సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, August 24, 2011

సంగీతప్రియులకు తాయిలం - "స్వర్ణయుగ సంగీత దర్శకులు"



తెలుగు పాటలపై అత్యంత ప్రేమ కలిగిన సంగీతప్రియులు ఏదైనా పాత పాట గురించో, ఫలానా పాట పాడిన గాయని గాయకుల గురించో, ఆ పాట తాలూకూ సంగీత దర్శకులెవరో తెలుసుకోవాలన్నా.. నాకు తెలిసీ అంతర్జాలంలో మనం మొదట వెతికేది "చిమటమ్యూజిక్.కాం"లోనే. ఆ వెబ్సైట్ అధినేత శ్రీ చిమట శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో తయారై, చిమటమ్యూజిక్.కాం వారిచే పబ్లిష్ చేయబడిన పుస్తకమే "స్వర్ణయుగ సంగీత దర్శకులు". ఈ పుస్తకానికి అక్షర రూపాన్ని అందించింది, ఆ అక్షరాల వెనుక అవిరామ కృషి చేసినది శ్రీ పులగం చిన్నారాయణ గారు.


ఇంతకు పూర్వం 'హాసం ప్రచురణల' ద్వారా ప్రచురిచబడిన " జంధ్యామారుతం" రెండు భాగాలు, ఆ తర్వాత 75 మేటి చిత్రాల తెర వెనుక కబుర్లతో తయారైన వారి రెండవ పుస్తకం "ఆనాటి ఆనవాళ్ళు" 2009లో 'ఉత్తమ సినీ గ్రంధం'గా రాష్ట్ర ప్రభుత్వ 'నంది' అవార్డ్ ను అందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జీవిత ప్రస్థానం "సినీ పూర్ణోదయం" తరువాత పులగం చిన్నారాయణ గారికి ఇది నాలుగవ పుస్తకం. ఈ పుస్తకం కోసం, పలువురు సంగీత దర్శకుల వివరాల కోసం చిన్నారాయణ గారు చేసిన కృషి, పడిన కష్టం ప్రతి పేజీ లోను కనబడుతుంది. అన్ని అపురూపమైన చిత్రాలను కలక్ట్ చేయటానికి ఎంత కష్టపడి ఉంటారో అనిపించింది ఆ ఫోటోలను చూస్తూంటే.

ఈ పుస్తకంలో ఏముంది?

సీనీసంగీతజగత్తులో గాన గంధర్వులు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంగారికి అంకితమిచ్చిన ఈ పుస్తకంలో 1931-1981 వరకూ తెలుగు సినీపరిశ్రమను, తెలుగు పాటను అత్యంత ప్రభావితం చేసిన ఒక ముఫ్ఫై మంది సంగీత దర్శకుల గురించిన వివరాలు, వారి జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానం, వారి వృత్తిపరమైన ఒడిదొడుకులు, వారి తాలుకు కొన్ని అరుదైన ఫోటోలు, వారు స్వరాలందించిన కొన్ని చిత్రాల పేర్లు, వారు స్వరకల్పన చేసిన పాటల జాబితాలు...మొదలైన అపురూపమైన విశేషాలు ఉన్నాయి. ముందుగా డా.సి.నారాయణరెడ్డి గారు, రావు బాలసరస్వతిగారు, పి.సుశీల గారు, కీరవాణి గారు, కౌముది.నెట్ ఎడిటర్ శ్రీ కిరణ్ ప్రభ మొదలైన వారి సంతకాలతో కూడిన అభినందనలు ఉన్నాయి. వీరిలో మధురగయని జానకి గారి అభినందనలు లేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా పుస్తకరూపానికి సహాయ సహకారాలు అందించిన మరికొందరు మిత్రుల అభినందనలు కూడా ఉన్నాయి. వారిలో మన బ్లాగ్మిత్రులు నిషిగంధ గారి శుభాకాంక్షలు కూడా ఉండటం మనకు ఆనందకరం.


ఇక పుస్తకంలో ప్రస్తావించబడిన ముఫ్ఫై మంది సంగీత దర్శకులు ఎవరంటే...
1. హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి
2. గాలి పెంచల నరసింహారావు
3. భీమవరపు నరసింహారావు
4.ఓగిరాల రామచంద్రరావు
5. సాలూరి రాజేశ్వరరావు
6. చిత్తూరు నాగయ్య
7. బాలాంత్రపు రజనీకాంతరావు
8. మాస్టర్ వేణు
9. సుసర్ల దక్షిణామూర్తి
10. సి.ఆర్.సుబ్బరామన్
11. ఘంటసాల
12. సాలూరి హనుమంతరావు
13. పెండ్యాల నాగేశ్వరరావు
14. ఆదినారాయణరావు
15. అశ్వత్ధామ
16. టి.వి.రాజు
17. ఎమ్మెస్ విశ్వనాథన్
18. తాతినేని చలపతిరావు
19. భానుమతి రామకృష్ణ
20. బి.గోపాలం
21 రమేష్ నాయుడు
22. రాజన్-నాగేంద్ర
23. కె.వి.మహదేవన్
24. ఎస్.పి.కోదండపాణి
25. జి.కె.వెంకటేశ్
26. సత్యం
27. జె.వి.రాఘవులు
28. చక్రవర్తి
29. ఇళయరాజా
30. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


