ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక హెల్త్ డ్రింక్ గురించి..వివరాలు.
క్రింద చెప్పిన పాళ్ళలో ఆయా వస్తువులు కొనుక్కుని మర ఆడించుకోవాలి.
రాగులు - 500గ్రాములు
గోధుమలు - 50 గ్రా
జొన్నలు - 50 గ్రా
వేరుశెనగలు - 50 గ్రా
సగ్గు బియ్యం - 50 గ్రా
ఉప్పుడు బియ్యం - 50 గ్రా
సజ్జలు - 50 గ్రా
మొక్కజొన్నలు - 25 గ్రా
సొయాబిన్ - 25 గ్రా
పుట్నాల పప్పు - 25 గ్రా
బార్లీ - 25గ్రా
ఫ్లావర్ కోసం:
బాదాం - 25 గ్రా
జీడిపప్పు - 25 గ్రా
ఏలకులు - 25 గ్రా
ఈ మూడూ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.అనవసరం అనుకుంటే ఫ్లేవేర్ కోసం వాడే బాదాం,జీడిపప్పు కలుపుకోవటం మానేయటమే.
పైన రాసిన పదార్ధాల్లో Proteins,folic acid, calcium,fibre,iron,copper,carbohydrates,magnesium మొదలైన పోషక విలువలన్ని ఉంటాయి. షాపు వాళ్ళలాగ ఏది ఎంత % అన్నది చెప్పలేను. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కేలొరీలు బాగా ఖర్చు అవుతాయి కాబట్టి పిల్లలకు ఇది చాలా ఉపయోగకరం.
తయారి విధానం:
ఒక 2 స్పూన్లు పవుడర్ను తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అందులో కలుపుకుని బాగా కలిసాకా పంచదార వేసుకుని దింపేసుకోవాలి. పెద్దలు షుగర్ తినకూడనివాళ్ళు ఉంటే నీళ్ళలొ మరిగించుకున్నాకా చల్లర్చి మజ్జిగలో కలుపుకుని త్రాగచ్చు.
2 comments:
బాగుంది. కానీ పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువైనాయేమో?
ఈ వేసవి వేడికి వొంటిని చల్లబరిచే పానీయాలేమైనా చెబితే పనికొస్తాయి.
@కొత్తపాళీ: ఇది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు. కేలొరీలు బాగా ఖర్చు అవుతాయి కాబట్టి, పిల్లలకు చాలా ఉపయోగకరం అండీ.
అంతేకాక బజార్లో దొరికే హెల్త్ డ్రింక్స్ అన్నింటిలో షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరం. అందులోని పదార్ధాలన్ని పిండి పదార్ధాలు అనిపించినా వాటిలోని పోషక విలువలు శరీరానికి చాలా ఉపయోగపడతాయండీ.అనవసరం అనుకుంటే flavour కోసం వాదే బాదాం,జీడిపప్పు కలుపుకోవటం మానెయటమే.
వేసవి పానీయాలు ఐడియా బాగుందండీ..వీలైతే ప్రయత్నిస్తాను..
Post a Comment