ఆ మధ్యన నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ సీడీ ఇచ్చారు. ఏంకర్/జర్నలిస్ట్ 'స్వప్న సుందరి' పాడిన క్లాసికల్ ఫ్యూజన్ ఆల్బం అది. భావయామి సీడీలో ఏడు అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. ఫ్యూజన్ మిక్స్ చేసిన స్వరకర్త ప్రాణం కమలాకర్ గారు(వాన, ప్రాణం చిత్ర సంగీత దర్శకులు). వీరు మంచి ప్లూటిస్ట్ కూడా. ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ శ్రీనివాసన్ గారి వద్ద వేణుగానమభ్యసించారు. ఎంతో చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ ఫ్యూజన్ స్వరాలను సమకూర్చారు కమలాకర్ గారు. స్వప్న కూడా అంతే చక్కగా ఆలపించారు కీర్తనలను.
ఈ సీడీలో నాకు బాగా నచ్చినది రెండ వ కీర్తన "మాయా మోహము". సీడీలో ఉన్న ఈ కీర్తన తాలూకూ ఒరిజినల్ ట్యూన్ అందించినది శ్రీ మల్లాది సూరిబాబు గారు. "జోగ్ రాగ్" లో అనుకుంటా చేసారు. మల్లాది సూరిబాబు గారి ఏ ట్యూన్ అయినా ఎంత బావుంటుందో అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం బాగా వచ్చినవాళ్ళు తప్ప మామూలు గాయకులు ఆ గమకాలను పలకలేరు. శాస్త్రీయ సంగీతం మీద ఉన్న అభిమానంతో స్వప్న ఆల్ ద వే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళి వస్తూ కొన్నాళ్ళు సూరిబాబు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. అందువల్ల నాకీ కీర్తన విOటూంటే సూరిబాబు మావయ్యగారు పాడుతున్నట్లే ఉంది.
పూర్తి సాహిత్యం:
మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత నీ చిత్తమే కలది
((మాయా మోహము ))
౧చ: ఎంత వెలుగునకు అంతే చీకటి
ఎంత సంపదకు అంత ఆపద
అంతటనౌషధమపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది
((మాయా మోహము))
౨చ: మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోనే
ఇలలో శ్రీవేంకటేశ నీ కరుణ
గలిగిన మాకెల్ల ఘనతే కలది
((మాయా మోహము))
౩చ: చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆశల మిగిలిన తలపే కలది
((మాయా మోహము))
*** *** ***
సంగీత దర్శకులు, ఫ్లూటిస్ట్ 'కమలాకర్' గారి స్వప్న చేసిన ఇంటర్వ్యూ: