మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే అటు, ఇటు రెండు పక్కాలా అయ్యేకే ఆపేవాళ్ళం మేము. పాటల కోసం, మాధవన్ కోసం సినిమా చూసాం కానీ భరించడం చాలా కష్టం అయ్యింది. కేవలం పాటల్ని విని ఆస్వాదించాల్సిందే తప్ప కథ జోలికి, సినిమా జోలికీ వెళ్ళకూడని సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా!
చాలా మొదట్లో మాధవన్ జీ టివీలో "బనేగీ అప్నీ బాత్" అనే సీరియల్ లో వేసేవాడు. అప్పట్లోనే మా ఫ్రెండ్స్ అందరం తెగ మెచ్చేసుకునేవాళ్ళం భలే ఉంటాడు, బాగా ఏక్ట్ చేస్తాడని. ఆ సీరియల్ కూడా బావుండేది. సాగీ..సాగి..సాగీ...ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ టైటిల్ సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నా అప్పట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడీ అబ్బాయ్. ఇతని నవ్వు చాలా బావుంటుంది. Sweet smile!
మళ్ళీ పాటల్లోకి వచ్చేస్తే... ఈ పిక్చర్ థీమ్ మ్యూజిక్ ను ఫోన్లలో కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ పెట్టుకుంటున్నవాళ్ళు ఉన్నారు.
థీమ్ మ్యూజిక్ ..
అన్నింటిలోకీ నాకు బాంబే జయశ్రీ పాడిన "వసీగరా.." చాలా చాలా ఇష్టం. ఏ రాగమో కనుక్కోవాలి..
అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు:

No comments:
Post a Comment