"తీతా.." అనే రాజబాబు డైలాగ్స్ గుర్తొచ్చి, సరదాగా చూద్దామని "అందాల రాముడు" పెట్టుకున్నాం. చాలా ఏళ్లైంది చూసి..!కథ కూడా మర్చిపోయా. రామకృష్ణ పాడిన అతిచక్కని పాటల్లో ఒకటైన "మము బ్రోవమని చెప్పవే.. " పాట మొదలయ్యింది.. హనుమ,లక్ష్మణ సమేతంగా మందిరంలో అందమైన సీతారామల విగ్రహాలు ముద్దులొలుకుతుంటే.. 'భలే ఉందే సాహిత్యం గుర్తే లేదు..' అనుకుంటూ వింటున్నా...
రెండవ చరణంలో అన్నాడు కదా..పులిని చూసి పులి బెదిరిపోదట, మేకను చూసి మేక భయపడదట కానీ... "మాయరోగమదేమోగాని మనిషి మనిషికీ కుదరదు..." అన్నాడాయన! ఒక్కసారిగా.. ఒళ్ళు గగుర్పాటు అంటారే.. అలాంటిదేదో అనిపించింది. చరణం పూర్తయ్యేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రామకృష్ణ గాత్రం కూడా ఎంతో భావయుక్తంగా, అసలు కథలో రాము పాత్ర తాలూకూ ఫీల్ అంతా తన గొంతులో చూపెడుతూ.. అద్భుతంగా పాడారు. సి.నా.రె గారూ ఏం రాశారండీ... ఆహా.. అనుకున్నా!
ఆ రెండవ చరణం:
పులిని చూస్తే పులీ ఎన్నడు బెదరదూ
మేక వస్తే మేక ఎన్నడు అదరదూ
మాయరోగమదేమోగాని మనిషి మనిషికీ కుదరదు...
ఎందుకో తెలుసా తల్లీ..
ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్లము
మీ అండ కోరే వాళ్ళము
కరుణించమని చెప్పవే మా కన్నతల్లీ...
కరుణించమని చెప్పవే !
((మముబ్రోవమని..))
ఎంత చక్కగా విడమర్చి చెప్పాడో కదా! మీరు ఆ పాట ఇక్కడ వినేయండి:
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1253
ఇక్కడ చూసేయండి:
http://www.youtube.com/watch?v=-fr-SgXN6Ew
మొత్తం సాహిత్యం:
No comments:
Post a Comment