తలుపులు మూసినా తలపు ఆగదు
గాయం మానినా గురుతు చెరుగదు
అపోహ పెరిగితే అపార్ధం తరగదు
అపార్ధం బరువైతే నిజాయితీ కనబడదు
అవమానం ఎదురైతే అభిమానం మిగలదు
స్నేహమే ప్రశ్నైతే మాటలే మిగలవు
నమ్మకం లేకుంటే ఏ బంధమూ నిలవదు
మనసు మూగైనా ఏ పయనమూ ఆగదు
అన్నీ చింతలే ఐతే సాంత్వన దొరకదు
చిక్కులే లేకుంటే చిరునవ్వే చెరగదు
ప్రశ్నలకు బదులే దొరికితే ఏ కలతా కలగదు
జీవితమవగతమైతే అసలు ప్రశ్నలే ఉండవు
3 comments:
"ప్రశ్నలకు బదులే దొరికితే ఏ కలతా కలగదు
జీవితమవగతమైతే అసలు ప్రశ్నలే ఉండవు"
అక్షర సత్యం
ఎంత బాగా చెప్పారండీ...
@shankar.s: :)
thank you.
@vasantam: ??
Thank you.
@శ్రీలలిత: అనుభవాల సారం.. అంతే నండి.
ధన్యవాదాలు.
Post a Comment