సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 30, 2011

Kung Fu Panda 2

For success in life or any other achievement all that you need is "inner peace" అన్న సూత్రాన్ని చెప్పింది " Kung Fu Panda 2 ". ఇవాళ నేను చూసిన ఈ ఏనిమేటేడ్ మూవీ నాకు తెగ నచ్చేసింది. నేను 2D మాత్రమే చూశాను. కానీ ఊళ్ళో ఆడుతున్న 3D వెర్షన్ చూస్తే ఇంకా బాగుంటుందేమో. వీలైతే మళ్ళీ చూడాలి. Summer special movie, good entertainer మొదలైన అవార్డులన్నీ ఈ సినిమాకే ఇచ్చేస్తా నేను.





సీక్వెల్ సినిమాల్లో మొదటి భాగం మాత్రమే బాగుంటుంది అనే నానుడిని ఈ సినిమా బ్రేక్ చేసేసింది. నాకుమటుకు మొదటి దాని కన్నా ఈ రెండోది ఇంకా బావుంది అనిపించింది. అసలు ప్రపంచంలో అన్నీ యేనిమేషన్సే తీయాలి అని రూలు కూడా పెట్టాలనిపించేసింది. అంత హాయిగా, ఉల్లాసంగా ఉంది సినిమా. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అమెరికాలో రిలీజైన మొదటి వారంలోనే బోలెడు లాభాలార్జించిందట ఈ సినిమా.




చిన్నప్పుడు ఊళ్ళోకి ఏ animated movie వచ్చినా నాన్న మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. అందువల్ల చిన్నప్పటి నుంచీ animations పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానితో పాటుగా "డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ " వాళ్లవి అయితే బావుంటాయని ఒక నమ్మకం కూడా ఏర్పడింది. రెండేళ్ళ క్రితం మా తమ్ముడు తెచ్చిన " Kung Fu Panda" సీడీ చూసి తెగ నచ్చేసి కాపీ కూడా చేస్కున్నాను. ఆ సినిమా గురించి బ్లాగ్ లో రాద్దాం రాద్దాం అనుకుంటూండగానే దాని సీక్వెల్ కూడా వచ్చేసింది. నిన్న "వైశాలి" చూసి వస్తుంటే దారిలో ఉన్న హాల్లో " Kung Fu Panda 2 " కనబడింది. చూసేద్దామనుకుంటే పొద్దుటే ఉందిట షో. రాత్రి లేదుట. అందుకని నిన్న చూడలేదు. మన జనాలు చూస్తారో లేదో.. వారాంతం దాకా ఉంటుందో వెళ్పోతుందో.. అని ఇవాళే చూసేసా.


అద్భుతమైన డైలాగులు ఈ సినిమాకు పెద్ద ఎసెట్స్. కొన్ని గుర్తున్నాయి..

*The only thing that matters is what you choose now.
* The Cup you choose to fill has no bottom.
*Anything is possible when you have inner peace.
* మళ్ళీ ఒకచోట villioness "Shen" హీరో "Po" తో " your stupidity is mildly amusing " అంటే Po ఏమో Shen తో "your wikidity is wildly amusing " అంటాడు. ఆ డైలాగ్ భలే ఉంది.




ఈ సినిమా లోని పాత్రలకు Jack black, angelina jolie, jackie chan మొదలైన అగ్ర తారలు గళాలనందించారు.

ఈ సినిమా దర్శకురాలు "Jennifer yuh nelson". ఈవిడ "kung Fu panda" (మొదటిది) సినిమా ప్రొడక్షన్లో కూడా కీలకపాత్ర వహించి ఒక అవార్డ్ ను కూడా పొందారు. ఇప్పుడీ రెండవ సీక్వెల్ కు పూర్తి దర్శకత్వ బాధ్యతను చేపట్టి తన సత్తా నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అసలు యేనిమేషన్ సినిమలా కాక చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. సినిమా చివరలో మూడవ భాగం కూడా తీస్తారేమో అన్న హింట్ ఇచ్చారు...!





ఈ సినిమా మాలూలు హాల్స్ లో ఇచ్చి ఉంటే ఈ వేసవిలో అందరు పిల్లలూ చూసి ఆనందించగలరు. కానీ మల్టీప్లెక్సులకే పరిమితం చేస్తే ఎందరు చూడగలరు? అన్నది ప్రశ్న. అదీగాక ఈ మధ్యన పోగో, కార్టూన్ నెట్వర్క్ మొదలైన ఛానల్స్ పుణ్యమా అని కాస్తంత ఎవేర్నెస్ వచ్చింది కానీ మన దేశంలో యేనిమేషన్స్ పట్ల ఆసక్తి తక్కువనే చెప్పాలి. ఏదేమైనా ఈ టపా చదివినవారంతా వీలైతే ఈ సినిమాను కుటుంబంతో తప్పక చూడండి. ముద్దుగా, బొద్దుగా, తెలివిగా, కాస్తంత అమాయకత్వంతో నవ్వుతెప్పించే panda హీరో "Po" ను ప్రేమించకుండా ఉండలేరు.

4 comments:

SHANKAR.S said...

అప్పుడే చూసేశారా?
అన్నట్టు "SPIRIT" 2D ANIMATION MOVIE చూశారా? దొరికితే చూడండి. భలే ఉంటుంది.

తృష్ణ said...

@shankar.s: may be for 10 times...
http://maacinemapegi.blogspot.com/2010/09/spirit-stallion-of-cimarron-2002.html

Anonymous said...

హయ్యో!హయ్యో! అప్పుడే చూసేసారా? మా ఇంట్లో అందరమూ ఎంతగానో ఎదురు చూస్తున్నాము. మా పిల్ల పరీక్షలవగానే....
నాకూ మొదటి భాగం చాలా చాలా నచ్చింది. మీరన్నట్టు ఎనిమేషన్ సినిమాల సొగసే వేరు.
గ్రాఫిక్స్ తో పాటు నాకు డైలాగులూ బాగా నచ్చుతాయి.
శారద

తృష్ణ said...

@sarada: ఈపాటికి చూసేసి ఉంటారు. బావుంది కదండి.