సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, August 6, 2011

ఒకే ఒక్కటి ?!


పూసినదొక పువ్వుట..


అది వేసినదొక పిందెట..


కాసినదొక కాకరకాయట..


ఒక్క దానితో ఏం చేయాలో తెలియదట..!!









11 comments:

ఆత్రేయ said...

ఒకటి ఒంటరి కాదట
మరోటి కాయక మానదట
మూడోది పిలిస్తే నాలుగోది
నాలుగోది పిలిస్తే నలభైయ్యోది..
కాసి మీ వంటింటి తోటని అలంకరించి
మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.

కృష్ణప్రియ said...

:) పద్యం బాగుంది. పువ్వు బాగుంది కాయ మరీ బాగుంది.

జయ said...

ఆ ఒక్కటి అలాగే చెట్టుకుంచేసి, బాగా ఎండిపోయినాక రాలిన గింజలు మళ్ళీ మొలకలెత్తి, ఒక్కో చెట్టుకు వచ్చిన కాయలు ఎన్నౌతాయో....అప్పుడు లెఖ్ఖపెట్టుకోండి. సరేనా:) ఎంత ఫ్రెష్ గా ముద్దొస్తోందో పొట్టి బుడంకాయ.

ఇందు said...

ఒంటరి పువ్వూ.....తుంటరి కాయ ;)

కాకరకయని చితక్కొట్టేసి..ఉల్లిపాయలౌ,ఒప్పు,కారం వేసేసి...నూనెలో వేయించి తీసేసుకుని ఎవరు చూడకుండా ఒక్కముద్ద అన్నంలో కలిపేసుకుని తినేయడమే :)))))))))))

గోదారి సుధీర said...

బాగుంది కాకర కాయ కవిత ,కవిత ,కాకర కాయ .

Anveshana said...

try mix veg curry with kakara kaya

లత said...

ఒక్కటే కదా, మీ ఒక్కరికోసమే కాసినట్టుంది

Rao S Lakkaraju said...

@ఇందు రెండు లైన్లలో బ్రహ్మాండమైన రెసిపీ చెప్పేసారు. చాలా రోజులైంది తిని. మళ్ళా చేయించుకోవాలి. ఆ చెయ్యి పడితే కానీ ఆ రుచి రాదు.

రవికిరణ్ పంచాగ్నుల said...

కష్టమేనండీ.. ఒక్కదానితో ఏమీ చెయ్యలేకపోయినా..

.. దాని వంకే చూస్తూ.. అన్నం ముద్దని నోట్లో పెట్టుకుని..ఫేవరేట్ కాకరకాయకూరని (కారపుకాయా? బెల్లంపెట్టిన కూరా? వేపుడా?....)తలుచుకుంటూ.. లొట్టలు వేసేయ్యొచ్చు..

తృష్ణ said...

@ఆత్రేయ: మీ మాటలు వినబడ్డట్టున్నాయి..మరో నాలుగు కాసాయండి..:
ధన్యవాదాలు.

@కృష్ణప్రియ: తింటే ఇంకా బావుంటుంది..:)
ధన్యవాదాలు.

@జయ: :))
ధన్యవాదాలు.

@ఇందు: తినేసాం తినేసాం..:))
ధన్యవాదాలు.

తృష్ణ said...

గోదారి సుధీర: ధన్యవాదాలు.

@poornima: ఐడియా బావుందండీ..థాంక్స్.

@లత: మరేనేమో..ఇప్పుడు మరొ నాలుగు కాసాయిలెండి..ధన్యవాదాలు.

@రావు ఎస్.లక్కరాజు: అవునండీ..ధన్యవాదాలు.

@రవికిరణ్: అంతేమరి..:))
ధన్యవాదాలు.