తాళం: రూపకం
పల్లవి: నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా
అను పల్లవి:అన్ని కల్లలనుచు ఆడిపాడి వేడి
పన్నగశయన నా చిన్నతనమునాడే
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా
వేదశాస్త్ర పురాణ విద్యలచే భేద
వాదములు తీరక భ్రమయు వారల జూచి
నిన్నే నెర నమ్మినానురా
ఓ రామా రామయ్యా
భోగములకొరకు భువిలో రాజసమ్మున..
యాగాదులొనరించి అలయువారల జూచి
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా
ఈ జన్మమున నిన్ను రాజీ చేసుకోలేక
రాజిల్లరని త్యాగరాజ రాజ రాఘవా
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా
ఈ క్రింద లింక్ లో ఎస్.జానకి, శ్రీబాలమురళీ కృష్ణ, శ్రీ ఏసుదాస్ ముగ్గురూ వేరు వేరు రాగాల్లో పాడిన ఈ కీర్తనను వినవచ్చు:
http://www.musicindiaonline.com/genre/8-Classical/#/search/clips/global!q=ninne+nera+namminanura+o+rama/classical/carnatic/tyagaraja+kriti
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, May 19, 2011
నిన్నే నెరనమ్మినానురా
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
మూడు రాగాల్లో? రాగాలు మార్చి పాడారేవిటి? నాకు తెలిసి ఈ కీర్తన పంతువరాళి రాగం. నేను విన్న వెర్షన్లన్నీ అలాగే ఉన్నాయి. నామెషిన్లో ఎందుకనో మ్యూజిక్ ఇండియా ఆన్లైన్ పని చెయ్యదు, అందుకని మీరిచ్చిన లింకులో వినలేకపోతున్నా.
నాకు తెలిసి ఒరిగినల్ పంతువరాళి రాగమే! కానీ బాల మురళి కామవర్థని రాగంలో పాడటం ఇదే మొదటి సారి వింటున్నా!
నా దగ్గర జేసుదాస్ రికార్డు ఉంది. పంతువరాళిదే!
I like this kriti like any thing!
కొత్తపాళీ: అసలు త్యాగరాజ కృతి పంతువరాళి రాగమేనండీ. నా దగ్గర ఏసుదాస్ ది కూడా అదే రాగంలో ఉంది. మ్యూజిక్ ఇండియా లింక్ లో మాత్రం బాల మురళిది, జానకి దీ కామవర్ధని రాగం అని ఉన్నాయి. బహుశా ఈ రెండు రాగాలకూ ఏదన్నా దగ్గర సంబంధం ఉందేమో మరి.నాకు రాగాల గురించిన అవగాహన లేదు...:(
@సుజాత: నా దగ్గరా ఏసుదాస్ దే ఉందండి. నాకు ఇది బాగా నచ్చుతుంది. నాకు బాగా ఇష్టమైన కొన్ని కీర్తనలను బ్లాగులో పదిలపరచాలని చిన్న ప్రయత్నం అండీ.
బావుందండీ మంచి కీర్తన. ఈ రాగాలు అవీ నాకు తెలియవు కానీ ఒక సగటు శ్రోతగా నాకు మూడిటిలోనూ యేసుదాసు గళం లోనే నచ్చింది.
@shankar.s: same feeling..:)
baagundi trushna gaaru .pondu parachandi /manchi aalochana.
సుధీరగారూ, మీ బ్లాగ్ చుట్టూ ఎన్ని ప్రదక్షణలు చేసినా వ్యాఖ్య ఎక్కడ రాయాలో తెలియట్లే...ఎలాగండీ..:(
మీ మధ్యాహ్నం కవిత, khalEjaa పాట టపా అన్నీ కూడా భలే రాస్తున్నారు. కమెంట్ ఫారం లేకపోతే బాగుందని చెప్పేదెలా?
అలా అయితే వోకే.
ఎందుకంటే పంతువరాళికే కామవర్ధని అని కూడా పేరు. 51వ మేళకర్త. చాలా నిండైన రాగం, చక్కగా విపులంగా ఆలాపన, స్వరకల్పన ఇత్యాది మనోధర్మ ప్రక్రియల్ని ప్రకటించేందుకు అనువైన రాగం. త్యాగరాజస్వామి కొన్ని అద్భుతమైన కృతులు రాశారు ఈ రాగంలో - అప్పరామభక్తి ఎంతో గొప్పరా, రఘువర నన్ను మరువతగునా, శంభో మహాదేవ, వాడేరా దైవము - అన్నీ చాలా బావుంటాయి. నేదునూరి, వోలేటి, కేవీ నారాయణస్వామి గారలు అద్భుతంగా పాడేవారు.
తృష్ణ గారు.. ఎందుకో ఆ మధ్య బ్లాగ్ మొత్తం చికాగ్గా అనిపిస్తుంటే కామెంట్ ఆప్షన్ తీసేసా .మంచి టెంప్లేట్ దొరకగానే మళ్ళి పెడతాను .మీరలా అడగటం బాగుంది . మీ వ్యవహార శైలిలోని ఈ ఆత్మీయత నాకు నచ్చుతుంది .ఆందుకని కూడా బహుశ మీ బ్లాగ్ చూస్తాను .పోస్ట్ లు నచ్చినందుకు ధన్యవాదాలు .
Post a Comment