![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFTvRKtQgyk86ifGcVx7zoUFWorg0giUc7Y8oj264fS2HmFBxyL7Dc1hlFWZEkZwQ6dWCK05Gv1sHbGbtTO-ZW6uikjHanRj3aiZ63CUtNx9IFGLNz9alIGQH0EFrFIV3czVcyjTuStcQ/s320/ramayan_AF06_l.jpg)
"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."
నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.
శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.
మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...
ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!
మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...
శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..
బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.
12 comments:
త్రుష్ణగారు,
చాలా బాగా గుర్తు చేశారు..మొన్న నేను పని మీద తెనాలి వెళ్ళాను..తెల్ల వారు ఝామునే రైలు దిగగానే అక్కడ తాటాకు పందిళ్ళు స్వాగతం చెప్పాయి..నాకు తెలిసి తెనాలి , విజయవాడ , మచిలీపట్నం లో నవమి ఉత్సవాలు చాల బాగ చేస్తారు..మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు..
i wish u da same
చాలా ఏళ్ళవరకూ మా ఇంట్లోనూ ఉషశ్రీ గారి వ్యాఖ్యానంతోనే శ్రీరామనవమి పూజ మొదలుపెట్టడం చేశాం.. ఆలోపులే మగపిల్లలు ఒకసారి బీసెంట్ రోడ్డుకి వెళ్ళి వచ్చేసి ఈసారి పూజ ఫలానా షాపు వాళ్ళు చేయిస్తున్నారని చెప్పేవాళ్ళు.. పొద్దున్నే ఇంట్లో పూజ.. సాయంత్రం బీసెంట్ రోడ్డు రాములవారి దర్శనం.. పని ఉన్నా లేకపోయినా ఆ కొబ్బరాకుల పందిరికింద ఆ చివరి నించి ఈ చివరి వరకూ నడవడం.. ఎన్నెని అందమైన జ్ఞాపకాలని కదిలించారో తృష్ణ గారూ!!
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు :-)
మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలండీ..ఏంటోనండీ..స్కూల్లో ఉంటే ఎంచక్కా శెలవు ఇచ్చేవారు శ్రీరామనవమికి...తీరిగ్గా టీ.వీలో వచ్చే రాముడు సినిమాని చూసుకుంటూ, వడపప్పు తింటూ అలా అలా గడిచేది సమయం...హ్మ్..
ఇంతకూ మీ ఆరోగ్యం ఎలా ఉందండి?
శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీకు,మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..
S. One or two times it did not happen in my experience. That years, lack of rains is observed :-)
శ్రీరామనవమి శుభాకాంక్షలు
>>మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో
ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, పందిళ్ళు వేస్తున్నారు...
మీకూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
తృష్ణ గారూ !
ముందుగా మీకు, మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. విజయవాడ నవమి రాముడుకి మిమ్మల్ని గుర్తుచేస్తాను. ఉషశ్రీ గారిని గుర్తుచేశారు. విజయవాడ రేడియోకు ఆయన లేకపోవడం తీరని లోటే ! ధన్యవాదాలు.
మీక్కూడా శ్రీ సీతారామ నవమి శుభాకాంక్షలండీ.
చాలా బాగుంది తృష్ణగారు, మరి ఈ యేడు చినుకులు పడ్డాయా :-)
మీకు,మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రేడియోలో ఆ రోజుల్లో భద్రాచలం నించి వచ్చే ప్రత్యక్ష ప్రసారం ఒక అదనపు ఆకర్షణ. జమ్మలమడక మాధవ రామ శర్మ వంటి గొప్ప పండితులు చెప్పేవారు, సందర్భోచితంగా రామాయణం శ్లోకాలు, తెలుగు రామాయణాలనించి కళ్యాణ ఘట్టం పద్యాలూ ఉదహరిస్తూ.
బాగున్నై మీ ముచ్చట్లు
Post a Comment