తన పుస్తకాన్ని మనతో ఆసాంతం ఆసక్తికరంగా చదివించగల విభిన్నమైన శైలి పులగం చిన్నారాయణగారిది. ఏభైఏళ్ళ సినీప్రపంచపు సంగీతాన్ని గురించి, తెలుగు పాటల గురించీ, వాటి వెనుక ఉన్న సంగీత దర్శకుల తాలుకూ మనకు తెలియని జీవిత వీశేషాలను పొందుపరిచిన "స్వర్ణయుగ సంగీత దర్శకులు" పుస్తకం తెలుగు పాట పై అత్యంత అభిమానమున్న సంగీతప్రియులందరూ అపురూపంగా దాచుకోవాల్సిన తాయిలమే.


అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యమవుతున్న ఈ పుస్తకం వెల 500 రూపాయిలు.

11 comments:

నైమిష్ said...

చిమటా మ్యుజిక్ లో ,ఈ పుస్తకంలో ఇళయరాజా గురించిన ఫుల్ చాప్టర్ చదివి వెంటనే ఈ పుస్తకం కొనేసా..చాలా బాగుంది..ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు..పులగం చిన్నారాయణ గారికి శుభాబివందనములు..

SHANKAR.S said...

"హేమా హేమీలు" అన్న పదానికి అర్ధం ఎవరైనా అడిగితే ఈ కవర్ పేజ్ చూపించచ్చేమో. లిస్టు లో ఉన్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలి ఫోటో కూడా కవర్ మీద వేసి ఉంటే బావుండేది. యమర్జంటుగా ఈ పుస్తకం కోనేస్కోవాలి

SRRao said...

తృష్ణ గారూ !

మంచి పుస్తకం గురించి మంచి సమీక్ష. ధన్యవాదాలు.

తృష్ణ said...

@ నైమిష్: ఇళయ్ మాత్రమే కాదు, రమేష్ నాయుడు గురించి, ఇంకా మరికొందరి గురించీ కూడా ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయండీ.
ధన్యవాదాలు.

@శంకర్.ఎస్: భలే పాయింట్లూ పడతారండీ..నిజమే కదా. కొనేయండి వెంఠనే మరి..
ధన్యవాదాలు.

@ఎస్.ఆర్.రావు: నేను కేవలం 'పరిచయాలే' రాస్తానండి.నా బ్లాగ్లోవేమీ సమీక్షలు కావు. ఏదైనా పుస్తకం చదవగానే నాకు కలిగిన ఆలోచనలు, కొత్త పుస్తకాని చూడగానే దాని గురించి చెప్పాలని..అంతేనండీ.
ధన్యవాదాలు.

Indira said...

అంత అతృష్ణ గారు,నమస్తే.అలవాటు లేక తెలుగు లో రాయడం కొంచెం కష్టం గా వుంది.పుస్తకం చాలా బాగుంది కానీ ధర మాత్రం ఎక్కువగా అనిపించింది.అంత బౌండు,లంకరణ తగ్గించి తక్కువ ధర కి ఇవ్వగలిగితే అందరికీ అందుబాటు లో ఊండీదనిపించింది

తృష్ణ said...

@ఇందిర: నిజమేనండి నాకు అనిపించింది. రెండు మూడు కొందామని వెళ్ళినదాన్ని ఇదీ, మరోటి రెండే కొని వచ్చేసాను. ధన్యవాదాలు.

ChimataMusic said...

Trushna gaaru,

Thanks for your kind book review and I would really appreciate it.

Thanks Nishi gaaru for sending me this link.

@Indira gaaru,
About the book price:
Thanks for your feedback on the book price. I wanted this book to be unique from other books. When I was in India (to release this book), I realized that a decent lunch would cost up to Rs.300.00 in Hyderabad. I started wondering if this kind of book is not worth a couple of lunch meals!! I see that more than 250,000 unique users from India visit my web site every month and I hoped that selling the first batch of 2000 books would be an easy task.. but our very own "beloved Telugu music lovers" proved me wrong! :)

I would take an opportunity to share (with you all) the actual book expenses in this context. If we sell a book through Visalandhra, they would take up to 40 - 45% commission and give me only 55 - 60% on each book.. so, I would get only Rs.275 or 300 back per copy from the Book Sales centers such as Visalandhra. This Rs.300 would barely cover up the "book printing" expenses, leave alone the how much we spent on Author's research, collecting rarely available vintage pictures from different sources, his travel expenses (to Chennai, Bangalore along with multiple places in AP), remuneration to the author, holding the Book Release function with bigwigs such as SP Balu, S Janaki etc and SP Balu's Orchestra and so on and so forth!! I am not complaining here about any thing - just wanted to share you all these "real" facts!!

