ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు, స్వరకర్త అయిన శ్రీ ఎల్.సుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చిన ఓ సినిమా Salaam Bombay (1988) . 'మీరా నాయిర్' ఈ చిత్రానికి దర్శకురాలు. బొంబాయి లోని వీధిపిల్లల జీవితాలపై తీసిన ఈ సినిమా జాతీయపురస్కారాన్నీ, మరెన్నో ఇతర అవార్డు లనూ దక్కించుకుంది. అమ్మ సినిమా చూసి వచ్చాకా చెప్పిన కథ విన్నాకా.. కథలోని దు:ఖం నాకా సినిమా చూడాలనే ఆసక్తిని తుడిచేసింది. ఇప్పటిదాకా నేనీ సినిమా చూడలేదు..! ఇంతకీ ఈ సినిమా soundtrack కేసెట్ మా ఇంట్లో ఉండేది. భారతీయ, పాశ్చాత్య సంగీతాలని కలగలిపి చేసిన fusion music అది. చాలా అద్భుతంగా ఉండే ఈ చిత్ర సంగీతం ద్వారానే నాకు ఎల్.సుబ్రహ్మణ్యం పరిచయం.
ఎన్నో వందల సార్లు ఈ కేసెట్ పెట్టుకుని నేనూ, మా తమ్ముడూ వింటూ ఉండేవాళ్లం. ఈ ట్యూన్స్ అన్నీ కూడా మా ఇద్దరికీ నోటితో పాడుకుంటూ పనులు చేసుకునేంత బట్టీ. అన్నింటిలోకీ ఈ సినిమా theme music చాలా చాలా బావుంటుంది.' టట్టట్టటాం... టట్టట్టటాం...టట్టట్ట టావ్ టావ్... ' అని పాడేసుకుంటూ ఉండేవాళ్ళం మేము..:)
క్రింద ఇచ్చిన యూట్యూబ్ లింక్ లో ఈ theme music వినవచ్చు:
సినిమా లోని మిగతా ట్యూన్స్ ఇక్కడ వినవచ్చు:
http://www.allmusic.com/album/salaam-bombay-r128332
No comments:
Post a Comment