సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, May 17, 2011

ఇదేం సినిమానో తెలుసా?


"ఓ హలా ! ఎక్కడున్నావు...?"

"ఒసే ఏమే ఏమిటే, ఈ మెరపకాయలు తినండే !"

ఈ డైలాగులు ఏ సినిమా లోవో గుర్తున్నాయా?
ఇంకా క్లూ కావాలా?

ఓ రాజకుమారుడు ఉంటాడు.
ఆ రాజకుమారుడికి ఓ పెద్ద కల..నలుగురు దేవతా స్త్రీలతో ఎంజాయ్ చేస్తున్నట్లు..!
ఒక్కరు కాదు నలుగురా? అయినా ఇదేం కల నాయనా? అని రాజుగారు నోరు వెళ్లబెడతాడు. కోపగిస్తాడు. కల నెరవేర్చుకుని రమ్మని యువరాజుని రాజ్యంలోంచి పంపించివేస్తాడు.

కట్ చేస్తే:

యువరాజు తన కలని ఎలా సాకారం చేసుకుని ఆ నలుగురు దేవత స్త్రీలనూ సొంతం చేసుకున్నాడన్నది మిగిలిన కత !

చిన్నప్పుడూ హాల్లో ఈ సినిమా చూసినప్పుడు మరీ చిన్న వయస్సవటం వల్ల ఏ ప్రశ్నలు ఉత్పన్నమవలేదు. ఇప్పుడు సినీజ్ఞానం బాగా పెరిగిపోవటం వలన అనేకానేక ప్రశ్నలు...

* హీరోకి మరీ ఇంత విపరీతమైన "కల" ఏంటో? రాజుగారి ప్రశ్నే నాకునూ....మరీ నలుగురా?

* ఇద్దరు హీరోన్లుంటే ఇప్పటి సినిమాల్లో అసూయలూ, కారాలు,మిరియాలు గట్రాలు బోలెడు. ఈ నలుగురికీ సఖ్యత ఎలా ఉంటుందబ్బా?

* ఈ హీరోయినేంతబ్బా ఇంత లావుగా ఉంది? ఇప్పటి "బక్క హీరోయిన్ల"ను చూసి నా చూపు మరీ చిక్కిపొయినట్లుంది..!

* ..... డ్యూయెట్లు పాడుతూంటే కాస్త నవ్వు వచ్చినమాట నిజమేననాలేమో?

కానీ ఈ సినిమాలో ఓ పాట నాకు చాలా ఇష్టం. సూపర్ మ్యూజిక్, నలుగురు అమ్మాయిలు...బ్లాక్ వైట్ అయినా సూపర్ సాంగ్ !!

పాట చెప్పేస్తే సినిమా పేరు తెలిసిపోతుందే?!

32 comments:

SHANKAR.S said...

"హలా" అన్న మాటతోనే సినిమా పేరు తెలిసిపోదండీ? మళ్ళీ ప్రత్యేకంగా పాట చెప్పాలా? ఆ సినిమా - JVK (సస్పెన్స్ పోకూడదని నేనూ హింట్ గానే జవాబు చెప్పానంతే :) )

జయ said...

జలకాలాటలలో, కిలకిల పాటలతో ఏమి హాయిలే హలా...అహ ఏమి హాయిలే హలా....సినిమా పేరు నేను కూడా చెప్పను:)

ఆత్రేయ said...

ఆ సినిమా వచ్చిన అయిదేళ్లకి నే పుట్టానట
అచ్చం రాజకుమారుడి ఠీవీ తో పుడితే నాకూ జగదేకవీరుడు అని పేరు పెడదామనుకున్నారట
కానీ నాలుగు హీరోయిన్ల కధ బాలేదని మా తాత పేరు పెట్టారట
అందులో మీకిష్టమయిన పాట మన బాలూ కిస్తే షివ షన్కరీ .. అని పాడేవాడట ...
ఇన్ని విషయాలు గుర్తొస్తున్నాయి కానీ సినిమా పేరు గుర్తు రావట్లేదేమిటో హలా ...!!
టిక్ టిక్ వన్, టిక్ టిక్ టూ, టిక్ టిక్ త్రీ ... పాస్ ..!!

Anonymous said...

జగదేకవీరుని కథ

బులుసు సుబ్రహ్మణ్యం said...

జగదేకవీరుడా మజాకా నా, నలుగురేమిటి ఇంకో అరడజను ఐనా మేనేజ్ చేసేస్తాడు. ఆ హీరోయిన్లను లావు అంటారా. ఆ కాలంలో ఉన్న వాళ్ళలో వాళ్ళే సన్నం.

ఒక సినిమా, పేరు గుర్తు రావటం లేదు. సావిత్రి, దేవిక, ఎన్‌టి‌ఆర్, కాంతారావు. నలుగురిని ఒక్క సీను లో కూడా పెట్టలేకపోయాడట డైరక్టరు ఎంత ప్రయత్నించినా. :):)

శ్రీలలిత said...