I would like to add another point here too. This book should have, in fact, been published by some film music directors to preserve the Telugu music history. We (Pulagam and myself) met a few film people and music directors in Hyd after the book had been released.. except for Keeravani, no one really seemed to know the value of the book and it was certainly a "rude shock" for me!!

But I don't regret publishing the book at all, irrespective of a big financial burden. I am thankful to all my friends (I acknowledged them in my foreword), who stepped forward to share some of it.

Thanks,
Srini Chimata
ChimataMusic.com
chimata.music@gmail.com

తృష్ణ said...

శ్రీనివాస్ గారూ, మీరు వ్యాఖ్య రాయటం చాలా సంతోషకరం. ఇంత మంచి పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చినందుకు మరోసారి అభినందనలు. వెల విషయంలో మీరు చూపెట్టిన కోణం పాఠకులకు తెలియనిది...కానీ పుస్తకం కొనాలనుకునే అందరూ ఆ వెలకు కొనుక్కోలేకపోవచ్చు కదా అన్నదే సందేహం అండి..

ఈ పుస్తకం విలువ తెలిసినవారు, సంగీతప్రియులు, తెలుగు పాటపై అమితమైన ప్రేమ ఉన్నవాళ్ళు తప్పక ఈ పుస్తకాన్ని కొనుక్కుంటారండీ. నిషిగంధ గారికి, మీకూ మరోసారి ధన్యవాదాలు.

తృష్ణ said...

శ్రీనివాస్ గారూ, ఇందాకా మరొక విషయం మర్చిపోయనండీ..పుస్తకం కొనగానే మేము అనుకున్నామండీ హోటల్ లో భోజనం చేస్తే ఇంత ఖర్చు అవ్వదా? ఇంత విలువైన పుస్తకానికి, ఇందులోని సమాచారానికీ ఈ ధర సమమైనదే...అని. నవోదయావాళ్ళు ఇంకా ఏభై రూపాయిలు తగ్గించి ఇచ్చారని ఆశ్చర్యపోయాం కూడా. ఈ సంగతి నేను టపాలోనే రాయాల్సినది..!

Indira said...

తృష్ణ గారు,చిమట శ్రీనివాస్ గారి జాబు చూశాను.ఆయన రెస్పాన్సు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.మనం మన కోణం నుంచి ఆలోచిస్తాం.నిజానికి ఇదొక బ్రుహత్కార్యం.ఖచ్చితంగా ప్రశంసించి తీరవలసిందే.మీ బ్లాగు ద్వారానే నా ఆలోచన తెలియచేస్తాను.నేను దాదాపుప్రతినెలా కొంత మొత్తం నాకు నచ్చిన పుస్తకాలు కొనడానికి కేటయిస్తాను.షాపు కి వెళ్ళగానేమంచి పుస్తకాలు 4,5,కనబడతాయి.గొల్లపూడి,ముల్లపూడీ వారివి కొనేసరికే వెయ్యి అయ్యాయి.ఇంకా కొనాలనుకున్నవి ఉన్నాయి.మళ్ళీ వెళ్ళెసరికి ఆ పుస్తకాలు లేవు.ఇప్పటికి దొరకలేదు.నిజమే,హొటలు కు వెళితే కనీసం 1000 అవుతున్నది.కానీ ఇంత మంచి పుస్తకం ఇన్ని వ్యయ ప్రయాసలకొర్చి తెచ్చింది అందరికీ అందుబాటులో వుండి అందరు కొనిచదువుతున్నప్పుడే కదా ఫలితం దక్కేది.ఎమెస్కొ వారివి కొన్ని పునర్ముద్రణ చేసినప్పుడు ఇదివరకంటే పెద్ద సైజులో ఎక్కువ ధరలో వుండటం చూసి, పాత సైజు లోనే వుంచి కొంచెం ధర తగ్గించవచ్చు అనిపించినమాట నిజం.ఇంకో సంగతి,పుస్తకం పరిమాణం పెద్దదైన కొద్దీ ఆ బరువుకి ఎక్కువసేపు పట్టుకుని చవలేం.ఏదిఏమైనా ఇలాంటి మంచి ప్రయత్నానికి మీ వంటివారి కృషి,అభిరుచి,సమయాన్ని కేటాయించడం, మనసారా అభినందించి తీరవలసినదే.నా బాధల్లా ఇంకొంచెం ఎక్కువ మందిలోకి మీ పుస్తకం వెళ్ళాలనే.

Anonymous said...

మంచి పుస్తకం. గత జూన్ లో విజయవాడ వెళ్ళినపుడు కొన్నాను ఈ పుస్తకం.
ఈ పుస్తకం గురించి గతంలో బాలు గారు కూడా ఒక టపా వ్రాసారు.
http://kothikommachchi.blogspot.com/