సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, August 14, 2011

'షమ్మీ' జ్ఞాపకాలు ..




ఆదివారం సాయంత్రం వచ్చే దూరదర్శన్ హిందీ సినిమాల కోసం పడిగాపులు పడుతూ ఎదురు చూసే రోజుల్లో ఒకరోజు టివిలో "జంగ్లీ" సినిమా వచ్చే ఆదివారం అని ఏడ్ చూసి నాన్న మమ్మల్ని తెగ ఊరించేసారు. ఇక మేమూ చాలా ఎక్సైట్ అయిపోయి ఆ సినిమా కోసం ఎదురు చూసాం. సినిమా మొదలైంది. ఇదేమి హీరో నాన్నా అసలు బాలేడు అన్నాను. సినిమా మొత్తం చూసి మాట్లాడు అన్నారు నాన్న. సినిమా పూర్తయ్యేసరికీ నాకు షెమ్మీ కపూర్ ఎక్కడా కనబడలేదు...ఆ సినిమాలోని రాజవంశీయ యువరాజు పాత్ర తప్ప. అంత లీనమయ్యేలా ఉంది అతని నటన. మొదటి భాగంలోని సీరియస్ నటనకూ, రెండవ భాగంలోని హుషారు పాత్రకూ ఎంత తేడానో. ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు నవ్వు అన్నది ఎరుగని అతని సీరియస్ మొహం చూసి నవ్వకుండా మనం ఉండలేము. అలానే హీరోయిన్ పరిచయం అయ్యాకా చలాకీగా మారిపోయిన అతని వైనం చూసి మనమూ సరదా పడకుండా ఉండలేము. ఆ సినిమాలో అన్నీ పాటలూ ఎంత బావుంటాయో." ऎह्सान तेरा हॊगा मुझ पर.. दिल चेह्ता है वॊ केहनॆ दॊ.." అని పాడుతూంటే కరిగిపోని ప్రేమికురాలు ఉంటుందా? అనిపిస్తుంది. రాజ్ కపూర్ కి ముఖేష్ వాయిస్ అతికిపోయినట్లు, షమ్మీ కపూర్ కి రఫీ గాత్రం అతికిపోయింది.

ఇక ఆ తర్వాత టివీలో షమ్మీకపూర్ సినిమా ఎప్పుడు వచ్చినా వదలలేదు మేము. అలా మంచి మంచి సినిమాలను, "చిత్రహార్" ద్వారా పాటలనూ పరిచయం చేసిన దూరదర్శన్ కు ఎంతైనా ఋణపడిపోయామనిపిస్తుంది నాకు. రాజ్కపూర్ సినిమాల్లో నేను టివీలో చూసినవి Junglee, kashmir ki kali, An evening in paris, Brahmchari, Teesri manzil, Andaz, Dil tera deewana, Prince, Pyar kiya to darna kya, Raj kumar, Dil deke dekho, Janwar, Professor, Tumse achcha kaun hai మొదలైనవి. ఇవన్నీ హిట్సే. ముఖ్యంగా kashmir ki kali, Teesri manzil , An evening in paris మొదలైనవి చాలా బావుంటాయి. వాటిల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్స్. కపూర్ కుటుంబంలో తమ్ముడు శశి కపూర్ లాగ అందగాడు కాకపోయినా, అన్న రాజ్ కపూర్ లాగ బహుముఖ ప్రజ్ఞాశాలి కాకపోయినా నటనలో తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకునీ, ఇది షమ్మీ కపూర్ స్టైల్ అనేంతటి ప్రత్యేక స్టైల్ నూ, తనకంటూ ఒక క్రేజ్ నూ, ఫాలోయింగ్ నూ ఏర్పరుచుకున్నాడు షమ్మీ. పాటల్లో అతడు చేసే విన్యాసాలూ, అచ్చం జంగ్లీ లాగ ప్రవర్తించే తీరూ మనల్ని సరదా పెడతాయి, నవ్విస్తాయి. షమ్మీ సినిమాల్లో 'wooing' (నాయిక ప్రేమను పొందటం కోసం కథానాయకుడు చేసే ప్రయత్నం) చాలా ఆసక్తికరంగా ఉండేది. ఈ పాత్ర ఇతనే చెయ్యాలి అనిపించేలాగ. అలా ఇంకెవ్వరు చెయ్యలేరు కూడా. అందువల్లే అలనాటి ప్రముఖ హీరోల్లో ప్రత్యేక స్థానం అతడిది.

పొద్దున్నే వార్తల్లో షమ్మీ కపూర్ గురించి చూసి అయ్యో..ఈ మధ్యన ఇలాటి వార్తలే వింటున్నామే అనిపించింది. అయినా..విని నిట్టూర్చటం మినహా ఏం చెయ్యగలము? మనిషి జన్మ ఎత్తిన ప్రతివాళ్లం ఎప్పుడో అప్పుడు వెళ్లకతప్పదు కదా..! ఏదో నా తృప్తి కోసం అతడిని ఈ విధంగా తలుచుకుంటున్నా..! షమ్మీ హిట్ సాంగ్స్ లోని పల్లవులతో చాలా కొత్త హిందీ సినిమాల టైటిల్స్ రావటం ఒక విశేషం. షమ్మీ కపూర్ సినిమాపాటల్లో నాకు బాగా ఇష్టమైన పాటలు కొన్ని...

* आजा आयी बहार, दिल है बॆकरार..ऒ मेरॆ राज कुमार [raj kumar]
* तुम्नॆ किसि की जान कॊ जातॆ हुयॆ दॆखा है..वॊ दॆखॊ मुझ सॆ रूठ कर मॆरी जान जा रही है..[raj kumar]
* तुम्नॆ पुकारा और हम चलॆ आयॆ [raj kumar]
* इस रन्ग बदल्ती दुनिया में [raj kumar]


* आज कल तेरॆ मेरॆ प्यार के चर्चॆ हर जबान पर.. [brahmchari]
* मैं गावूं तुं सॊजावॊ..सुख सप णॆं मॆं खॊ जावॊ.. [brahmchari]
*दिल कॆ झरोकॆ मैं तुझ कॊ बिठाकर [brahmchari]


* आवाज़ दॆकॆ हमॆ तुम बुलावॊ..मोहॊब्बत में इत्ना न हम कॊ सतावॊ [professor]
* ऎ गुल्बदन ऎ गुल्बदन..फॊलॊं की मेहेक, कटॊं की चुभन [professor]
* खुली पलक मॆं झूठा गुस्सा बंद पलक मॆं प्यार [professor]


* Yahoo...Yahoo..चाहॆ कॊइ मुझॆ जंगली कहॆ.. (Junglee)
* अय्यय्या करू मैं क्य सूकू सूकू (Junglee)
* ऎह्सान तॆरा हॊगा मुझ पर..(Junglee)
* नैन तुम्हारॆ मजॆदार ऒ जनाबॆ आली [Junglee]

* अकॆलॆ अकॆलॆ कहा जा रहॆ हॊ [An evening in paris]
* Title song [An evening in paris]
* आस्मान सॆ आय फरिश्ता प्यार का सबक सिखलानॆ [An evening in paris]
* मॆरा दिल है तॆरा, तॆरा दिल है मॆरा [An evening in paris]


* बदन पॆ सितारॆ लपॆटॆ हुयॆ..ऒ जानॆ तमन्ना किधर जा रही हॊ
जरा पास आवॊ तॊ चैनाजायॆ (prince)

* दिल उसॆ दॊ जॊ जान दॆ दॆ, जा उसॆ दॊ जॊ जान दॆदॆ (Andaaz)

* लाल छडी मैदान खडी, क्या खूब लडी क्या खूब लडी [jaanwar]

* दीवाना मुझ सा नही [teesri manzil]
* तुम्नॆ मुझॆ दॆखा हॊ कर मेहर्बा [teesri manzil]
* आजा आजा मैं हू प्यार तॆरा [teesri manzil]
* ऒ मॆरॆ सॊन रॆ सॊना रॆ सॊना रॆ [teesri manzil]
* ऒ हसीना जुल्हॊ वाली जानॆ जहा [teesri manzil]


* ये चान्द स रॊषन चेहरा, यॆ झील सी नीली आखॆं (kashmir ki kali)
* दीवाना हुवा बादल ऎ दॆख कॆ दिल झूमा (kashmir ki kali)
* इषारॊं इषारॊं मॆं दिल दॆनॆ वालॆ (kashmir ki kali)
* बार बार दॆखॊ हजार बार दॆखॊ (kashmir ki kali)
* है दुनिया उसी की जमाना उसी का...(kashmir ki kali)

* हम और तुम और यॆ समा (Dil deke dekho)
* Tilte song (Dil deke dekho)
* बॊलॊ बॊलॊ कुच तॊ बॊलॊ (dil deke dekho)

* तुम मुझॆ यू भूला न पावॊगॆ (paglaa kahIkaa)

* तुम्सॆ अच्चा कौन है (janwar)
* लाल छडी (janwar)

* तुमसा नही दॆखा (tumsa nahi dekha)
* जवानिया यॆ मस्त मस्त बिन पोयॆ (tumsa nahi dekha)





షమ్మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.



10 comments:

SHANKAR.S said...