మీరు పాట చెప్పకుండానే సినిమాపేరు చెప్పేస్తానండీ.. నేనేమిటి.. చాలామంది చెప్పగలరు. అంత విజయవంతమైన సినిమా.
"జగదేకవీరునికథ.."
ఇప్పుడు కాస్త అన్నీ చూస్తుంటే మనకి ఆ కల విపరీతంగా అనిపిస్తోంది కాని, ఆ రోజుల్లో అంటే రాజులు రాజ్యాల నేలేరోజుల్లో ఎంతమంది భార్యలుంటే ఆ రాజు అంత గొప్పవాడని అర్ధమన్నమాట.
చిన్నప్పుడు తెలుగు పరీక్షల్లో ఒక ప్రశ్న వుండేది..
"కృష్ణదేవరాయలు దక్షిణనాయకుడని ఎలా చెప్పగలవు..?" అని.
దక్షిణనాయకుడంటే ఎక్కువమంది భార్యలనుకాని, ప్రియురాండ్రనుగాని వున్నవాడని అర్ధం. (ఇది తప్పయితే తెలుగుపండితులెవరయినా సరిచేయ ప్రార్ధన..)
లేదా ఎక్కువ దేశములు జయించినవాడని కూడా అయివుండవచ్చు. కాని మా తెలుగు మాస్టారు మటుకు మాకు మొదటి అర్ధాన్నే చెప్పారు.
కాలాన్ని బట్టి అభిప్రాయాలూ, అభిరుచులూ మారిపోతాయికదా..
ఇదివరకు భార్యాభర్తల మధ్య వయసు తేడా కనీసం అయిదు సంవత్సరాలు వుండాలనేవారు. కాని ఇప్పుడు అమ్మాయిలు రెండు సంవత్సరాలకన్న ఎక్కువ తేడా వుంటే పెళ్ళికి సుముఖత చూపటంలేదు. అప్పటి రోజులవి. ఇప్పటి రోజులివి. అప్పుడు అది అందమయితే, ఇప్పుడు ఇది అందం. అంతే..
మీరన్నట్టు ఇప్పుడు హీరోయిన్ ఎంత సన్నగా వుంటే అంత అందం.

satya said...

సినిమా పేరు కనుక్కోవడానికి ఆ డయిలాగులు చాలు. "జగదేక వీరుడు" కదూ!

మాలా కుమార్ said...

జగదేకవీరునికథ నే కదా :)
జలకాలాటలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా :)

♥♥♥$υяєรн мσнคи♥♥♥ said...

హల అని చదవగానే గుర్తువచ్చేసింది



జగదేకవీరునికధ ...

Unknown said...

తెలుసు హలా.. తెలుసు.. జగదేకవీరుని కధ అని.. పాట చెప్పకపోయినా తెలిసిపోతుంది..:)

Unknown said...

ఓ హలా..ఈ పాట జగదేక వీరుని కధ లో ది కదండీ.

Sharada said...

సినిమా పేరు- 'జగదేక వీరుని కథ ' ?
పాట - "జలకాలాటలలో" ?
(కొశ్చెను మార్కు ఎందుకంటే సమాధానాల మీద నాకు కాన్ఫిడెన్సు లేదు.. హి హి హీ!)
శారద
పీ-యెస్. మీకొచ్చిన సందేహాలే నాకూ వొచ్చాయి/వున్నాయి.

Tejaswi said...

ఇంతకీ జగదేకవీరునికథలోని ఏ అంశంమీద మీ ప్రశ్న? యువరాజుగారు నలుగురిని ఎలా డీల్ చేశాడనా? లేక ఆ విపరీతమైన కల ఏమిటనా? స్పష్టంగా లేదు.

నాగప్రసాద్ said...

ఆ సినిమా పేరు: జగదేకవీరుని కథ. :-)

ఈ సినిమాలో రెండు పాటలు బాగుంటాయి.

ఒకటి జలకాలాటలో కిల కిల పాటలతో ఏమి హాయిలే హలా... అనేది

ఇంకోటి, శివశంకరీ, శివానందలహరి శివశంకరి...అనేది..

విజయ క్రాంతి said...

jalakaalaatalalo emi haayi le hala :-)

idenaa ... jagadekaveeruni katha

ఆ.సౌమ్య said...

జగదేకవీరుని కథ....అన్ని పాటలూ బావుంటాయి. జలకాలాటలలో, వరించివచ్చిన మానవవీరుడు ఏమైనాడని విచారమా, ఐనదేమో ఐనది ప్రియ గానమేలే, ఓ సఖి ఓ చెలి ఓ మయూరమోహిని, రారా కనరారా, కరుణమానినారా, శివశంకరి...ప్రస్థుతానికి ఈ పాటలే గుర్తొస్తున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా?

భారతీయ వాఙ్మయం said...

jagadekaveeruni katha

Unknown said...

ఇంత వివరంగా చెప్పాల్సిన పనే లేదు నాయనా... "హలా" అన్న ఒక్క పదం చాలు సినిమా ఏమిటో కనిపెట్టేయడానికి.. పింగళి గారి సినీమాయా సృష్టిలో హలోకి స్త్రీ లింగం ఈ "హలా" అనే పదం - జగదేకవీరునికథ

కమల్ said...

జగదేకవీరుని కథ...!

కంది శంకరయ్య said...

జగదేకవీరుని కథ.
"హలా", "ఒసే, ఏమే, ఏమిటే" ఈ క్లూలు చాలు. మరీ అంత వివరంగా చెప్పవలసిన పనిలేదు.

SHANKAR.S said...

@ బులుసు గారూ
"సావిత్రి, దేవిక, ఎన్‌టి‌ఆర్, కాంతారావు"
మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇదేదో "రక్త సంబంధం" సినిమా తారాగణంలా ఉంది

భావన said...

సినిమా కధ పాటలు ఏమో కాని ""సావిత్రి, దేవిక, ఎన్‌టి‌ఆర్, కాంతారావు" ఒక ఫ్రేమ్ లో.. హి హి హి హ హ హ ... అబ్బ తలచుకుని తలచుకుని నవ్వుకుంటున్నా.. :-))

శ్రీలలిత said...

బులుసు సుబ్రహ్మణ్యంగారికి గుర్తురాని సినిమా పేరు బహుశా "కంచుకోట" కావచ్చు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

శంకర్ గారు,

శ్రీలలిత గారు,

ధన్యవాదాలు గుర్తుచేసినందుకు. రెండు సినిమాల్లో ను నలుగురు ఉన్నారు. కానీ నేననుకున్నది శ్రీ లలిత గారు చెప్పిన కంచుకోట. కత్తులు పట్టుకుని కవచాలు తో వీరోలు, నగలు దిగేసుకొని వీరోయిన్లు ఇంకో నాలుగు ఇంచులు అడ్డంగా పెరిగారట. దాంతో మరి కష్టమయిందట డైరక్టరు గారికి.:):)

ramana said...

అయ్యా బులుసు గారూ,
అది నాకు తెలుసు
అయినా మీకు చెప్పను
చెప్పినందుకు నాకేంటి లాభం ?
లాభంలేని పని ఏదీ చెయ్యద్దని నాకు జంధ్యాల గారు చెప్పారు.
ఇట్లు
మీ ప్రియమైన పులుసు.
( హోల్ ఆంధ్రాకే వరల్డ్ ఫేమస్ )

తృష్ణ said...

@Shankar.s:
@jaya:
@anu:
ధన్యవాదాలు.



@aatrEya: :))

Thanks.

తృష్ణ said...

@బులుసు సుబ్రహ్మణ్యం: దీనికి జవాబు నేను బజ్జులో రాసేసాను..:)
సినిమా పేరు క్రింద మిత్రులు చెప్పేసారు.

@శ్రీలలిత: మీరన్నది కరక్టేనండీ. ఇప్పటివాళ్ల ప్రమాణాలెలా ఉన్నా హీరోయిన్ మరీ ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉంటే ఎంతైనా కష్టమే..:))

@satya:
@mala kumar:
@ ♥♥♥$υяєรн мσнคи♥♥♥ :

Thanks for the answer.

తృష్ణ said...

@ప్రసీద:
@వినీల:
@శారద: :))

three cheers !

తృష్ణ said...

@నాగప్రసాద్: ధన్యవాదాలు.

@విజయక్రాంతి:ధన్యవాదాలు.

@ఆ.సౌమ్య: నాకు జలకాలాటలలో తో పాటుగా వరించివచ్చిన, రారా కనరారా పాటలు నచ్చుతాయండీ.

తృష్ణ said...

@గీత_యశస్వి:
@కమల్:
@కంది శంకరయ్య:

ముగ్గురికీ ధన్యవాదాలు.

@సత్యప్రసాద్ అరిపిరాల: వ్యాఖ్యకు ధన్యవాదాలు. కానీ నేను "నాయనా" ను కాదండి..."అమ్మా" నేనండి...:))

తృష్ణ said...

@శంకర్.ఎస్: అదికాదేమో... శ్రీలలితగారు చెప్పేసారుగా..:)

@భావన: ఊహించుకుని అలా అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉండండి :))

@శ్రీలలిత: అదే అయ్యుంటుందనుకున్నానండి. సుబ్రహ్మణ్యం గారు టిక్ పెట్టేసారు..:))).

తృష్ణ said...

@బులుసు సుబ్రహ్మణ్యం: ఆ సూపర్ సీన్ తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటున్నానండి..థాంక్స్..:)

@రమణ: మీరు చెప్పకపోయినా శ్రీలలితగారు చెప్పేసారండి...ధన్యవాదాలు.