సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, April 11, 2011

కొన్ని కాపీ(తెలుగు) పాటలు - వాటి ఒరిజినల్ పాటలు


తెలుగు సామెతలు ఎంతో సందర్భోచితంగా భలేగా ఉంటాయి. 'తీగెలాగితే డొంకంతా కదిలిందని' ఎవరన్నారో కానీ భేషుగ్గా చెప్పారు. గోలీమార్ చిత్రం లోని "మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు" పాట గురించి సంగీతప్రియ బ్లాగ్లో టపా పెడదామని ఆ పాట గురించిన చిన్న వెతుకులాట చేసేసరికీ యూట్యూబ్ లో మరెన్నో తెలుగు కాపీ పాటలు వాటి ఒరిజినల్ ట్యూన్స్ బయట పడ్డాయి.

వీటిల్లో కొన్ని పాటల ఒరిజినల్స్ తెలుసు కానీ ఇన్ని ఒరిజినల్స్ ఉన్నాయని తెలీదు.
 యూట్యూబ్లో ఆ పాటలు పెట్టిన "03aparajita"గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటిల్లో కొన్ని కాపీలని తెలుసు కానీ తెలియనివి చాలానే ఉన్నాయి. మీరూ ఓ చూపు వేసేయండిక్కడ:


17 comments:

ఆ.సౌమ్య said...

కెవ్వు కేక...బలే సంపాయించారండీ....ఎన్ని పిల్లుల్లో మన సినీ ప్రపంచంలో. చక్రి, మణి శర్మ అయితే మరీ దొంగ పిల్లులు. కీరవాణి కూడానా..ఇది నమ్మలేకుండా ఉన్నాను.

brahma said...

ENGLISH songs ni copy chesthe telisipothundani french, german, spanish etc., languages nunchi kooda copy chesesthunnaru.

'''నేస్తం... said...

Nenu kuda bore kodithe ilantivi vethukuthuntanu.. Manisarma, keeravaanila (ex: Chathra pathi) back ground musics and some songs also copied. Arundhathi movie lo fight etc. Chalane unnai..

ఆ.సౌమ్య said...

ఆ చత్రపతి పాట కాపీ కొట్టబడిన సినిమా ఏమిటో చెప్పగలరా? ఒరిజినల్ పూర్తిగా వినాలని ఉంది. అదేమైనా జర్మన్ సినిమానా? మాతృక ఏమిటో తెలియజేయగలరు.

తృష్ణ said...

@ఆ.సౌమ్య: అదొక German theme అని రాసారు. ఈ లింక్ లో చూడండి.Also seethe comments in this link(down the song)

http://www.youtube.com/watch?v=tCfZy5rxTF4

Lalitha said...

Please listen to this Cliff Richard's song from 60's & haffun ;) It is the mother tune of "Pal Pal" from Lage Raho Munnabhai.

http://www.youtube.com/watch?v=mMNvJGdWays

ఆ.సౌమ్య said...

తృష్ణగారూ..ఘోరమండీ..నేనస్సలు నమ్మలేకపోతున్నాను...అయ్యబాబోయ్, మరీ మక్కీకి మక్కీ...అవే instruments కూడా వాడినట్టున్నారు చత్రపతిలో.... unbelievable

thanks a lot ఇవన్నీ మాకు తెలియపరచినందుకు. మీ శ్రమ ఊరికేపోలేదు. :)

Praveen Rangineni said...

తృష్ణ గారు,ఇంకా కొన్ని ఇక్కడ http://www.itwofs.com/telugu.html

ఆ మధ్య నవతరంగం లోనో మరెక్కడో పెద్ద ఆర్టికల్ చదినట్టు గుర్తు. పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసారనుకొంటా.

kumar said...

Chatrapathi song is a copy of german video game.

తృష్ణ said...

@సి.హెచ్.బ్రహ్మానందం: బాగా చెప్పారు. బహుశా అదే కారణం అయ్యుంటుంది. ఆగ్లేతర బాషా సంగీతాన్ని తెలుగువారు ఎక్కువగా వినరని నమ్మకమేమో..! ధన్యవాదాలు.

@కమల్: అవునండీ అరుంధతిలోని Dance scene with drums "House of hidden daggers" అనే సినిమాలోంచి కాపీ చేసారు. (తెలీనివారి కోసం) లింక్ ఇదిగోండి - http://www.youtube.com/watch?v=znZxS0WqDk8&feature=related

తృష్ణ said...

@లలిత: క్లిఫ్ రిచార్డ్స్ పాట గురించి తెలుసండి. అదివరకూ నేను కొన్ని పాత తెలుగు పాటల మాతృకల గురించి క్రింది టపాలో రాసాను -
http://samgeetapriyaa.blogspot.com/2011/01/blog-post.html

హిందీలో,తెలుగులో ఇలాంటివి చాలా కాపీలు అలా ఏళ్ల బట్టి వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు ఆశ్చర్యం, బాధ కలిగించింది ఇన్ని కొత్త పాటలు...ఇన్నాళ్ళూ కొత్త సంగీత దర్శకుల సొంత బాణిలు అనుకుంటున్నవన్నీ కాపీ ట్యూన్స్ ఏనా?? అని.

తృష్ణ said...

@ఆ.సౌమ్య: నాకూ అదే విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించిందండీ. పాతవాళ్ళు కనీసం కొన్ని మార్పులు చేసేవారు. అన్నట్ళు కీరవాణి గారు అదివరకే చాలా దిగుమతులు చేసారు. "తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో" పాటలోని మొదటి భాగం స్టార్టింగ్ లో ఆలాపనతో సహా "ఎనిగ్మా" వాళ్ల ట్యూన్..!

@ప్రవీణ్ రంగినేని: శ్రీనివాస్ గారి ఆర్టికల్ చూడలేదండి నేను. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@కుమార్: Thanks for the info.
యూట్యూబ్ లో జర్మన్ థీమ్ అన్నరు కానీ వివరం రాయలేదండి. ధన్యవాదాలు.

Padmarpita said...

అమ్మో! కమెంట్ చేస్తే కూడా కాపీ కొట్టేస్తారేమో:):)

raviteja said...

చివర్లొ వచ్చిన మ్యూజిక్ ఒరిజినల్ ఎంటో చెప్పండి please.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

కీరవాణి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు-" ఓసారి ఆడియోరిలీజ్ రోజు మాఅబ్బాయి వచ్చి నాన్నా ఇది ఫలానాసినిమాలోదిగా అనీడిగాడు. అప్పుడు నాపిల్లలమీద ఒట్టేసుకున్నాను ఇకపై కాపీలు కొట్టను అని."
వీళ్ళంతా పైరసీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుంకట్టుకోవడం మిలీనియంకే పెద్దజోక్. కాదంటారా

తృష్ణ said...

@రవితేజ: ఆలస్యంగా జవాబు రాస్తున్నందుకు సారీ అండీ. పేరు నాకూ తెలీలేదు.

@చైతన్య: జోక్ ఆఫ్ థి మిలీనియం అంటావా? కరక్టే..:)
సమాధిలోంచి బయటకు వచ్చావా?