నేను కూడా చాలా వరకు షమ్మీ కపూర్ సినిమాలు దూరదర్శన్ లో చూసినవేనండీ. మీరన్నట్టు రాజ్ కపూర్, శశి కపూర్ లని చూసిన కళ్ళతో షమ్మీ కపూర్ ని చూస్తే అస్సలు నచ్చడు. కాశ్మీర్ కీ కలీ, జంగ్లీ, ప్రొఫెసర్ నాకు బాగా నచ్చిన సినిమాలు. ముఖ్యంగా జంగ్లీలో పాత్ర స్వభావం లో క్రమంగా మార్పు రావడం బాగా చూపించాడు. నా ఫేవరేట్ మ్యూజిక్ డైరక్టర్ ఓ.పి.నయ్యర్ సంగీతంలో షమ్మీ కపూర్ కి ఉన్నన్ని సూపర్ హిట్ పాటలు బహుశా ఇంకెవరికీ లేవేమో. ఓ.పి.నయ్యర్ మ్యూజిక్ లో ఉన్న ఒక చిన్న గమ్మత్తైన హస్కీ నెస్ రఫీ గొంతులో పలుకుతూంటే దానికి షమ్మీ కపూర్ అభినయం ఈ మూడూ కరెక్ట్ గా సరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇండియాలో యాహూ సైట్ షమ్మీ కపూర్ చేత లాంచ్ చేయించడం నాకు బాగా గుర్తుంది. అప్పట్లో అది షమ్మీ కపూర్ సొంత సైట్ అనుకునే వాడిని. "యాహూ" అన్న అరుపు/పదం మీద తనకున్న హక్కు అలాంటిది మరి :))

ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

వేణూశ్రీకాంత్ said...

షమ్మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

శ్రీనివాస్ పప్పు said...

చాలా బాగుంది తృష్ణ గారూ మీ "జ్ఞాపకాలు"

పోయినోళ్ళందరూ మంచోళ్ళు,ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులూ,అని ఆత్రేయ చెప్పినట్టు,షమ్మీ నటించిన సినిమాలు అందులోని సన్నివేసాలూ,ఆ పాటలే మనకి ఆయన తీపిగురుతులు ఇంక.

యశోదకృష్ణ said...

షమ్మి లేడని నాకు కూడా చాలా బాధగా ఉంది. I like his dancing style.

కృష్ణప్రియ said...

మీరు చాలా బాగా రాశారు. జంగ్లీ, దూర్ దర్శన్ లో చిత్రహార్ అనుభవాలు.. అచ్చం మీరు చెప్పినట్టే నేను పాత సినిమాల్లో సీరియస్ హీరోయిజం చూసి చూసి, షమ్మీ సినిమా అంటే ఎంత హాయిగా ఉండేదో.. ఆ పాటలు, డాన్స్, డైలాగులు, వూయింగ్..

పద్మవల్లి said...

మొన్న వారంలోనే రఫీ పాటలు చూస్తుంటే, మెజారిటీ అన్ని షమ్మీ పాటలే. అప్పుడే పాత రోజులు అన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. అంత తిప్పుకుంటూ డాన్సులు చేసినా కూడా, ఇంపుగా ఉండే వాళ్ళు ఇంకొకరు దొరకరు. (చింపూ కపూర్ ని ఏదో పాటలో చూసి, షమ్మీ ఏమో అని పొరబడ్డాను కాసేపు. తనకి కొంచెం ఆ చార్మ్ వచ్చినట్టుంది.) అప్పుడే అనుకున్నాను ఎప్పుడో వీళ్ళందరూ మనల్ని వదిలేసి మాయమయిపోయే సమయం దగ్గర పడుతుందని దిగులేసింది. :-((((

రవికిరణ్ పంచాగ్నుల said...

జ్ఞాపకంగా మిగిలిపోయిన షమ్మీకపూర్‌ని బాగా గుర్తుచేసారు కృష్ణప్రియగారు.

ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

తృష్ణ said...

@ శంకర్.ఎస్: ఓ.పి.నయ్యర్ గురించి మీరు అన్నది నిజమే. నాకూ ఆయన పాటలు బాగా నచ్చుతాయి. షమ్మీ ప్రత్యేకతకు ఈ పాటలు కూడా ప్రధాన కారణాలు..ధన్యవాదాలు.

@ వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.

@ శ్రీనివాస్ పప్పు: only memories remain..కాలం ఒడిలో జారిపోయిన మరో సినీతార..ప్చ్..!
ధన్యవాదాలు.

తృష్ణ said...

@ గీత_యశస్వి: ఎవరో బ్లాగ్మిత్రులు అన్నట్లు షమ్మీ పాతలకి కొరియోగ్రఫీ చెయ్యగలగటమే పెద్ద కష్టమైన పని ! అసలు కుదురుగా ఒక్క క్షణం నిలబడితేగా...జంగ్లీ..:)) loved his dancing gestures !
ధన్యవాదాలు.


@కృష్ణప్రియ: సరిగ్గ చెప్పారు..హాయిగా నవ్వుకోవాలంటే షమ్మీ సినిమాలే చ్భూడాలి..
ధన్యవాదాలు.

తృష్ణ said...

@ పద్మవల్లి: ఎవరయినా ఎన్నాళ్ళూంటారు..ప్చ్...ఇంతేనండీ జీవితం !
ధన్యవాదాలు.

@ రవికిరణ్: నేను 'కృష్ణప్రియ' .కాదండీ ..'తృష్ణ '.:))
ధన్యవాదాలు.