆ బుక్మార్క్స్ భలే నచ్చాయి :) ఎంత ముద్దుగా ఉన్నాయో! నాదగ్గరా బోలెడు గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయ్! ఎవరికీ ఇచ్చేద్దానికాదు అలా కొన్నవి :) కానీ మీలాగే తయారుచేసి ఇచ్చేదాన్ని :) ఈ విషయంలో మీకు,నాకు బోలెడు సిమిలారిటీస్ ఉనాయ్ :)

Saahitya Abhimaani said...

"ప్రబోధా బుక్ సెంటర్" బలే గుర్తు చేసారు. మా చిన్నప్పుడు, ఒక ఆస్త్రేలియన్ నడిపేవాడు ఆ షాపుని. ఆయనతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇంగ్లీష్ పుస్తకాలు, మాగజైనులు చూడటానికి వెళ్ళేవాళ్ళం. పుస్తకాలు అక్కడే కూచుని ఎంతసేపు చూసినా, ఏమీ అనేవాడు కాదు సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో ఆ షాపుని! ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి చూడాలి.

హరే కృష్ణ said...

Wow!
చాలా బావుంది తృష్ణ గారు
ఇంత మంది ప్రేమతో పంపించే అభిమానం ముందు వేరే ఏ ఆనందం ఉండదని అనిపిస్తుంది.
చిన్నప్పుడు బొమ్మలకొలువు చూసాను ఆ ఫీలింగ్ వచ్చింది
So nice

Sujata M said...

So sweet. అసలు మీ బ్లాగే చాలా అందమైన గ్రీటింగ్ కార్డు లా వుంటుంది. మీ టేస్ట్ కి ఫిదా అయిపోయిన వాళ్ళలో నేను ముందుంటాను.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయ్ తృష్ణ గారు.. గోల్డెన్ కలెక్షన్ కదా బుక్ మార్క్స్ భలే సేకరించారు :-)

తృష్ణ said...

@శంకర్.ఎస్: అవును అప్పట్లో కొన్ని కొన్నానండి నేను కూడా.

@గోదారి సుధీర: చిన్న కార్డులు ఫోటొకి వస్తాయండి.పెద్దవాటికి ఎన్నని ఫోటొలు తీయనూ..అందుకే పెట్టళేదు.పైగా అవి పూర్తిగా మేటర్ ఉన్న కార్డులు. పైది చదివాకా లోపలి మేటర్ చదవాలంటే కుదరదు కదా..:)


@కృష్ణ ప్రియ: ఏదో గ్రీటింగ్స్ మీడ ప్రేమ కొద్దీ టపా రాసాను కానీ ఏం చేసుకుంటామండీ ఇప్పుడు..ఇంకా నాకు మిత్రులు బంధువులు పంపిన గ్రీటింగ్స్, రాసిన ఉత్తరాలూ మరో రెండూ పెట్టెలు ఉన్నాయి..అవన్నీ పడేయలేను దాచలేను..:((

తృష్ణ said...

@ మాలా కుమార్ : పాత గ్రీటింగ్స్ టపాలో లెటర్ ప్యాడ్స్ కోసం మీరు ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవారో రాసిన గుర్తు ఉందండి..

@ ఇందు: మనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి..:))

@శివరామ ప్రసాద్ కప్పగంతు: ప్రబోధా" ను మేము చదువుకునేప్పుడూ ఒక ఫాదర్ నడిపేవారు. వైట్ రోబ్ వేసుకుని అక్కడే తిరుగుతూ ఉండేవారు. అక్కడ గ్రీటింగ్స్ కన్నా బుక్స్ చాలా బావుండేవి..

తృష్ణ said...

@ హరే కృష్ణ: 'బొమ్మల కొలువు..' :) థాంక్స్..

@ sujata: మీరు ములగ చెట్టేంకించేసారాయే..దిగటం కష్టంగా ఉందండీ..:)

తృష్ణ said...

@venu srikanth: అప్పట్లోని టీనేజ్ పిచ్చిలలో ఇదీ ఒకటి..:)) thanks.

Manasa Chamarthi said...

ప్రబోధా బుక్ సెంటర్లో బుక్మార్క్స్ కి నేను చాలా పెద్ద అభిమానిని.
ఒక సమయంలో పుస్తకాల కంటే అవే ఎక్కువగా ఉండేవి. మా అక్కకి , స్నేహితులకి, బుద్ధి పుట్టినప్పుడల్లా నేనిచ్చే బహుమతి అదే.

మధురమైన జ్ఞాపకాలు కదిలించారు.థాంక్స్! :)