ఇవాళ్టికి ఐదేళ్ళు పూర్తవుతుంది నే బ్లాగ్ మొదలుపెట్టి..! 100, 200, 300 అని బ్లాగ్ పోస్ట్లు లెఖ్ఖపెట్టుకుంటుంటాను కానీ బ్లాగ్ పుట్టినరోజు నేనెప్పుడూ చేసుకోలేదు ఈ ఐదేళ్లలో. చాలా పెద్ద పోస్ట్ రాసాను ఇందాకట్నుండీ కూచుని.. కానీ ఎందుకో అనిపించింది...ఎందుకు ఇవన్నీ రాయడం... నేనేమిటో తెలిసినవాళ్ళు... నన్ను అర్థం చేసుకున్నవాళ్ళు నా రాతలని అభిమానంతో చదువుతూనే ఉంటారు. అర్థం చేసుకోనివాళ్లకు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఎలానూ అర్థం చేసుకోరు.. అనిపించి మొత్తం డిలీట్ చేసేసా :-)
నన్ను ప్రోత్సహిస్తూ, నా బ్లాగ్ కబుర్లన్నీ ఓపిగ్గా వింటూ, తోచిన సలహాలిస్తూ సహకరిస్తున్న శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోళెడు థాంక్యూలు. మొదట్లో చదివేవారు కాదు కానీ ఇప్పుడు నా ప్రతి పోస్ట్ కీ ఫస్ట్ రీడర్ తనే. ఏవైనా మార్పులు కూడా చెప్తూంటారు. ఇక ఇప్పుడు ఏం చేసినా, ఏం రాసినా తనకి చూపించడం, తన సలహా తీసుకోవడం అలవాటైపోయాయి నాకు. ఇంకా నేను బ్లాగింగ్ చేస్తుండటానికి కారణం తనే. నే మానేస్తానన్న ప్రతిసారీ ఎన్నో ఉదాహరణలూ, సలహాలూ చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తారు. "తృష్ణ" గా నాకొక ఉనికి ఏర్పడి, నా ఈ బ్లాగ్ పయనంలో విజయాలేమైనా చూసానూ అంటే..అన్నీ తన వల్లే! తన ప్రోత్సాహం వల్లే!
ఎవరి జీవితంలో అయినా ఐదేళ్ళంటే చాలా విలువైన సమయం.. ఈ సందర్భంగా.. ఈ ఐదేళ్ల పయనంలో నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన నా బ్లాగ్ రీడర్స్ కీ, ఇంకా బ్లాగ్మిత్రులందరికీ మరోసారి మన:పూర్వక ధన్యవాదాలు.
12 comments:
తృష్ణా్... మీ బ్లాగ్ నేను చాలా కాలం గా చూస్తున్నాను,
అయితే అది మీకు చెప్పుకొనే అవకాశం రాలేదు. మీ ఐదేళ్ళ ప్రయాణం మరో యాబైఐదేళ్ళు పెరగాలి. మీ వారికీ నా తరపున అభినందనలు.
Congratulations.. Keep writing! :-)
కంగ్రాట్స్ అండి తృష్ణ గారు.. మీరు ఇంకా ఎన్నో పోస్ట్ లు రాయాలని .. మాచేత చదివించాలని కోరుకుంటున్నా... :-)
Congrats !!!
Congrats !!!
Congrats Trushna :)
తృష్ణగారు, బ్లాగ్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంలో మీకు అభినందనలు. మీనుంచి మరెన్నో చక్కని పోస్టులు ఆశిస్తున్నాం.
అభినందనలు తృష్ణ గారు :-)
Long live your blog trishnaji
@Meraj Fathima:నా బ్లాగ్ చదువుతారని తెలిసి సంతోషం కలిగింది. అమ్మో మరో ఏభై ఐదేళ్ళా... "బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతామటే.." అనేవారు మా మామ్మగారు...
మీ అభిమానానికి ధన్యవాదాలు.
@madhura: thank you dear.
@Srinivasa Rao kamaraju:ధన్యవాదాలు.
@praveena: ధన్యవాదాలు.
@jyothi: Thanks mahek..:)
@Dantuluri Kishore varma:ధన్యవాదాలు.
@వేణు శ్రీకాంత్: థాంక్స్ అండీ.
@sujata: Thanks a lot..:)
Post a Comment