ఒకేలా ఉన్నా కొంచెం తేడా ఉంది రెండు ఫోటోలకి... ఇంతకీ ఈ మొక్కలేమిటో చాలామందికి తెలిసిపోతుంది. పండిపోయిన కాకరకాయ గింజలు కాస్తంత ఎండబెట్టి మట్టిలో వేస్తే వచ్చిన బుజ్జి మొక్కలు. కాబోయే కాకర పాదులు !
సుజాతగారు, అయ్యో ! కాకర పాదు నాకు తెలీకపోవటం లేదండి. చిన్నప్పుడు బోలెడుసార్లు పెంచాను. ఇవి మొలకెత్తాకా రెండే ఆకులు వచ్చిన బుజ్జాయిలు. వాటి మధ్యలోంచి మీరు చెప్పినట్లుగా కాకర ఆకులతో పాదు తయారవుతుంది.పైగా ఆ ప్రదేశంలో ఎండిన కాకర గింజలు వేసినది నేనే కదా..:)
తృష్ణగారు, నేను పొద్దుట ఒకసారి చూసాను. కాకరాకులు ఇలా ఉండవేమో కదా అని అనుమానమొచ్చింది. మీకు ఎలా చెప్పాలో తెలియలేదు, చెబితే ఏమనుకుంటారో అని గమ్మునుండిపోయాను.
@అనిర్విన్: ఇందులో అనుకునేదేముందండి? మీ సందేహం మీరు నిరభ్యంతరంగా రాయచ్చు.ఇంతకీ మీ సందేహం తీరిందా లేదా? పైనచెప్పా కదండి విత్తులోంచి ఇంకా రెండాకులే వచ్చాయి. పాదు మొదలయ్యాక మళ్ళీ ఫోటో తీసి చూపిస్తాలెండి...:)
photollo teda ante okati paininchi okati eduru ninchi teesaru antena.. naaku ivi rendu oke paadu photoslaagaa unnay.... anything green is good, kaayalu kooralu vaccheste inka good good good.. same to same doubt idi kaakarakaaya aite naaku telsina variety maatram kaadu :).
@sri:కాకరకాయలో వెరైటీలా? కాయలో తేడా ఉన్నా కాకరపాదు ఆకులన్నీ ఒకేలా ఉంటాయండి. అవి విత్తు నుండి వచ్చిన మొదటి రెండు ఆకులేనండి అందుకే అందరికీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇక చిగురొస్తున్న కాకరఆకులకు మళ్ళీ ఓ ఫోటో తీసి టపా పెడతానుండండి...:)
9 comments:
ఇవి దోస పాదులు కాబోతున్నాయని అనుమానిస్తున్నా. కాకరాలు ఇలా ఉండవే! అవి చేతిలో వేసుకుని గోరింటాకు పెట్టుకునేవాళ్ళం కాదా ఆ షేప్ చేతిలో పడాలని!
http://www.google.co.in/search?hl=en&q=karela&gs_sm=c&gs_upl=5243l6769l0l6l5l2l0l0l0l206l474l0.2.1&um=1&ie=UTF-8&tbm=isch&source=og&sa=N&tab=wi&biw=1440&bih=779
సుజాతగారు, అయ్యో ! కాకర పాదు నాకు తెలీకపోవటం లేదండి. చిన్నప్పుడు బోలెడుసార్లు పెంచాను. ఇవి మొలకెత్తాకా రెండే ఆకులు వచ్చిన బుజ్జాయిలు. వాటి మధ్యలోంచి మీరు చెప్పినట్లుగా కాకర ఆకులతో పాదు తయారవుతుంది.పైగా ఆ ప్రదేశంలో ఎండిన కాకర గింజలు వేసినది నేనే కదా..:)
తృష్ణగారూ.. బావున్నాయి మీ బుజ్జి మొక్కలు. మీ ఇద్దరి సంభాషణా చూస్తూ ఉంటే చిన్నప్పుడు చూసిన రావికొండలరావుగారి 'ఆనపపాదు ' జోక్ గుర్తుకు వచ్చింది. :)
మరి రేపు ఈ బుజ్జిమొక్కలు...బుజ్జిబుజ్జి కాకకరకాయలు కాస్తే...నాకు కాసిని ఇస్తారా? ;) పిట్టకూర చేసేసుకుని తినేస్తా :))
తృష్ణగారు, నేను పొద్దుట ఒకసారి చూసాను. కాకరాకులు ఇలా ఉండవేమో కదా అని అనుమానమొచ్చింది. మీకు ఎలా చెప్పాలో తెలియలేదు, చెబితే ఏమనుకుంటారో అని గమ్మునుండిపోయాను.
@ప్రసీద: :)
@ఇందు: ఓ అలానే !!
@అనిర్విన్: ఇందులో అనుకునేదేముందండి? మీ సందేహం మీరు నిరభ్యంతరంగా రాయచ్చు.ఇంతకీ మీ సందేహం తీరిందా లేదా? పైనచెప్పా కదండి విత్తులోంచి ఇంకా రెండాకులే వచ్చాయి. పాదు మొదలయ్యాక మళ్ళీ ఫోటో తీసి చూపిస్తాలెండి...:)
ఏదో ఒక పాదు లెద్దురు. చక్కగా ముద్దు గా వుంది.. కాకరకాయ్ ఐతే వేపుడు, దోస ఐతే కూర.. అంతే కదా. :-)

Post a Comment