సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 31, 2010

సాక్షి ఆదివారం(28-3-10) పుస్తకం...

మా ఇంట్లో రోజూ వచ్చే దినపత్రికలు ఆంధ్ర జ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా,ఎకోనోమిక్ టైమ్స్. సాక్షి వచ్చిన కొత్తల్లో నా పోరు పడలేక కొన్నాళ్ళు "సాక్షి" తెప్పించినా తిరిగి ఆంధ్రజ్యోతి కే మారిపోయారు. కనీసం ఆదివారం సాక్షి పుస్తకం కొని తెండి అంటే మావారు ఎప్పుడు "మర్చిపోతారు" పాపం ... అలాంటిది మొన్న ఆదివారం అనుకోకుండా నామాట గుర్తుండి ఆదివారం "సాక్షి" కొనితెచ్చారు.

అదృష్టవశాత్తు అది వాళ్ళ రెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక అవటంతో కొన్ని మంచి సంగతులు దానిలో ఉన్నాయి. కూడలి నేను రేగులర్గా చూడటం లేదు కాబట్టి ఎవరన్నా దీనిని గురించి రాసేసారేమో తెలియదు. తెలియనివాళ్ళు ఉంటే చదువుతారని ఈ టపాలో రాస్తున్నాను...

28వ తారీకు ఆదివారం ఈ-పేపర్ లింక్ ఇక్కడ చూడచ్చు.
ఇంతకీ అందులో ఉన్న తాయిలం ఏమిటంటే ....


"తప్పక చూడాల్సిన 100 సినిమాలు"

"తప్పక చదవాల్సిన 100 తెలుగు పుస్తకాలు"


"తప్పక వినాల్సిన 100 తెలుగు పాటలు"

జాబితాలోని సినిమాలు ఒక పది తప్ప మిగిలినవన్నీ చూసినవే,పాటలు దాదాపు అన్ని విన్నవే. చాలామటుకు నాదగ్గర ఉన్నవే. కానీ పుస్తకాలు మాత్రం పది పదిహేను మించి చదివినవి లేవు...మిగిలినవన్నీ చదవాల్సినవే..!!


ఆలస్యమెందుకు...ఇప్పటిదాకా ఈ ఆదివారం పుస్తకం చదవనివాళ్ళు ఉంటే తప్పక చదివి ఆనందించేయండి మరి ...

13 comments:

రమణ said...

కృతజ్ఞతలు.

మురళి said...

ఈ పుస్తకం మేమింకా చదవక ముందే పక్కింటి వాళ్ళు 'చదివేసి ఇస్తాం' అని తీసుకెళ్ళి ఇంతవరకూ ఇవ్వలేదండీ.. నేను ఈపేపర్ లో చదివేశా.. పుస్తకం వస్తుందో రాదో..:(:(

తృష్ణ said...

@రమణ : ధన్యవాదాలండీ.

@ మురళి: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి...సంతోషం...!
పుస్తకం నేను చదవకుండానే ఆనందం పట్టలేక "సాక్షి" తెప్పించుకోని వాళ్ళందరికి ఫోన్ చేసి కొనుక్కోమని చెప్పిన తరువాత నేను చదివాను పుస్తకం..:) అందులో 75% పుస్తకాలు మురళిగారు చదివేసి ఉంటారని కూడా అనుకున్నానండి.

అరువుకి వెళ్ళిన పుస్తకాలు తిరిగి రావటం తక్కువే...వచ్చినా రూపం కాస్తా తారుమారై వస్తుందని మాకు స్వానుభవం..:)

ప్రియ said...

Many thanks. I missed it. Will read it on e paper. Of course, ikkada dorakadanukondi hard copy

కెక్యూబ్ వర్మ said...

థాంక్సండీ, నేను మిస్ అయ్యాను. ఇలా మీరు గుర్తు చేయడంతో తప్పక చదవాలనిపించింది.

Anonymous said...

ఈ ఏడాది 'సాక్షి' పేపరు వాళ్ళు చేసిన మంచి పని ఇదొకటే. మీరన్నట్లుగా ఆదివారం అనుబంధం అద్భుతం గా ఉంది. పర్వాలేదూ మనవాళ్ళకీ కాస్తంత 'కలా పోసన' ఉందీ అనిపించుకున్నారు.

హరే కృష్ణ said...

ఆదివారం రాయల్సిన్దండీ ఇక్కడఈ టపా పాత పేపర్లు కావాలంటే మాటుంగా వెళ్ళాలి :(

తృష్ణ said...

@ప్రియ: తప్పక చదవండి. పాత పాటలు అన్ని వినకపోయినా ఎక్కడైనా ఒక చోట చూస్తే కూడా ఆనందంగా ఉంటుంది.

@కేక్యూబ్: తప్పక చదవండీ...ధన్యవాదాలు.

తృష్ణ said...

@ హరేఫల: నేనూ అదే అనుకున్నానండి...మేము తెప్పించకపోయినా నాన్నగారి దగ్గరకి వెళ్ళినప్పుడు చూస్తూంటాను.

@ హరేకృష్ణ : ఆదివారం రాసే ఓపిక లేకపోయిందండీ...అందుకే కదా ఈ-పేపర్ లింక్ ఇచ్చాను..వీలైతే ప్రింట్ అవుట్ తీయించేసుకోండి మరి. పదిలంగా దాచుకోవచ్చు.

భావన said...

మంచి లింక్ ఇచ్చారు తృష్ణ. బాగుంది పుస్తకం. ఇప్పుడే మొదలు పెట్టేను చదవటం. ఠ్యాంక్స్.

తృష్ణ said...

@bhaavana: సేవ్ చేసుకుని దాచుకోవాల్సిన ఇంఫొర్మేషన్ అండీ..!

veera murthy (satya) said...

ఆ వీక్లీ చూసినపుడు నాకు మీరె గుర్తొచ్చారు...!

తృష్ణ said...

@satya: really..? thankyou..:)